Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ 'బెంగాల్ టైగర్' కాదు..!

తెలుగు సినిమా ప్రేక్షకులకు బెంగాల్ టైగర్ అంటే గుర్తుకువచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ఎందుకంటే ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ 'ఖుషి' సినిమాలో చెప్పే ఫేమస్ డైలాగే బెంగాల్ టైగర్ సిద్దూ సిద్ధార్థ రాయ్. ఇప్పుడు ఈ డైలాగ్ ని తన సినిమా పేరుగా మార్చుకోబోతున్నారు పవర్ ఫుల్ హీరో రవితేజ. ఇక్కడ విశేషమేమిటంటే ఈ టైటిల్ వాడాలని డిసైడ్ చేసింది ఎవరో కాదు పవన్ క్యాంప్ నుంచి రవితేజ క్యాంప్ కు జంప్ అయిన సంపత్ నంది. జంప్ అయితే అయ్యాడు కానీ రవితేజకి మంచి పవర్ ఫుల్ టైటిల్ పట్టుకొచ్చాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రవితేజ ప్రస్తుతం కిక్-2 సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు షూటింగ్ స్టార్ట్ అవుతుందట.