English | Telugu

కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !

కుబేర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)ధనుష్(Dhanush)కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ 'కుబేర'(Kuberaa). పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ ,మలయాళ, హిందీ భాషల్లో నిన్న రిలీజ్ అయ్యింది. నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna)మొట్టమొదటిసారి తన కెరీర్ లో ఒక విభిన్నమైన రోల్ ని పోషించగా దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar Kammula)కూడా ఫస్ట్ టైం తన జోనర్ కి భిన్నంగా తెరకెక్కించాడు. జిమ్ సర్బ్, భాగ్యరాజ్, హరీష్ పెరడి, సునయన, దలిప్ తాహిల్, నాజర్, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఇక కుబేర మొదటి రోజు 13 కోట్ల రూపాయిలు వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాల నుంచి రిపోర్ట్ వస్తుంది. ధనుష్ ప్రీవియస్ మూవీ రాయన్ మొదటి రోజు 16 కోట్లరూపాయలు వసూలు చేసింది. కుబేర కి ప్రస్తుతం పాజిటివ్ టాక్ ఉన్న దృష్ట్యా ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీపక్ అనే మాజీ సిబిఐ పోలీస్ అధికారి క్యారక్టర్ లో నాగార్జున పోషించగా, దేవా అనే బిచ్చగాడు గా ధనుష్ కనపడ్డాడు. ఈ ఇద్దరు బడా హీరోలు తమ హీరోయిజానికి భిన్నంగా, తమ తమ క్యారెక్టర్స్ లో నటించి కుబేర మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దేవిశ్రీ ప్రసాద్(Devisriprasad)సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.