English | Telugu

మంచు విష్ణుని హర్ట్ చేసిన సింగిల్ ట్రైలర్!

మంచు విష్ణుని హర్ట్ చేసిన సింగిల్ ట్రైలర్!

 

శ్రీవిష్ణు సినిమాల్లో అర్థమై అర్థంకానట్టుగా కొన్ని బూతు మాటలు వినిపిస్తుంటాయి. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అందుకేనేమో శ్రీవిష్ణు సినిమా సినిమాకి డోస్ పెంచుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు పలువురు సినీ స్టార్స్ ని కూడా ఇమిటేట్ చేస్తున్నాడు. గతంలో బాలకృష్ణను ఇమిటేట్ చేసిన శ్రీవిష్ణు.. తాజాగా 'సింగిల్' ట్రైలర్ లో కూడా ఇమిటేట్ చేశాడు. ఇలాంటివి బాలయ్య పట్టించుకోరు. అభిమానులు కూడా సరదాగానే తీసుకున్నారు. దాంతో సమస్య లేదు. అయితే మంచు విష్ణుని ఇమిటేట్ చేయడం మాత్రం వివాదాస్పదం అయ్యేలా ఉంది. (Single Trailer)

 

శ్రీవిష్ణు నెక్స్ట్ మూవీ 'సింగిల్' మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా బాగానే ఉంది కానీ, ఇందులోని రెండు డైలాగ్ లకు మంచు విష్ణు హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోని "శివయ్యా" డైలాగ్ బాగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ డైలాగ్ ను శ్రీవిష్ణు ఇమిటేట్ చేశాడు. అలాగే "మంచు కురిసిపోతుంది" అంటూ ద్వందార్థం వచ్చేలా ఉన్న మాటను కూడా ఉపయోగించాడు. సింగిల్ ట్రైలర్ లోని ఈ డైలాగ్ లకు మంచు విష్ణు బాగా హర్ట్ అయినట్లు సమాచారం. ఈ సినిమాకి అల్లు అరవింద్ సమర్పకులు కాబట్టి, ఆయనతో మాట్లాడి డైలాగ్ లను తొలగించేలా చేయడమో లేదా ఈ విషయాన్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లడమో చేసే అవకాశముంది అంటున్నారు.