Read more!

English | Telugu

గ్రాండ్‌గా 'హేరా ఫేరీ' త్రీక్వెల్ షురూ


అక్ష‌య్‌కుమార్‌, సునీల్ శెట్టి, ప‌రేష్ రావ‌ల్ మ‌ళ్లీ సెట్లో క‌లిశారు. రాజు, శ్యామ్‌, బాబురావు పాత్ర‌ల్లో వాళ్లు సంద‌డి చేసిన సినిమాకు త్రీక్వెల్ సిద్ధ‌మ‌వుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కామెడీ ఫ్రాంఛైజీ 'హేరా ఫేరీ'కి త్రీక్వెల్ మొద‌లైంది. లాస్ట్ ఇయ‌ర్ నుంచి ఈ సినిమాకు సంబంధించిన వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఈ మూవీ నుంచి అక్ష‌య్ త‌ప్పుకుంటున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే రాజు కేర‌క్ట‌ర్‌లో అక్ష‌య్ చేస్తున్నార‌నే విష‌యం ఇప్పుడు ఫైన‌ల్ అయింది.  రాజు కేర‌క్ట‌ర్‌లో అక్ష‌య్‌ని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించుకోలేమ‌ని నెటిజ‌న్లు రిక్వెస్ట్ చేయ‌డంతో, అక్ష‌య్‌ని క‌న్విన్స్ చేశారు ఫిరోజ్ న‌దియ‌డ్‌వాలా.

క‌ల్ట్ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్ల‌డానికి హెరాఫెరీ గ్యాంగ్ మ‌ళ్లీ క‌లిసింది. గ‌త కొన్ని నెల‌లుగా వీళ్ల‌ను క‌ల‌ప‌డానికి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రిగింది. ముంబైలోని ఎంప‌య‌ర్ స్టూడియోలో ఈ షూటింగ్ మొద‌ల‌యింది. ఫ‌స్ట్ పార్ట్ 1999లో, అంటే 24 ఏళ్ల క్రితం అక్క‌డే షూటింగ్‌ని ప్రారంభించుకుంది. ఇప్పుడు సేమ్ ప్లేస్‌లో త్రీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కావ‌డం సూప‌ర్బ్ అంటున్నారు ఫ్యాన్స్.

ఇప్పుడు థ‌ర్డ్ పార్ట్ కి సంబంధించి కూడా నార్త్ లో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. రాజు, శ్యామ్‌, బాబురావు పాత్ర‌ల‌కు నార్త్ లో స్పెష‌ల్ క్రేజ్ ఉంది. ఈ ఏడాది త్రీక్వెల్‌ని విడుద‌ల చేయాల‌న్న‌ది మేక‌ర్స్ ప్లాన్. గ‌త కొన్నేళ్లుగా జ‌బ‌ర్ద‌స్త్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్ష‌య్‌కుమార్‌. లాస్ట్ ఇయ‌ర్ 'రామ్‌సేతు' ఫ‌ర్వాలేద‌నిపించినా, సూప‌ర్‌డూప‌ర్ హిట్ మాత్రం కాలేదు. ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో మ‌ల్టీస్టార‌ర్ల ట్రెండ్ బాగా న‌డుస్తోంది. అందుకే 'హేరా ఫేరీ 3'కి బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.