English | Telugu

మొట్టమొదటి భారతీయ మహిళ అనసూయనే.. 17 ఏళ్ళ అమ్మాయితో ప్రేమ

మొట్టమొదటి భారతీయ మహిళ అనసూయనే.. 17 ఏళ్ళ అమ్మాయితో ప్రేమ

 

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో భారతీయ సినిమా అంటే ఏంటో ప్రపంచ సినిమాకి తెలిసింది.ఇప్పుడు ఈ కోవలో ఇంకో ఇండియన్ మూవీ కూడా  చేరింది. చేరడమే కాదు భారతీయులు ఎప్పటినుంచో కలలు కంటున్న ఒక అవార్డ్ ని కూడా సాధించింది.

ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ లో ఎప్పటిలాగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (cannes film festival)చాలా గ్రాండ్ గా జరుగుతుంది. 77 వ ఫిలిం ఫెస్టివల్ ఇది. . వరల్డ్ మొత్తం మీద విశేష ప్రజాదరణ పొందిన  చిత్రాలని మాత్రమే  ఇక్కడ ప్రదర్శిస్తారు. అలా ప్రదర్శించిన చిత్రాలకి  రకరకాల కేటగిరీల్లో అవార్డు లు ఇస్తుంటారు. ఆ   అవార్డు గెలుచుకోవడాన్ని  చాలా గౌరవంగా కూడా  భావిస్తారు. రీసెంట్ గా  ది షేమ్ లెస్ (the shameless)అనే మూవీని ప్రదర్శించారు. అందులో  నటించిన  అనసూయ సేన్ గుప్తా (anasuya sengupta) అన్ సర్దియన్ రిగార్డ్ లో ఉత్తమ నటి అవార్డు ని గెలుచుకుంది. దీంతో  భారతీయ సినీ చరిత్రలోనే కేన్స్  అవార్డు సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె   రికార్డు సృష్టించింది. కోల్ కతా కి చెందిన అనసూయ తొలుత ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసేది. ఆ తర్వాత షేమ్ లెస్ ఆడిషన్ కి వెళ్లి తొలిసారి ఆ చిత్రం ద్వారా నటిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. తొలి ప్రయత్నంలోనే  అవార్డు అందుకోవడం విశేషం. బల్గెరియన్ దర్శకుడు కాన్ స్టాంటిన్ భోజనోవ్ (Constantin Bojanov)ఆ చిత్రానికి  దర్శకత్వం  వహించాడు

 రేణుక అనే సెక్స్ వర్కర్ పాత్రలో  అనసూయ సేన్ గుప్తా  నటించింది. ఢిల్లీ లోని  ఒక బ్రోతల్ హౌస్ లో ఉండే రేణుక ఒక   పోలీసు ని చంపి  పారిపోతుంది. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని  సెక్స్ వర్కర్ల కమ్యూనిటీ సెంటర్స్ లో ఆశ్రయం పొందుతుంది.అక్కడ పదిహేడేళ్ల అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఏమయ్యాయి అనేదే షేమ్ లెస్ కథ 

 

మొట్టమొదటి భారతీయ మహిళ అనసూయనే.. 17 ఏళ్ళ అమ్మాయితో ప్రేమ