Read more!

English | Telugu

'లాల్ సింగ్ చడ్ఢా' ట్రైలర్.. ఆమిర్ ఖాన్ కి అండగా చైతన్య!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్ఢా'. ఇందులో ఆమిర్ కి జోడీగా కరీనా కపూర్ నటిస్తుండగా.. అక్కినేని హీరో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

తాజాగా విడుదలైన 'లాల్ సింగ్ చడ్ఢా' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని బట్టి చూస్తే.. నడవలేని, అమాయకుడైన ఓ పిల్లాడు.. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో మానసికంగా దృఢంగా మారి జీవితంలో ఎలా పరుగులు తీశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇందులో ఆమిర్ స్నేహితుడిగా చైతన్య కనిపించనున్నాడు. సరదాగా ఉంటూనే స్నేహితుడికి అన్నివిధాలా అండగా నిలిచే క్యారెక్టర్ అని తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ సినిమా పట్ల ఆసక్తిని పెంచేలా, ఆకట్టుకునేలా ఉంది.

ఆమిర్ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.