Read more!

English | Telugu

ఈ వాచ్‌ ధర రూ.23 కోట్లు.. ఇది ఆ స్టార్‌ హీరో సొంతం!

సినిమా ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీస్‌ ఎప్పుడూ వార్తల్లోనే ఉండాలని ప్రయత్నిస్తుంటారు. వెకేషన్‌కి వెళ్ళడం ద్వారా కావచ్చు, కొత్త కారు కొనుక్కోవచ్చు.. ఇలా ఏదో ఒక కారణంతో తమ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ హల్‌చల్‌ చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అదే చేస్తున్నాడు. సినిమాల్లోనే కాదు, బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్న సల్మాన్‌ ‘బిగ్‌బాస్‌’ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతేకాదు, కమర్షియల్‌ యాడ్స్‌లో కూడా తరచూ కనిపించే సల్మాన్‌ రెమ్యునరేషన్‌ కూడా ఎంతో భారీగానే ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి స్టార్‌ హీరో ఏది చేసిన సెన్సేషనే కదా. పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న సల్మాన్‌కి మొదటి నుంచి వాచ్‌ కలెక్షన్‌ అంటే చాలా ఇష్టం. అందుకే రకరకాల వాచ్‌లతో ప్రత్యక్షమవుతుంటాడు. 

సల్మాన్‌ఖాన్‌ ఓ వజ్రాల వాచ్‌తో ఫోటోలో కనిపించాడు. ఆ వాచ్‌ అందర్నీ ఆకర్షించింది. సల్మాన్‌ ఖరీదైన వాచ్‌లతో కనిపించడం కొత్త కాకపోయినా ఈసారి అతని చేతికి ఉన్న వాచ్‌ మాత్రం డిఫరెంట్‌గా అనిపించింది.  ఈ వాచ్‌ ధర ఎంతో కాదు, రూ.23 కోట్లు మాత్రమే. పాటెక్‌ ఫిలిప్‌ రెయిన్‌బో కంపెనీకి చెందిన ఈ వాచ్‌లో వాచ్‌ లో దాదాపు 130 వజ్రాలు పొదిగి ఉన్నాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు ‘టైగర్‌.. సూపర్‌’, ‘అదిరిపోయింది అన్నా..’, ‘ఇందులో నువ్వు కింగ్‌..’ అంటూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు.