Read more!

English | Telugu

80 కోట్ల బడ్జెట్.. 8వ రోజు కలెక్షన్ రూ.4420

కొంతకాలంగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకట్రెండు సినిమాలు మినహా వేటికి పెద్దగా కలెక్షన్స్ రావడం లేదు. స్టార్స్ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడుతున్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన 'ధాకడ్' అయితే ఎనిమిదో రోజు ఇండియా మొత్తం కలిపి రూ.4420 మాత్రమే కలెక్ట్ చేసింది.

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కెరీర్ ప్ర‌స్తుతం ఏమాత్రం బాగా లేదు. ఆమె న‌టించిన చివ‌రి 9 సినిమాల్లో ఏకంగా 8 ఫ్లాప‌య్యాయి. తాజాగా విడుదలైన 'ధాక‌డ్' సినిమా అయితే మ‌రీ ఘోరంగా ఫెయిల‌య్యింది. మొదటి రోజు ఈ సినిమా రూ.50 లక్షలు మాత్రమే రాబట్టింది. మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 1.55 కోట్లు అతి కష్టంగా కలెక్ట్ చేసిన ఈ సినిమాకి రోజురోజుకి దారుణంగా కలెక్షన్స్ పడిపోతున్నాయి. ఎనిమిదో రోజు ఈ సినిమాకి దేశవ్యాప్తంగా 20 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీంతో రూ.4420 మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి.

'ధాకడ్' సినిమాకి రూ.80 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అంత ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమాకి 8వ రోజు రూ.5 వేలు కూడా కలెక్షన్స్ రాకపోవడం కంగనా కెరీర్ లో పెద్ద మచ్చ అని చెప్పొచ్చు. ఫుల్ రన్ లో ఈ మూవీ 3 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.