Read more!

English | Telugu

పవన్ కళ్యాణ్ 3విక్రమ్ కొత్త సినిమా‍ !

 


పవన్ కళ్యాణ్ చేతిలో వున్న సినిమాలు ముగించుకొని, తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడతారనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఈ అంశానికి మద్ధత్తు అన్నట్టుగా పవన్ గోపాల గోపాల, గబ్బర్ సింగ్-2 చిత్రాల తర్వాత ఏ సినిమాలు ఒప్పుకున్నట్లు సమాచారం లేదు. ఇక గబ్బర్ సింగ్ -2 చిత్రం పవన్ పెట్ ప్రాజెక్టుగా మారిందని, ఆ సినిమా పై ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు.

ఇదలా వుంచితే, తాజాగా పవన్ గబ్బర్ సింగ్ -2 తర్వాత మరో సినిమా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారని, ఆ సినిమా పూర్తి చేసాక, పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్తారని టాలీవుడ్ లో ఆసక్తికర కథనాలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు టాలీవుడ్ సూపర్ హిట్ ఫిలింస్ గా నిలిచాయి. వీరి కాంబినేషన్లో మరో చిత్రం వస్తే తప్పకుండా హ్యాట్రిక్ హిట్ అవుతుందంటు అంచనాలు కూడా మొదలయ్యాయి టాలీవుడ్‌లో. 

పవన్  రాజకీయాల్లోకి రావటం  ఆనందాన్ని కలిగిస్తున్నా, ఆయన సినిమాలకు దూరం అవుతారన్న విషయాన్ని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరో చిత్రంలో నటిస్తారనే విషయం ఫ్యాన్స్ కు తప్పకుండా తీపికబురే.