Read more!

English | Telugu

కాజల్‌కి ఆ కోటి రూపాయలు ఎవరిచ్చారబ్బా !



 
 
టాలీవుడ్ లో సక్సెస్ హీరోయిన్ గా మారి, బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, కొంత కాలానికే మళ్లీ సౌత్ కు చేరుకున్న కాజల్ కి ఆ మధ్య సరైన ఆఫర్స్ రాలేదనే చెప్పాలి. దీనికి కారణం కాజల్ బాగా రెమ్యూనరేషన్ పెంచడమే అని ఫిలిం వర్గాల్లో టాక్.  అంతే కాదు షూటింగ్ షెడ్యూల్ సమయంలో హాలీడేలకు వెళ్లి కొంతమంది నిర్మాతలను ఇబ్బంది పెట్టిందని కూడా చెప్పుకుంటున్నారు. ఏమైనా ఇప్పుడు మళ్లీ కాజల్ చేతిలో రెండు సినిమా ప్రాజెక్టులున్నాయి.
 
అయితే ఈ సినిమాలకు ఆమె కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఆమెను అడగ్గా,  తనకు ఏ నిర్మాత అంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని, అసలు ఇలాంటి విషయం ఎందుకు ప్రచారంలోకి వచ్చిందంటూ అవాక్కయిందట. కోటి రూపాయలు ఇస్తే వద్దని ఎందుకంటాను, అయినా అలా ఇచ్చిన వారెవరో చెప్పమంటూ ఆ మాట అడిగిన వారిని నిలదీసిందట. కోటి రూపాయల విషయం అడిగిన వారు తెల్లమొహం వేయాల్సి వచ్చిందట. దీంతో కాజల్ కి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే డిమాండ్ వున్నట్టా, లేనట్టా అనే కొత్త సందేహం మొదలైంది.