Read more!

English | Telugu

రారా కృష్ణయ్యలో అలరించింది రాధమ్మేనట

 



వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం విజయం తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన చిత్రం రారా కృష్ణయ్య.  కొత్తజంట, రొటీన్ లవ్ స్టోరి 'ఫేం' రెజీనా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో రెజీనా బాగా రంజింపచేసిందంటున్నారు. కృష్ణయ్య పాత్రలో సందీప్ కిషన్ తన ఎనర్జీ పూర్తి స్థాయిలో చూపించడానికి అవకాశం లేకపోయిందట. నూతన దర్శకుడు మహేశ్ బాబు.పి రూపొందించిన 'రారా...కృష్ణయ్య' కిడ్నాప్ నేపథ్యంలో సాగే ప్రేమ కథ.

 


జూలై 4 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో కామెడీతో పాటు రెజీనా గ్లామర్ ఎక్కువ మందిని ఆకట్టుకుంటోందిట. చలాకీగా, అల్లరిగా, గ్లామరస్ గా, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కి రెజీనా మరోసారి న్యాయం చేసిందిట ఈ సినిమాలో. లెజెండ్ సినిమాతో కొత్త తరహా పాత్రలు చేస్తున్న జగపతి బాబు జగ్గు పాత్ర కాస్టుమ్స్, స్టైల్ ఆకట్టుకునేలా వుందట.