Read more!

English | Telugu

5 లక్షలకి ఒప్పేసుకుంది..!

 

ఇండియన్ సినిమా గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్, ఆయన రెండో కూతురు అక్షర హాసన్ ఇప్పుడు ‘షమితాబ్’ ద్వార ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాకి ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాల అయిదు లక్షల రూపాయల మాత్రమేనట. అయితే ఈ సినిమాకి అంత తక్కువ తీసుకోవటం వెనుక ఓ రహ్యస్యం వుందట. ‘షమితాబ్’తో తనకి బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందని భావిస్తుందట. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ ని ఇస్తే, తన ఫిల్మ్ కెరీర్ కి ఇది ఎంతో ప్లస్ అవుతుందని అంతే కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డిమాండ్ పెరుగుతుంది. అందుకే ఈ మూవీ ఆఫర్ వచ్చిన వెంటనే ఓకే చెప్పిందట అక్షర హాసన్. ఒకవేళా ఈ సినిమా మిస్ అయితే తన అక్క శృతిహాసన్ లాగే స్టార్టింగ్ ట్రబుల్ ని ఎదుర్కొవలసి ఉంటుందని చెబుతుందట. అక్షర హాసన్ ముందుచూపుని గమనించిన సన్నిహితులు అక్క శృతి హాసన్కు పోటిగా నిలుస్తుందని అంటున్నారు.