Read more!

English | Telugu

ఐశ్వర్య, అభిషేక్ ల డైవర్స్ కి ఆమె కారణమా

బాలీవుడ్ రాయల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్త మీడియాలో గుప్పుమంటోంది. హృతిక్, సుజాన్ రోషన్ ల విడాకుల గురించి మీడియాలో చాలా కాలం చర్చ జరిగిన విషయం తెలిసింది. వారి తరువాత ఐష్, అభిల డైవర్స్ గురించి కథనాలు మొదలయ్యాయి.
ఈ మధ్యే 7 వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న ఈ దంపతులు, పెళ్లైన నాటి నుంచి చక్కటి అన్యోన్య దంపతులుగా అనుకూల దాంపత్యాన్నే కొనసాగిస్తు వస్తున్నారు. అయితే ఐష్ అత్తగారు జయాబచ్చన్ కి, ఐష్ కి మధ్య వాతావరణం సరిగా పొసగటం లేదనే వార్తలు ఎప్పటి నుంచొ వస్తున్నాయి. అలాంటి చాలా  సందర్భాల్లో  అభిషేక్, ఐశ్వర్యని సపోర్ట్ చేస్తు వచ్చాడని, కానీ ఇప్పుడు అభిషేక్ కూడా ఏం చేయలేనంతగా పరిస్థితి విషమించిందట. ఇక ఈ రిలేషన్ షిప్ కు వీడ్కోలు పలకాలని వారు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇలా ఐష్, అభీ విడాకుల గురించి ఇంతకు ముందు కూడా కొన్ని సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచం మెచ్చిన అందాల సుందరి కూడా ఒక అత్తకు కోడలే. అత్తను మెప్పించలేని ఈ కోడలు ఇకపై ఏం చేస్తుందో...