English | Telugu
మిరాయ్ టీజర్..కలియుగంలో పుట్టిన ఏ శక్తీ ఆపలేదు
Updated : May 28, 2025
హనుమాన్(Hanuman)తో పాన్ ఇండియా హిట్ ని అందుకున్న 'తేజ సజ్జ'(teja sajja)తన తదుపరి చిత్రంగా 'మిరాయ్'(Mirali)చేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ యోధా అనే ఉపశీర్షిక తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సరసన 'రితికా నాయక్' జత కట్టింది. . 'మంచు మనోజ్' విలన్ గా చేస్తుండగా, జగపతి బాబు, శ్రీయ, జయరామ్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
రీసెంట్ గా 'మిరాయ్' నుంచి టీజర్ రిలీజ్ అయ్యింది. రెండు నిమిషాల పంతొమ్మిది సెకన్ల నిడివి ఉన్న టీజర్ ని చూస్తుంటే, మేకర్స్ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నారనే విషయం అర్ధమవుతుంది. జయరామ్ క్యారక్టర్ మాట్లాడుతు జరగబోయేది మారణహోమం. శిధిలం కాబోతుంది అశోకుడి ఆశయం. కలియుగంలో ఏ శక్తీ దీన్ని ఆపలేదు. కాకపోతే దీనికీ మార్గం దైవం కాదు, ఒక ఆయుధం చూపిస్తుందని, దాని పేరే మిరాయ్' అని చెప్పాడు. దీన్ని బట్టి ఆయుధం పేరునే మూవీకి టైటిల్ గా పెట్టారనే విషయం అర్ధమవుతుంది. కలియుగానికి, ప్రాచీన యుగానికి సంబంధించిన కథతో కూడా మిరాయ్ తెరకెక్కబోతుందని అనుకోవచ్చు. మనోజ్ క్యారక్టర్ ని చూస్తుంటే భూమండలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నువ్వెవరు, నీ లోపల ఏముందో తెలుసుకో అని తేజ సజ్జ తో రితికా నాయక్ అంటుంది. 'మిరాయ్' ని తేజ సజ్జ దుష్ట శిక్షణకి వాడటం,
లాంటివి కూడా మూవీపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. టీజర్ చివర్లో కాషాయ వస్త్రాలతో ఉన్న ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఫేస్ రివీల్ చెయ్యలేదు.ఆ వ్యక్తి అలా వస్తుంటే వానర సైన్యం వంగి వంగి దండాలు పెడుతుంది. దీంతో ఆ వ్యక్తి ఎవరనే క్యూరియాసిటీ తో పాటు కథపై అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.
పోరాట సన్నివేశాలతో పాటు, మూవీలోని ప్రతి క్యారక్టర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉందనే విషయం టీజర్ ద్వారా అర్ధమవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి జి విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కార్తీక్ ఘట్టమనేని(Karthuk Gattamneni)దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు మొత్తం ఏడు లాంగ్వేజెస్ లో సెప్టెంబర్ 5 న విడుదల కానుంది.
