Read more!

English | Telugu

ఎన్టీఆర్ తో ఫ్యామిలీ డైరెక్టర్..!

 

టాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన నటించిన 'రభస' సినిమా రిలీజ్ సిద్దమవుతుండగా, మరోవైపు పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా దర్శకుడు మరెవరో కాదు..కొత్త బంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో తన శైలి చూపించిన శ్రీకాంత్‌ అడ్డాల. ఇటీవల ఓ సంధర్బంలో ఎన్టీఆర్ ను కలిసిన శ్రీకాంత్ ఓ స్టొరీ వినిపించాడట. అది ఎన్టీఆర్ కి నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ 'ముకు౦ద' సినిమాతో బిజీగా వున్నాడు. ఇది రిలీజ్ కాగానే జూనియర్ - అడ్డాల మూవీ సెట్స్‌పైకి వెళ్లబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.