Read more!

English | Telugu

రుద్రమదేవి షూటింగ్‌లో ప్రమాదం

 


చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రానికి మరో ఎదురుదెబ్బ. చిత్రం కోసం తెప్పించిన నగల చోరీ విషయం ఇంకా తేలక ముందే ఆ సినిమా గురించిన మరో వార్త వినిపిస్తోంది. రుద్రమదేవి షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో సినిమాకు చెందిన స్టంట్ మ్యాన్ తీవ్ర గాయాలకు గురయ్యాడని, అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిచారని  టాలీవుడ్ వర్గాల కథనం. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ఆ చిత్ర యూనిట్ ఏ విషయం వెల్లడించలేదు. అందువల్ల ఇది పూర్తిగా నిజం అని నిర్ధారించడానికి అవకాశం లేదు.
గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అనుష్క, అల్లు అర్జున్, రానా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.