Read more!

English | Telugu

ఎన్టీఆర్ దెబ్బకు వెవక్కి తగ్గిన రవితేజ

 

రవితేజ హీరోగా నటించిన చిత్రం పవర్. ఈ చిత్రంలో హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర రెడ్డి (బాబి) దర్శకత్వం వహించారు. గతంలో బాబి.. రవతేజ నటించిన బలుపు చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయగా, అల్లుడు శ్రీను సినిమాకి కథను అందించారు. ఈ సినిమాకి సంగీతం తమన్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్‌‌లో సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత తెలియజేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన తొలిసారిగా హన్సిక నటి౦చింది.

 

మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 29న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస చిత్రం విడుదల అవుతుండటంతో ఈ సినిమాని వాయిదా వేశారు. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదల ఐతే ధియేటర్స్ సమస్య వస్తుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిదని పలువురు అభిప్రాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.