Read more!

English | Telugu

కంగ‌నా రాజ‌కీయాల్లోకి వ‌స్తారా?

కంగ‌నా ర‌నౌత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా?  అస‌లు పాలిటిక్స్ గురించి ఆమెకు ఎంత అవ‌గాహ‌న ఉంది?  పొలిటిక‌ల్ కెరీర్‌ని ఛూజ్ చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నారా? ఇప్పుడు ముంబైలో ఇదే టాక్‌. ఫైర్‌బ్రాండ్‌గా పేరుంది ముంబైలో కంగ‌నా ర‌నౌత్‌కి. త‌న‌కు న‌చ్చనివారు ఎవ‌రైనా స‌రే, ముఖం మీదే చెప్పేసే గ‌ట్స్ ఉన్న లేడీగా పేరు తెచ్చుకున్నారు కంగ‌న‌. బాలీవుడ్ మాఫియా గురించి, నెపోటిజం గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఓపెన్‌గా ఒపీనియ‌న్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎవ‌రైనా ఎదురుదాడికి దిగితే, వెంట‌నే వారికి స‌మాధానం ఇచ్చేస్తారు.

నార్త్ ఆడియ‌న్స్ గ్రీక్ గాడ్‌గా కొలిచే హృతిక్ రోష‌న్‌కి న‌టించ‌డం తెలియ‌ద‌ని, అత‌ను న‌టించ‌డాన్ని తానెప్పుడూ చూడ‌లేద‌ని మ‌రో వివాదానికి తెర‌లేపారు కంగ‌న‌. హృతిక్‌కీ, కంగ‌న‌కు మ‌ధ్య అప్ప‌ట్లో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిచింద‌న్న‌ది ఓపెన్ సీక్రెట్‌. ఈ విష‌యాల‌న్నీ ప‌క్క‌న‌బెడితే, నెట్టింట్లో ఓ నెటిజ‌న్ అడిగిన ప్రశ్న‌కు కంగ‌న చెప్పిన స‌మాధానం గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. `మీకు రాజ‌కీయాలంటే ఇష్ట‌మా?  మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తారా?` అని ప్ర‌శ్నించారు ఓ నెటిజ‌న్‌. అన్నిటికీ సూటిగా, కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు స‌మాధానం చెప్పే కంగ‌న‌, దీనికి ఆన్స‌ర్ ఇవ్వలేదు. `నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తానో లేనో, ఇప్పుడు చెప్ప‌లేను. ఆ స‌మ‌యాన్ని, సంద‌ర్భాన్ని బ‌ట్టి తీసుకోవాల్సిన నిర్ణ‌యం అది` అని అన్నారు.

ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ సినిమాలో న‌టిస్తున్నారు కంగ‌నా ర‌నౌత్‌. ఈ చిత్రానికి ఆమె ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హిస్తున్నారు. మ‌రోవైపు సౌత్‌లో చంద్ర‌ముఖి2లోనూ న‌టిస్తున్నారు. జ్యోతిక‌లాగా చంద్ర‌ముఖి కేర‌క్ట‌ర్‌ని తాను చేయలేమోన‌ని, ఓపెన్ అయ్యారు ఈ మ‌ధ్య‌. ఈ రెండు సినిమాల స‌క్సెస్ కంగ‌న‌కి చాలా కీల‌కం.అందుకే స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా నెట్టింట్లో ఫ్యాన్స్ తో ముచ్చ‌ట్లు పెడుతున్నారు. షారుఖ్‌, కంగ‌న ఇద్ద‌రూ ఈ రేంజ్‌లో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు అందుబాటులో ఉండ‌టంతో మిగిలిన సెల‌బ్రిటీలు కూడా ఈ విష‌యం మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయ‌క త‌ప్ప‌ద‌న్న‌ది వైర‌ల్ అవుతున్న మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్‌.