English | Telugu

అన్నయ్య నన్ను విషం పెట్టి చంపాలనుకున్నాడు.. అమ్మని డబ్బు కోసం చంపారు!

అన్నయ్య నన్ను విషం పెట్టి చంపాలనుకున్నాడు.. అమ్మని డబ్బు కోసం చంపారు!

 

ప్రముఖ నటుడు ఆనందరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో 'గ్యాంగ్ లీడర్', 'పెదరాయుడు', 'సూర్యవంశం', 'చెన్నకేశవ రెడ్డి' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి ఆనందరాజ్ గురించి.. ఆయన తమ్ముడు, డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను పంచుకున్నారు.

 

అలనాటి గాయని స్వర్ణలత కుమారులే ఈ ఆనందరాజ్, అనిల్ రాజు. అయితే ఈ ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో దూరం పెరిగిందట. తాము పుట్టినప్పుడు అన్నదమ్ములం, పెరిగాక దాయాదులం అని అనిల్ రాజు అన్నారు. 

 

"నేను మా అమ్మకి చిన్న కొడుకుని. నన్ను ఎంతో ప్రేమించేది. అయితే నాకు యుక్త వయసులో అమ్మాయి లక్షణాలు వచ్చాయి. జుట్టు పెంచుకోవాలని, చీర కట్టుకోవాలని అనిపించేది. దాంతో మా అన్నయ్య పాలల్లో విషం పెట్టి నన్ను చంపేద్దామని చెప్తే.. దానికి మా అమ్మ ఒప్పుకోలేదు. నాకు నచ్చినట్టు ఉండమని చెప్పింది." అని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.

 

"నేను అమ్మ మాట వినేవాడిని. మా అన్నయ్య మాత్రం తన భార్య మాట వినేవాడు. మా వదిన మాట విని అమ్మను వృద్ధాశ్రమంలో కూడా వేయాలనుకున్నాడు మా అన్నయ్య. దాంతో మా ఇద్దరి మధ్య వాదనలు జరిగి, బాగా దూరం పెరిగిపోయింది." అని అనిల్ రాజు తెలిపారు.

 

"మా అమ్మ రాయలసీమ అమ్మాయి. వాళ్ళది ధనవంతుల కుటుంబం. గాయనిగానూ బాగా సంపాదించింది. పొలాలు, బంగారం బాగా ఉన్నాయి. 1997 మార్చి 5న కారులో డ్రైవర్ తో కలిసి నేను, అమ్మ వెళ్తుండగా.. మాపై దాడి చేశారు. అప్పుడు కారులో 4 లక్షల డబ్బు, కొంత బంగారం ఉంది. ఆ దాడిలో గాయపడిన అమ్మ.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ, ఆమె పుట్టినరోజు నాడే మార్చి 10న చనిపోయారు." అని అనిల్ రాజు చెప్పుకొచ్చారు.

 

 

అన్నయ్య నన్ను విషం పెట్టి చంపాలనుకున్నాడు.. అమ్మని డబ్బు కోసం చంపారు!