Read more!

English | Telugu

న‌య‌న్ మాట‌లు విని షాక్ అయిన షారుఖ్‌!

షారుఖ్ ఇప్పుడు ప‌ఠాన్ స‌క్సెస్‌తో క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ తెర‌కెక్కించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ ఆనందంతోనే జ‌వాన్ సెట్లో అడుగుపెట్టేశారు షారుఖ్‌. ప‌ఠాన్‌కి సంబంధించిన స్పెష‌ల్‌గా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌లేదు షారుఖ్‌. ఎందుకు ఇవ్వ‌ట్లేద‌ని ఎవ‌రో అడిగితే సింహం ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌దు క‌దా అని అనేశారు స‌ర‌దాగా.

ప‌ర్టిక్యుల‌ర్‌గా సినిమా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికీ, సోష‌ల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఠ‌కీమ‌ని స‌మాధానం చెబుతున్నారు షారుఖ్‌ఖాన్‌. లేటెస్ట్ గా ఓ నెటిజ‌న్ న‌య‌న‌తార గురించి అడిగారు.

షారుఖ్ హీరోగా న‌టిస్తున్న జ‌వాన్ సినిమాలో నాయిక‌గా న‌టిస్తున్నారు న‌య‌న‌తార‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఫ‌స్ట్ సినిమా ఇది. న‌య‌న్ గురించి మాట్లాడిన షారుఖ్ "ఆమె చాలా అద్భుత‌మైన న‌టి. స్వీట్ ప‌ర్స‌న్‌. అన్నీ భాష‌ల‌ను చాలా అన‌ర్గ‌ళంగా మాట్లాడుతుంది. ఆమెతో ప‌నిచేయ‌డం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియ‌న్స్. అంద‌రికీ మా ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే అట్లీ జ‌వాన్ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను" అని అన్నారు. మ‌రో నెటిజ‌న్ విజ‌య్ సేతుప‌తి గురించి అడ‌గ్గా "ట్రెమండ‌స్‌... కానీ కాస్త పిచ్చిత‌నం ఉంది" అంటూ స‌ర‌దాగా టీజ్ చేస్తూ బ‌దులిచ్చారు.

ఈ ఏడాది ఆల్రెడీ ప‌ఠాన్ స‌క్సెస్‌తో జ‌న‌వ‌రిలో స‌క్సెస్ కొట్టేశారు షారుఖ్‌. ఏడాది మ‌ధ్య‌లో స‌మ్మ‌ర్ గిఫ్ట్ గా రిలీజ్ అవుతుంది న‌య‌న‌తార‌తో న‌టించే జ‌వాన్‌. ఇయ‌ర్ ఎండింగ్‌లో డంకీ సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతోంది. రాజ్‌కుమార్ హిరానీ ద‌ర్శ‌క‌త్వంలో డంకీలో న‌టిస్తున్నారు షారుఖ్‌ఖాన్‌. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

జ‌వాన్‌, డంకీ కూడా హిట్ అయి, బాక్సాఫీసుల‌ను కొల్ల‌గొడితే, ఇంకో ప‌దేళ్లు షారుఖ్ కి అస‌లు తిరుగే ఉండ‌ద‌న్న‌మాట‌.