LATEST NEWS
వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని అన్నారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు.  ------ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రెండున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ పుంజుకుంటోంది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో వైసీపీకి షాకిచ్చారు. సౌదరదిన్నె గ్రామానికి చెందిన 150 వైసీపీ కుటుంబాలు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. జగన్ పాలనలో ప్రజలు విసుగు చెందారని బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు.  ------- కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నార ------- ఆర్కే బీచ్‌ దగ్గర సముద్రం ముందుకొచ్చింది. అంతేకాదు సముద్రపు అలల తాకిడికి భూమి బీటలు వారింది. అరకిలోమీటర్‌కు పైగా భూమి కోతకు గురైంది. బీచ్‌ నుంచి దుర్గాలమ్మ గుడివరకు కోతకు గురైంది. అటు చిల్డ్రన్‌పార్క్‌లో అడుగు మేర భూమి కుంగింది. పార్క్‌ సమీపంలో కూడా పది అడుగులు కుంగింది. భూమి కుంగడంతో ప్రహారీగోడ కూలింది. దీంతో అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు చిల్డ్రన్‌పార్క్‌ వైపు రాకపోకలను నిలిపివేశారు ------- చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. అతివేగంగాడివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు కారులో మంటలు చేలరేగాయి. చిన్నారి సహా ఐదుగురు సజీవదహనమైయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. రుయా ఆస్పత్రిలో మరో మహిళ, ఐదేళ్ల చిన్నారి చికిత్స పొందుతున్నారు. మృతులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాసులుగా గుర్తించారు. చంద్రగిరి మండలం అగరాల దగ్గర ఘటనచోటుచేసుకుంది.  ------ సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని ట్విట్టర్‌ వేదికగా ఆయన వెల్లడించారు. కందికొండ ఆరోగ్య, ఆర్థిక విషయాల గురించి తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో మాట్లాడి సాయం అందిస్తారని పేర్కొన్నారు.  ------ కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనికొస్తారు.. మున్సిపల్ మంత్రిగా పనికిరారని కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ విమర్శించారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగితే కేటీఆర్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. 2 ఎమ్మెల్సీల కోసం ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ ఫలితం రిపీట్ అవుతుందన్నారు.  -------- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వస్తుండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు తరచుగా రాష్ట్రానికి వస్తూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ఎదురుదాడికి దిగారు. ఢిల్లీలో సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట సిద్ధూ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఇవాళ కాంట్రాక్టు టీచర్లు సీఎం  ఇంటివద్ద ధర్నాకు ఉపక్రమించారు. వారితో కలిసి సిద్ధూ కూడా నిరసన తెలిపారు. ---- నాగాలాండ్‌లో సైనిక సిబ్బంది కాల్పుల్లో పొరపాటు కారణంగా 14 మంది పౌరులు సహా జవాన్ మృతి చెందారు. నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అయితే అందులో ఉన్న ఉగ్రవాదులే అని అనుమానంతో సైనికులు కాల్పులు జరిపారు. ----- ముంబయి టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాన్నుంచిన కోహ్లీ సేన... విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు.
న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పూర్తి పట్టు బిగించింది. ముంబై టెస్టులో కోహ్లీసేన గెలుపు ముంగిట నిలిచింది. కివీస్ ముందు 540 పరుగుల లక్ష్యాని ఉంచిన టీమిండియా.. విజయానికి మరో 5 వికెట్ల దూరంలో నిలిచింది. భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన న్యూజిలాండ్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అది సాధ్యమయ్యే పని కాదు. ఆటకు ఇంకా రెండ్రోజుల సమయం మిగిలుండగా, డ్రా కోసం ఆడడం కూడా కివీస్ కు శక్తికి మించిన పనే.  మూడో రోజు ఆట ముగిసే సమయానికి హెన్రీ నికోల్స్ 36, రచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రిజులో ఉన్నారు. వన్ డౌన్ లో వచ్చిన డారిల్ మిచెల్ 60 పరుగులు చేశాడు. తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 6, ఓపెనర్ విల్ యంగ్ 20, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ 6 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ బ్లండెల్ (0) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, కివీస్ 62 పరుగులకు ఆలౌటైంది. భారత్ కు కీలకమైన 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ను భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 500 పైచిలుకు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత రెండో ఇన్నింగ్స్ లోనూ మయూంక్ అగర్వార్ విజృంభించాడు. 62 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో మయూంక్ 150 రన్స్ చేశాడు .ఇక సెకండ్ ఇన్నింగ్స్ చివరలో అక్షర్ పటేల్ ధాటీగా ఆడాడు. కేవలం 26 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. భారత్ తరపున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధిస్తాడని అనుకుంటుండగా.. ఏడో వికెట్ గా జయంత్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ను కెప్టెన్ విరాట్ కోహ్లీ డిక్లేర్ చేశాడు. 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు. పీఆర్సీ సహా పెండింగ్ సమస్యలను పరిష్కారానికి ముందుకు రావడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. రెండున్నర ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు.. ఇక ఊరుకునేది లేదంటూ ఉద్యమ బాట పడుతున్నారు. ఈనెల 1వ తేదిన సీఎస్ సమీర్ శర్మకు నోటీసు ఇచ్చారు. అందులో తమ డిమాండ్ల పరిష్కారానికి వారం రోజుల గడువు ఇచ్చింది ఉద్యోగ సంఘాల జేఏసీ. తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జగన్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు ఏపీ ఉద్యోగులు. తమ సహకారం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని చెబుతున్నారు.  జగన్ సర్కార్ పై అన్ని వర్గాల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతుండగానే.. తాజాగా వైసీపీ ప్రభుత్వ తీరుపై  ఏపీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘నేను విన్నాను..నేను ఉన్నాను..చెప్పిన మాయ మాటలు విని..151 సీట్లు తీసుకొని వచ్చామని ఆయన అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.. అటువంటిదే.. ఈ పిచ్చి పిచ్చి మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లని విమర్శించారు. ఉద్యోగుల పరిస్థితేంటో చంద్రబాబుకు బాగా తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కొక్క ఉద్యోగికి 5 ఓట్లు ఉంటాయన్నారు. ఆ  లెక్కన సుమారు 60 లక్షలకుపైగా ఓట్లు ఉంటాయని, ప్రభుత్వాన్ని కూల్చవచ్చని అన్నారు. ఈ శక్తి ముందు ఎవరైన తలవంచాల్సిందేనని బండి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవో నేత మాట్లాడిన మాటల ఇప్పుడు సంచలనంగా మారాయి. వైసీపీలో గుబులు రేపుతున్నాయి. బండి శ్రీనివాస రావు ఒక్కరే కాదు ఉద్యోగులందరి అభిప్రాయం ఇలానే ఉందనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎంతవరకైనా వెళ్లేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఏం చేయబోతోంది, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.
కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మచిలీపట్నంలో తుపాకీ పొరబాటున పేలడంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావుకు తీవ్ర గాయం అయింది. బుల్లెట్ ఆయన ఛాతీలోకి దూసుకుపోయింది. దాంతో ఆయనను హుటాహుటీన జిల్లా ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు కలెక్టరేట్ లోని ట్రెజరీ వద్ద గార్డు విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా తుపాకీని శుభ్రపరిచే క్రమంలో ట్రిగ్గర్ వద్ద చేయి తగలడంతో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు తుపాకీ మిస్ ఫైర్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలు తనకు తెలపాలని ఆదేశించారు. . ఈ ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు తుపాకీని స్వాధీనం చేసుకుని, సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తున్నారు.
ప్రేమకు ఒప్పుకోవడం లేదని, పెళ్లికి నో చెబుతుందని  ప్రేమికులు. యువతులపై యాసిడ్ పోయడం తరుచూ జరుగుతుంటాయి. కాని ఇక్కడ మాత్రం సీన్ రివర్సైంది. తనతో సహజీవనం చేయడం లేదని ప్రియుడిపైనే ప్రియురాలికి దాడికి దిగింది. ఏకంగా  యాసిడ్ పోసింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదేమో... కత్తితో పొడిచేసింది. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో పట్టపగలే జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరిని పెళ్లాడాడు ఓ యువకుడు. దీంతో కొపం పెంచుకున్న ప్రియురాలు మాట్లాడుకుందాం అని వచ్చి యాసిడ్‌ పోసింది. అంతటితో ఆగకుండా కత్తితో పొడిచింది. ఆ తర్వాత తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంనకు చెందిన రాకేష్‌(30), కాంచీపురానికి చెందిన జయంతి (27) మూడేళ్లుగా దుబాయ్‌లోని ఓ మసాజ్ సెంటర్‌లో పనిచేశాడు. చెంగల్పట్టు జిల్లా మీనంబాక్కం తిరువల్లువర్ రోడ్డుకు చెందిన జయంతి (27) కూడా ఇదే మసాజ్ సెంటర్‌లో పనిచేస్తోంది. జయంతికి వివాహమై ఒక ఆడపిల్ల కూడా ఉంది. కానీ ఆమె భర్త నుండి విడిపోయి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. దుబాయ్‌లో ఒకే చోట పని చేస్తూ రాజేస్-జయంతి ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. సహాజీవనం కూడా చేశారు. ఈ స్థితిలో రాకేష్ తన సోదరి పెళ్లి కోసం కేరళ వెళ్తున్నట్లు జయంతికి చెప్పాడు. ఇలా ఇద్దరు అర్నెల్ల క్రితం దుబాయ్ నుంచి తమిళనాడుకు తిరిగి వచ్చేశారు. అయితే ఇటీవల జయంతికి తెలియకుండా రాకేష్‌ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఆమె ఫోన్‌ చేసి గొడవపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కోయంబత్తూరు పీలమేడు ప్రాంతంలో ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మాటామాటా పెరగడంతో జయంతి వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రాకే‌ష్‌పై పోసి, కత్తితో దాడి చేసింది. ఆ తర్వాత ఆమె నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. 
ALSO ON TELUGUONE N E W S
  పాపుల‌ర్ టీవీ యాంక‌ర్‌, సినీ న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పుట్టింట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి సుద‌ర్శ‌న్‌రావు ఖ‌స్బా ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్‌లో మ‌ర‌ణించారు. కొంత కాలంగా ఆయ‌న కేన్స‌ర్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న వ‌య‌సు 63 సంవ‌త్స‌రాలు. తార్నాకలోని తన సొంత ఇంట్లో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కొద్ది నిముషాల్లోనే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సుద‌ర్శ‌న్‌రావు సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ వ‌స్తున్నారు. Also read:  పాపుల‌ర్‌ క‌న్న‌డ న‌టుడు-ద‌ర్శ‌కుడు శివ‌రామ్ క‌న్నుమూత‌ సుద‌ర్శ‌న్‌రావు గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్య‌క‌ర్త‌గా ప‌నిచేశారు. యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్ర‌ట‌రీగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌నకు భార్య‌, ముగ్గురు కుమార్తెలు.. అంబిక‌, సాయివైష్ణ‌వి, అన‌సూయ ఉన్నారు. సుద‌ర్శ‌న్‌రావు మృతికి ప‌లువురు సినీ, టీవీ సెల‌బ్రిటీలు, అన‌సూయ అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం ప్ర‌క‌టించారు.
  "నెల‌రాజునీ ఇల‌రాణినీ క‌లిపింది క‌దా సిరివెన్నెలా".. ఇది సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన చిట్ట‌చివ‌రి పాట‌. ఆ పాట‌ను ఆయ‌న రాసింది నాని టైటిల్ రోల్ పోషించిన‌ 'శ్యామ్ సింగ రాయ్' సినిమా కోసం. నిజానికి ఆయ‌న ఆ పాట రాయ‌లేదు. పోన్‌లో ఆయ‌న లైన్లు చెప్తుంటే ఆ సినిమా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ రాసుకున్నాడు. అవును. ఈ నెల 7వ తేదీ ఆ పాట మ‌న ముందుకు రాబోతోంది. ఆ విష‌యాన్ని ఒక వీడియో ద్వారా కొద్దిసేప‌టి క్రితం హీరో నాని వెల్ల‌డించాడు. "మా సినిమాలోంచి నెక్ట్స్ రాబోతున్న పాట నాకూ, మా టీమ్‌కీ, ప్ర‌తి తెలుగు ప్రేక్ష‌కుడికీ స్పెష‌ల్ సాంగ్ కాబోతోంది. పాట పేరు 'సిరివెన్నెల'. మ‌న గ్రేటెస్ట్ లెజెండ్స్‌లో ఒక‌రు రాసిన ఆఖ‌రి పాట‌. ఆ పాట వెనుక క‌థ‌ని రాహుల్ మాట‌ల్లో వింటే బాగుంటుందేమో" అని నాని చెప్పాడు. Also read:  అమ్మ మంద‌లించింద‌ని తుంట‌రిప‌ని చేసి చిన్న‌ప్పుడే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు! "న‌వంబ‌ర్ 3వ తేదీ నైట్ కాల్ చేశారు. 'ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క ఈ పాట‌ను పూర్తిచేయ‌లేక పోతున్నాను. ఇంకెవ‌రితోనైనా రాయిద్దామ‌'న్నారు. 'ప‌ర్లేదు సార్' అన్నాను. మ‌రుస‌టి ఉద‌యం 7 గంట‌ల‌కు వీడియో కాల్ చేసి, న‌న్ను నిద్ర‌లేపారు. ఆరోజు దీపావ‌ళి. 'ప‌ల్ల‌వి అయిపోయింది, చెప్తాను రాసుకో' అన్నారు, చాలా ఎగ్జ‌యిటెడ్‌గా. స‌డ‌న్‌గా చెప్పేస‌రికి ఎక్క‌డ రాయాలో తెలీక‌, ప‌క్క‌నే మ‌హాభార‌తం పుస్త‌కం ఉంటే దాని మీద లైన్స్ రాసుకున్నాను. అద్భుత‌మైన ఆరు లైన్స్ ఇచ్చారు. ప‌ల్ల‌వి ఫినిష్ చేశారు. అందులో మొద‌టి లైన్‌లో త‌న‌పేరు రాశారు. 'ఎందుకు సార్ ఈ పాట‌కు మీ సంత‌కం ఇచ్చారు?' అన‌డిగాను. 'బ‌హుశా ఇదే నా ఆఖ‌రి పాట అవ్వొచ్చు నాన్నా' అని గ‌ట్టిగా న‌వ్వారు. ఐర‌నీ ఏమిటంటే ఈ పాట రికార్డింగ్ మొద‌లుపెట్టిన రోజే ఆయ‌న అంత్య‌క్రియ‌లు కూడా జ‌రిగాయి. పాట చాలా బాగా వ‌చ్చింది సార్‌. అందుకే మీ పేరే పెట్టుకున్నాం. మీరు వెళ్లిపోయిన త‌ర్వాత కూడా మిమ్మ‌ల్ని ప్ర‌పంచానికి మ‌రొక్క‌సారి కొత్త‌గా ప‌రిచ‌యం చేసే అవ‌కాశం మాకు క‌లిగించినందుకు మా టీమ్ త‌ర‌పున థాంక్యూ సో మ‌చ్‌. మిస్సింగ్ యు బ్యాడ్‌లీ." అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ సాంకృత్యాన్‌. Also read:  ఆ డైరెక్టర్ తో 'సిరివెన్నెల' ఫోన్ కాల్.. తప్పుగా అర్థం చేసుకోకండి! "ఈ ఒక్క పాట మాత్ర‌మే కాదు, 'శ్యామ్ సింగ రాయ్‌'లో ఇంకో పాట కూడా శాస్త్రిగారు రాశారు. ఆ పాట కూడా త్వ‌ర‌లో రిలీజ‌వ‌బోతోంది. ఈ రెండు పాట‌ల‌నే కాదు, మా సినిమా 'శ్యామ్ సింగ రాయ్‌'ని సీతారామ‌శాస్త్రిగారికి అంకిత‌మిస్తున్నందుకు నాకూ, మా టీమ్‌కీ ఎంతో గ‌ర్వంగా ఉంది." అన్నాడు నాని. Also read:  సీతారామ‌శాస్త్రికి సుకుమార్ అక్ష‌ర నివాళి.. వైర‌ల్ అయిన ఎలిజీ! మిక్కీ జె. మేయ‌ర్ స్వ‌రాలు కూర్చిన సిరివెన్నెల రాసిన చివ‌రాఖ‌రి పాట 7వ తేదీ మ‌న‌ముందుకు రాబోతోంది. దాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించాడు. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టించిన 'శ్యామ్ సింగ రాయ్‌'లో మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం కీల‌క పాత్ర‌ధారులు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి నిర్మిస్తోన్న ఈ మూవీ డిసెంబ‌ర్ 24న విడుద‌ల‌వుతోంది.
  ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు శివ‌రామ్ బెంగ‌ళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 83 సంవ‌త్స‌రాలు. మంగ‌ళ‌వారం (న‌వంబ‌ర్ 30) బెంగ‌ళూరులోని త‌న ఇంట్లో రాత్రి పూజ చేస్తూ ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. ఆయ‌న‌ను ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా, ప‌రీక్షించిన డాక్ట‌ర్లు మెద‌డులో ర‌క్త‌స్రావం అయిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ నెల‌లోనే శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని సంద‌ర్శించాల‌ని ఆయ‌న భావించారు. శివ‌రామ్‌కు చికిత్స అందించిన వైద్యులు ఆయ‌న వ‌య‌సు, ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా స‌ర్జ‌రీ వీలుకాద‌ని చెప్పారు. అయితే ఆరోగ్యం క్షీణించ‌డంతో ఈరోజు డిసెంబ‌ర్ 4న శివ‌రామ్ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న అకాల మ‌ర‌ణంతో అభిమానులు, క‌న్న‌డ సినీ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోన‌య్యారు. Also read:  సీతారామ‌శాస్త్రికి సుకుమార్ అక్ష‌ర నివాళి.. వైర‌ల్ అయిన ఎలిజీ! గ‌త‌వారం శివ‌రామ్ కారు ప్ర‌మాదానికి గురైన‌ట్లు స‌మాచారం. అయితే ఆయ‌న‌కు పెద్ద‌గా గాయాలు కాలేద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు జ‌ర‌గ‌నున్నాయి. Also read:  హీరో కిరణ్‌ అబ్బవరం సోదరుడు మృతి! శివ‌రామ్ 1938 జ‌న‌వ‌రి 28న జ‌న్మించారు. 1958లో స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌డం ద్వారా సినీ ఇండ‌స్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. కె.ఆర్‌. సీతారామ‌శాస్త్రి, పుట్ట‌న్న క‌ణ‌గ‌ల్‌, సింగీతం శ్రీ‌నివాస‌రావు లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర ప‌నిచేశారు. 1965లో 'బెరెతా జీవా' అనే సినిమాతో న‌టుడిగా మారారు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల ఆద‌రాభిమానాల‌ను పొందారు. 1972లో తొలిసారి 'హృద‌య సంగ‌మ' అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతేకాదు, ర‌జ‌నీకాంత్ త‌మిళ సినిమా 'ధ‌ర్మ దురై'ని రాశిక‌ళామందిర్ బ్యాన‌ర్‌పై నిర్మించారు కూడా.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో పాటు తారక్, చరణ్ వంటి స్టార్స్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. నిజానికి 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ డిసెంబర్ 3 న విడుదల కావాల్సి ఉంది. అయితే లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయడంతో.. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ మూవీ టీమ్ ట్రైలర్ విడుదలను వాయిదా వేసింది. ట్రైలర్ వాయిదా పడటంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ నెలకొంది. అయితే మూవీ టీమ్ తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. 'ఆర్ఆర్ఆర్' మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 9న ఉదయం 10గంటలకు థియేటర్స్ లో ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' టీజర్ బిగ్ స్క్రీన్స్ పై సందడి చేస్తోంది. త్వరలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ కూడా అలరించనుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ కి జోడీగా అలియా భట్, తారక్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 7 న ప్రేక్షకుల ముందు రానుంది.
సినిమాటోగ్రాఫ‌ర్ గా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి. గుహన్.. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన '118' సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమా హిట్ కావడంతో దర్శకుడిగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రామంత్ర క్రియేష‌న్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పాట‌లు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల‌కానుంది. 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' డిజిట‌ల్ రైట్స్‌ని 'సోనిలివ్' సంస్థ ఫ్యాన్సీ మొత్తానికి ద‌క్కించుకుంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్ర‌సారం కానుంది. శివాని రాజశేఖర్‌ ఇటీవల తేజ సజ్జతో కలిసి 'అద్భుతం' సినిమాతో ఓటీటీలో ఆకట్టుకుంది. ఇప్పుడు 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'తో మరోసారి అలరిస్తుందేమో చూడాలి. చిత్ర నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు దాట్ల మాట్లాడుతూ.. "మా ఫ‌స్ట్ మూవీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్ బేస్డ్‌ మూవీ ఇది. ఓటీటీకి ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్‌. సోనివంటి ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌తో అసోసియేట్ అవ‌డం చాలా హ్యాపీ. ఈ సినిమా సోనిలివ్ ద్వారా మ‌రింత ఎక్కువ మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. గుహ‌న్‌గారి మేకింగ్, అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ కెమిస్ట్రి అన్ని వ‌ర్గాల‌వారిని ఆక‌ట్టుకుంటుంది." అన్నారు.
  ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో జాయిన్ అవ‌డానికి శ‌నివారం హైద‌రాబాద్‌కు చేరుకుంది దీపికా ప‌డుకోనే. ఆమెకు ప్రొడ‌క్ష‌న్ హౌస్ వైజ‌యంతీ మూవీస్ హార్దిక స్వాగ‌తం ప‌లికింది. ప్ర‌భాస్‌తో షూటింగ్‌కు ముందు నాగ్ అశ్విన్‌, ఆయ‌న టీమ్ నుంచి త‌న‌కు ల‌భించిన అంద‌మైన స్వాగ‌తానికి ముచ్చ‌ట‌ప‌డిన దీపిక దానికి సంబంధించిన గ్లిమ్స్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకుంది. ఒక నోట్‌తో పాటు 'ప్రాజెక్ట్ కె' టీమ్ నుంచి తాను అందుకున్న గిఫ్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీపిక షేర్ చేసింది. స్వాగ‌తం సంద‌ర్భంగా నాగ్ అశ్విన్ టీమ్ ఆమెకు వైట్‌, వ‌యొలెట్ క‌ల‌ర్ బ్యాంగిల్స్‌, ఒక చీర‌, పూలు, ప‌సుపు, కుంకుమ‌, గంధం లాంటివి అందించింది. వాటితో దీపిక అందుకున్న ఆ నోట్‌లో 'ఇంటి'కి ఆమెకు స్వాగతిస్తున్న‌ట్లు ఉంది. అలాగే ఆమెను 'డాట‌ర్ ఆఫ్ సౌత్‌'గా సంబోధించారు. ఆ నోట్‌లో, "ప్ర‌పంచ‌వ్యాప్తంగా హృద‌యాల‌ను శాసిస్తున్న ద‌క్షిణాది కుమార్తెకు, ఒక నిధిగా ఆరాధించే దేశ యువ‌రాణికి, ఇంటికి స్వాగ‌తం డీపీ (దీపికా ప‌డుకోనే)! రండి, క‌లిసి ప్ర‌పంచాన్ని జ‌యిద్దాం." అంటూ రాసుంది. శ‌నివారం ఉద‌యాన్నే ముంబై నుంచి హైద‌రాబాద్‌కు దీపిక త‌న బాస్ లేడీ అవ‌తారంలో బ‌య‌లుదేరిన‌ప్పుడు కెమెరా కంటికి చిక్కింది.  'ప్రాజెక్ట్ కె' విష‌యానికి వ‌స్తే, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ప్ర‌భాస్‌-దీపిక జంట‌గా న‌టిస్తుండ‌గా, అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక కీల‌క పాత్ర‌ను చేస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో, భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌తో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సి. అశ్వినీద‌త్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌ తో ఆయన మాట్లాడిన ఫోన్ సంభాషణ ఒకటి.. ఆయన మరణం తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన ఓ వైపు తన ఆరోగ్యం బాగాలేదని చెబుతూనే, మరోవైపు చాలా ఉత్సాహంగా మాట్లాడారు. 2015లో తనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది అని.. అప్పుడు ఎడమవైపు సర్జరీ చేసారని, ఇప్పుడు కుడివైపు వచ్చిందని అన్నారు. 'నీ సినిమా వాసుకి రాయాలి. కానీ ఈ రెండు నెలలు రాయలేను. నీ దగ్గర తీసుకున్న రెండు తిరిగివ్వను(నవ్వుతూ). మళ్ళీ డిసెంబర్ తరువాత జనజీవన స్రవంతిలోకి వచ్చాక రాస్తా' అంటూ సిరివెన్నెల అనారోగ్యంతో కూడా నవ్వుతూ మాట్లాడారు. కూచిపూడి వెంకట్‌ తో ఫోన్ లో సిరివెన్నెల మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కూచిపూడి వెంకట్‌ దగ్గర సిరివెన్నెల డబ్బులు అప్పుగా తీసుకున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై కూచిపూడి వెంకట్‌ స్పందించారు. ఈ తప్పుడు ప్రచారం తనకు బాధ కలిగిస్తోందని అన్నారు. "గురువు గారు సీతారామశాస్త్రి గారు నా వద్ద అప్పు తీసుకున్నారని కొందరు అనుకోవడం నాకు బాధ కలిగించింది. నేను దర్శకత్వం వహించిన 'మొదటి సినిమా'కు పాటలు రాసినందుకు ఆయన రెండు లక్షలు తీసుకున్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆ సమయంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన జోక్ చేశారు. నిజానికి ఆయన నాకెంతో సాయం చేశారు. ఆయన కెరీర్ పీక్ లో ఉండి, ఒక్కో సాంగ్ కి రెండు లక్షలు ఛార్జ్ చేస్తున్న సమయంలో కూడా.. నా సినిమాలో ఆరుపాటలు రాసి కేవలం రెండు లక్షలు తీసుకున్నారు. నా మీద ప్రేమతో అంత తక్కువ తీసుకొని నాకు సాయం చేశారు. ఆయన నాతో మాట్లాడిన ఫోన్ కాల్ ని కొందరు తప్పుగా అర్థంచేసుకోవడం.. గురువుగారి కుటుంబానికి, సన్నిహితులకు, నాకు బాధ కలిగించింది" అంటూ వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కూచిపూడి వెంకట్‌.. నవదీప్ హీరోగా నటించిన 'మొదటి సినిమా', కృష్ణ భగవాన్ నటించిన 'జాన్ అప్పారావు' సినిమాలకు దర్శకత్వం వహించారు.
సినిమా పేరు: స్కైలాబ్‌ తారాగ‌ణం: నిత్యా మీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష‌ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్: విశ్వక్ ఖండేరావు మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది ఎడిటర్‌: రవితేజ గిరిజాల ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌ సహ నిర్మాత: నిత్యామీనన్‌ నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు బ్యాన‌ర్స్: బ్రైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ విడుద‌ల తేదీ: 4 డిసెంబ‌ర్ 2021 అంతరిక్ష పరిశోధనల కోసం అమెరికాకు చెందిన నాసా రూపొందించిన 'స్కైలాబ్' భూమి మీద పడబోతోంది అంటూ వచ్చిన వార్త 1979 సమయంలో కొన్ని కోట్ల మంది గుండెల్లో భయాన్ని కలిగించింది. ముఖ్యంగా ఈ స్కైలాబ్ తెలంగాణలో పడే అవకాశముందంటూ ప్రచారం జరగడంతో అక్కడి ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. కొద్దిరోజుల్లో మనకి ఈ భూమ్మీద నూకల చెల్లిపోతున్నాయి అంటూ చివరి కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఓ వైపు ప్రాణభయంతో వణికిపోతూనే, మరోవైపు నచ్చింది తింటూ, నచ్చినట్టు ఉంటూ ఈ కొద్దిరోజులైనా దర్జాగా బతకాలి అనుకుంటూ ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. చివరికి 'స్కైలాబ్' సముద్రంలో పడుతుందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఇది మన తల్లిదండ్రుల చిన్న వయస్సులో జరిగిన యదార్థ సంఘటన. ఈ ఘటనని మన పేరెంట్స్ కి గుర్తు చేస్తూ, మనకి తెలియజేస్తూ తీసిన సినిమా 'స్కైలాబ్'. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'స్కైలాబ్'. ట్రైలర్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందో లేదో రివ్యూలో చూద్దాం. కథ: తెలంగాణలోని బండలింగంపల్లి గ్రామం. దొర కూతురు అయిన గౌరి(నిత్యామీనన్) తనపై దొరబిడ్డ అనే ముద్ర ఉండకూడనని, గౌరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ప్రతిబింబం అనే పత్రికలో చిన్న చిన్న కథలు రాసుకుంటూ తనని తాను గొప్పగా ఊహించుకునే గౌరి.. ఎప్పటికైనా ఒక మంచి కథని పత్రికలో అచ్చు వేయించి, తన పేరు అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటుంది. ఇక అదే ఊరులో ఊరంతా అప్పులు చేసిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) ఉంటాడు. ఆస్తులు తరిగిపోయి, అప్పులు పెరిగిపోయినా.. ఏ పని చేయకుండా తాతలు ముత్తాతల గొప్పతనం గురించి చెప్పుకుంటూ బతికేసే కుటుంబానికి చెందిన రామారావు.. ఏదోకటి చేసి అప్పులు తీర్చి ఊళ్ళో తలెత్తుకొని తిరగాలని ఆశపడుతుంటాడు. సిటీలో డాక్టర్ గా పనిచేసే ఆనంద్(సత్య దేవ్)కి డబ్బంటే పిచ్చి. ఆ పిచ్చే అతని డాక్టర్ లైసెన్స్ రద్దయ్యేలా చేస్తుంది. దీంతో లంచం ఇచ్చి డాక్టర్ లైసెన్స్ తిరిగి తెచ్చుకోవడం కోసం, తాతని ఎలాగైనా కాకా పట్టి డబ్బులు తీసుకెళ్లాలని ఊరికి వస్తాడు. పేరుకోసం గౌరి, పరువు కోసం రామారావు, డబ్బుకోసం ఆనంద్ తపిస్తుంటారు. ఇలా ముగ్గురూ తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆకాశంలో నుంచి 'స్కైలాబ్' భూమిపై పడుతుందన్న వార్త ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుంది. 'స్కైలాబ్' వార్తతో వీళ్ళ ముగ్గురి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి?.. ఊరిలో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? అనేది మిగతా కథ. విశ్లేషణ: 1979 లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా కథ రాసుకొని 'స్కైలాబ్' అనే సినిమా తీయాలన్న ఆలోచనతోనే దర్శకుడు సగం విజయాన్ని సాధించాడు. 'స్కైలాబ్' టైటిల్, ట్రైలర్ తో ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. ప్రేక్షకులను అలరించడంలోను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక మారు మూల గ్రామంలోని అమాయకపు ప్రజల జీవితాన్ని సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేచురల్ కామెడీతో ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ టచ్ ఇచ్చినా.. పారలెల్ గా కామెడీ కూడా ఉండేలా చూసుకున్నారు. అయితే ఆ ఎమోషన్ సీన్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది. సీన్స్ ఇంకా బలంగా, స్క్రీన్ ప్లే ఇంకా టైట్ గా ఉంటే.. సినిమా వేరే స్థాయికి వెళ్ళుండేది. బండలింగంపల్లి గ్రామంలో గౌరి, ఆనంద్, రామారావు పాత్రలకు మాత్రమే కాకుండా మరికొందరికీ కొన్ని ఆశలు ఉంటాయి. గుడిలోకి ప్రవేశం లేని దళితుడు శ్రీరాముడి శిల్పాన్ని చెక్కాలి అనుకోవడం, దొర ఇంట్లో పనిచేసే యువకుడు తన ప్రేయసితో కలిసి థియేటర్ లో సినిమా చూడాలనుకోవడం, ఒక పిల్లోడు గర్భిణీగా ఉన్న తన తల్లిని కష్టపెట్టకుండా పుట్టబోయే చెల్లికోసం డబ్బులు పోగుచేయడం.. ఇలా ఎన్నో పాత్రలకు కొన్ని ఆశలు ఉంటాయి. దర్శకుడి ఆలోచన బాగుంది కానీ, ఆ సన్నివేశాలను ఎమోషనల్ గా ఇంకాస్త బలంగా చూపిస్తే ఇంకా బాగుండేది. 'స్కైలాబ్' మూవీ టెక్నికల్ గా కూడా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ 1970ల నాటి లుక్ ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయింది. ఎడిటర్ రవితేజ కాస్త మొహమాటాన్ని పక్కన పెడితే బాగుండేది. అక్కడక్కడా సీన్స్ ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నటీనటుల పనితీరు: నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణల నటన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పాత్రల్లో ఒదిగిపోయి, చాలా నేచురల్ గా నటించి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తనని గొప్పగా రచయిత్రిగా  ఊహించుకునే గౌరి పాత్రలో నిత్యామీనన్ ఒదిగిపోయి నవ్వులు పూయించింది. మనసులో ఒకటి పెట్టుకొని పైకి అమాయకంగా కనిపించే ఆనంద్ పాత్రతో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. రాహుల్ రామకృష్ణ సుబేదార్ రామారావుగా తనదైన శైలిలో అలరించాడు. ఇక సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి.. ఆనంద్ తాత సదానంద పాత్రలో నటించి మెప్పించారు. వీరితో పాటు మిగతా పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్: కథ పెద్దది కాదు. కథలో పెద్దగా మలుపులు ఉండవు. అద్భుతమైన సినిమా చూశామన్న ఫీలింగ్ కలగదు. కానీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలుగుతుంది. రేటింగ్: 2.75/5 -గంగసాని
2021 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ కొంత‌మంది ద‌ర్శ‌కుల‌ను మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి తీసుకువ‌చ్చింది. ఆ కెప్టెన్స్ వివ‌రాల్లోకి వెళితే.. గోపీచంద్ మ‌లినేనిః- కెరీర్ ఆరంభంలో `డాన్ శీను`, `బ‌లుపు` వంటి విజ‌యాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని.. ఆపై వ‌చ్చిన `పండ‌గ చేస్కో`, `విన్న‌ర్` చిత్రాల‌తో ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో.. ఈ సంక్రాంతికి వ‌చ్చిన `క్రాక్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి మ‌రీ మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. శ్రీ‌కాంత్ అడ్డాలః- ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన కొత్త‌ల్లో `కొత్త బంగారు లోకం`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీ‌కాంత్ అడ్డాల‌.. అనంత‌రం `ముకుంద‌`, `బ్ర‌హ్మోత్స‌వం` రూపంలో రెండు వ‌రుస ప‌రాజ‌యాలు చూశారు. క‌ట్ చేస్తే.. ఈ ఏడాది జూలై 20న ఓటీటీలో స్ట్రీమ్ అయిన `నార‌ప్ప‌`తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. భాస్క‌ర్ః- తొలి చిత్రం `బొమ్మ‌రిల్లు`తోనే మెమ‌ర‌బుల్ హిట్ అందుకున్న భాస్క‌ర్ ఆపై `ప‌రుగు`తో ఓకే అనిపించుకున్నా.. `ఆరెంజ్`, `ఒంగోలు గిత్త‌`తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట‌ర్స్ చూశారు. ఈ క్ర‌మంలో.. చాన్నాళ్ళ త‌రువాత తెలుగునాట మెగాఫోన్ ప‌ట్టి తీసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`తో మ‌ళ్ళీ విజ‌యం చూసి.. బౌన్స్ బ్యాక్ అయిన ద‌ర్శ‌కుల జాబితాలో చేరారు. బోయ‌పాటి శ్రీ‌నుః- ఒక ద‌శ‌లో వ‌రుస ఘ‌న‌విజ‌యాల‌తో అల‌రించిన బోయ‌పాటి శ్రీ‌ను.. `జ‌య జాన‌కి రామ‌`, `విన‌య విధేయ రామ‌` చిత్రాల‌తో ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయారు. క‌ట్ చేస్తే.. తాజాగా విడుద‌లైన `అఖండ‌`తో త‌న స్థాయి స‌క్సెస్ చూసి.. గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అలాగే యువ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కూడా `సీటీ మార్`తో చెప్పుకోద‌గ్గ విజ‌యం చూసి.. కాస్త ఊర‌ట పొందారు. ఓవ‌రాల్ గా 2021 సంవ‌త్స‌రం ప‌రాజ‌యాల‌తో రేసులో వెనుక‌బ‌డ్డ ద‌ర్శ‌కుల‌కు.. బాగానే క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. 
  నంద‌మూరి బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్ చేసిన 'అఖండ' మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకుపోతోంది. విడుద‌లైన రెండో రోజు శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 3) కూడా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో రూ. 6.83 కోట్ల షేర్‌ను సాధించి, నిర్మాత‌ల‌ను, డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఆనంద‌ప‌రిచింది. తొలిరోజు బాల‌య్య కెరీర్‌లో అత్య‌ధికంగా రూ. 15.39 కోట్ల షేర్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అఖండ రెండు రోజుల షేర్ రూ. 22.22 కోట్లకు చేరుకుంది. బాల‌య్య‌కు సంబంధించి ఏ సినిమాకైనా రెండు రోజులకు ఇదే అత్య‌ధిక షేర్‌.  Also read:  తెలుగు రాష్ట్రాల్లో 'అఖండ' జాత‌ర‌.. అంచ‌నాల‌ను మించిన ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్‌! రెండో రోజు తెలంగాణ‌లో రూ. 2.26 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.59 కోట్లు, రాయ‌ల‌సీమ ఏరియాలో రూ. 1.98 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింది 'అఖండ‌'. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా చూసుకుంటే రెండు రోజుల షేర్ 27.22 కోట్ల‌కు చేరుకుంది. నేడు మూడో రోజు కూడా నూన్ షోస్ చాలా బాగా ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. దీంతో రెండో రోజు కంటే మూడో రోజు క‌లెక్ష‌న్స్ పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. విడుద‌లైన రెండో రోజు 'అఖండ‌'ను తిల‌కించిన నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌, "బాలయ్య బాలయ్య... ఇరగతీసావయ్యా..." అంటూ త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. Also read:  ఖండ ఖండాలలో 'అఖండ' జాతర.. రికార్డుల వేట మొదలైంది! బాల‌య్య - బోయ‌పాటి కాంబో అంటే మాస్ జాత‌ర‌ ఉంటుందో మ‌రోసారి ఈ సినిమా మ‌న‌కు చూపిస్తోంది. 2021లో విడుద‌లైన సినిమాల్లో రెండు రోజుల‌ క‌లెక్ష‌న్ల ప‌రంగా 'అఖండ' రెండో స్థానంలో నిలిచింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'వ‌కీల్ సాబ్' మూవీ రెండు రోజుల‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ. 42.98 కోట్ల షేర్‌తో తొలి స్థానంలో ఉంది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
జీవితంలో మనిషి కలలు చాలా ఉంటాయి. అయితే కలను నిజం చేసుకోవడానికి ఒక్కో ప్రయత్నం చేస్తూ వెళ్తాడు మనిషి. ఆ ప్రయత్నం అందరి జీవితంలోనూ సఫలం అవ్వడం లేదు ఎందుకు??   ప్రశ్నించుకుంటే చుట్టూ బోలెడు కారణాలు కనబడతాయి. అయితే అవన్నీ తమను, తమ సామర్త్యాన్ని తక్కువ చేసుకోకుండా కప్పిపుచ్చుకునే చక్కెర గుళికలు. ఎప్పుడైతే మనిషి శరీరానికి చక్కెర శాతాన్ని ఎక్కువగా అందిస్తాడో అప్పుడే డయాబెటిస్ వైపు అడుగులు వేగంగా పడిపోతాయి. ఫలితంగా ఏదో ఒకరోజు శరీరమంతా చక్కెర వ్యాధితో నిండిపోయిందనే వార్త వినాల్సివస్తుంది. అలాంటిదే జీవితంలో ఈ కప్పిపుచ్చుకోవడం కూడా.  నిజానికి మనిషి ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు.  తనకు నచ్చింది చేయడానికి భయం, ఎవరైనా ఆ పనిని వేలెత్తి చూపుతారని. పని చేసాక అపజయం ఎదురైతే భయం. తను ఆ పనిని అంత శ్రద్దగా చేయలేదనే విమర్శ ఎదురవుతుందని. విజయం సాధించగానే భయం. తదుపరి విజేతగా కొనసాగుతూ ఉండగలనా లేదా అని. రేపు అంటే భయం. ఏమవుతుందో ఏంటో?? అని. ఇట్లా అడుగడుగునా అన్నీ భయాలే…..  వీటికి కారణం ఏమిటి?? అని ఒకసారి ఆలోచిస్తే అందరూ చేస్తున్న భయంకరమైన తప్పేంటో తెలిసిపోతుంది. అది చేదు గుళికలా అనిపించినా తమని తాము సరిదిద్దుకునే ఔషధం అవుతుంది.  ఇంతకు ఆ తప్పేంటి అంటే, గతాన్నో, భవిష్యత్తునో ఆలోచిస్తూ వర్తమానాన్ని వృథా చేయడం. మనం జీవించాల్సిన అమూల్యమైన క్షణాలను గతం లిస్ట్ లోకి పనికిమాలిన క్షణాలుగా మార్చి పడదోయడం. మనిషికి ఆలోచన మంచిదే. తమని తాము విశ్లేషించుకోవడం ద్వారా తదుపరి అడుగులను మరింత మెరుగ్గా వేసేందుకు దోహాధం చేస్తుందది. అయితే ఎప్పుడూ అదే ఆలోచన చేయడం వల్ల, ఆలోచనల్లో, ఊహల్లో తప్ప ఎక్కడా మనిషి ఉనికి కనబడనంత పాతాళంలోకి తోస్తాయి అవి. అంతే కాదు ఇలా ఎప్పుడూ ఆలోచించడం వల్లే ప్రతి పనిలో భయం తొంగిచూస్తూ ఉంటుంది.  ఇంతకు పరిష్కారం ఏమిటి?? ముందుగా తెలుసుకోవలసిన విషయం. ఈ భయం అనేది శారీరక విషయం కాదు. నోప్పో, నలతో కాదు. ఇది కేవలం మానసికమైనది. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ భయం అంతా మన బుర్రలో కంటే, మన ఆలోచనల నుండి సృష్టించబడుతున్నదే అధికం. బుర్రకు, ఆలోచనలకు తేడా ఉంది. మెదడు పాజిటివ్, నెగిటివ్ రెండు విధాలుగా కూడా ఉండగలదు. అయితే ఈ అతి ఆలోచన అనేది పూర్తిగా నెగిటివ్ కోవలోకి జరిగిపోయి మానసికంగా బలహీనులను చేసి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి, అనవసరపు భయాన్ని అడుగడుగునా జోప్పిస్తుంటుంది. కాబట్టి ముందు మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. మానసిక పరిస్థితి మెరుగవ్వడానికో అద్భుతమైన మార్గం ఉంది. మానసిక సమస్యలు చాలా కఠినమైనవి, వీటిని అధిగమించడం ఎంతో కష్టతరమైన పని. అనుకుంటూ వుంటారు చాలా మంది. అయితే అది నిజమే కావచ్చు కానీ అది కేవలం అలా భావించే వాళ్లకు మాత్రమే. ఈ మానసిక సమస్యలు అన్ని కూడా చూసే చూపును బట్టే ఉంటాయి. చిన్న సమస్య అనుకుంటే చిన్నగా, పెద్దగా అనుకుంటే కొండంతగా అనిపిస్తాయి. అయితే దీన్ని అధిగమించడానికి ఒక అద్భుత మార్గం ఉంది. అదే వర్తమానంలో జీవించడం. ఇది వినగానే కొందరికి నవ్వు రావచ్చు. మరికొందరు ఆలోచనలో పడిపోవచ్చు. కానీ అదే నిజం. భయాలు అన్నిటికి తరువాత, రేపు, జరిగిపోయిన గతం అనేవి 90% కారణాలుగా ఉంటున్నపుడు వాటిని గూర్చి వదిలి కేవలం వర్తమానం గురించి ఆలోచించడం చాలా గొప్ప పరిష్కారం కదా. మరి వర్తమానంలో భయం ఉండదా?? వర్తమానం గురించి భయం వేయదా?? అని ఎవరైనా అనుకోవడం కూడా పరిపాటే. అయితే వర్తమానంలో, కేవలం ఉన్న క్షణాలలో జీవించడం అంటే మనం చేస్తున్న ఏ పనిలో అయినా పూర్తి స్పృహాతో ఉంటూ దాన్ని పూర్తి చేయడం. ఇలా చేయడం వల్ల ఆ పని మీదనే ఏకాగ్రత పెరిగి 100% ఆ పనికి న్యాయం చేయగలుగుతాం. కాబట్టి మన శక్తిసామర్ధ్యాల మీద మనకు శంక అవసరమే ఉండదు. భయం అనే రాక్షసి మంత్రమేసినట్టు మాయం అవుతుంది మన జీవితాల్లో నుండి.  కాబట్టి భయాన్ని జయించే మంత్రం అయిన వాస్తవంలో జీవించడాన్ని మిస్సవకండి. లేకపోతే మీ క్షణాలు అన్ని గతంలోకి చూసినపుడు పనికిమాలినవిగా కనబడతాయి. ◆ వెంకటేష్ పువ్వాడ  
‘మనిషి తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదు’... వగైరా వగైరా వాక్యాలు మనం చాలానే వింటూ ఉంటాము. వినడానికి కాస్త అతిగా ఉన్నా, వాటిలో తప్పేమీ లేదని మనకి తెలుసు. అందుకే సిగిరెట్‌ మానడం కూడా ఏమంత కష్టం కాదని తేల్చేస్తున్నారు పెద్దలు. కావాలని అంటించుకున్న వ్యసనం, పొమ్మంటే పోకుండా ఉంటుందా! పోయేదాకా పొగపెడితే సిగిరెట్టైనా పారిపోకుండా ఉంటుందా! కాకపోతే చిన్నపాటి జాగ్రత్తలు పాటించేస్తే సరి... ప్రణాళిక ఏర్పరుచుకోండి: సిగిరెట్టుకి దూరం కావాలి అని నిర్ణయించుకోగానే, ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. కనీసం ఒక నెల రోజులన్నా మీరు సిగిరెట్టుకి దూరంగా ఉండేందుకు ఏమేం చేయాలో నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని కుటుంబసభ్యులతో సహా మీ సన్నిహితులందరికీ తెలియచేయండి. మీరు ఏమాత్రం మీ లక్ష్యం నుంచి దూరమైనా, వాళ్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. పొగకు దూరమైనప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలి? ఇలా ఎన్నాళ్లు ఓపిక పట్టాలి?... వంటి విషయాలన్నింటి మీదా ఒక అవగాహనను ఏర్పరుచుకోండి. వ్యాపకం మీరు ఉద్వేగంగా ఉన్నప్పుడో లేక ఖాళీగా ఉన్నప్పుడో సిగిరెట్‌ తాగాలని నోరు పీకేయడం సహజం. అందుకనే ఏదో ఒక వ్యాపకాన్ని అలవర్చుకోండి. సిగిరెట్ తాగాలని మీ నోటికి అనిపించినప్పుడల్లా చూయింగ్‌ గమ్‌ నమలడమో, మంచి నీరు తాగడమో చేయండి. చేతులతో వీడియో గేమ్ ఆడటమో, రాయడమో చేయండి. అదీ ఇదీ కాకుంటే కాసేపు ధ్యానం చేయండి లేదా ఓ నాలుగడుగులు అలా వీధి చివరిదాకా వెళ్లిరండి. మొత్తానికి సిగిరెట్‌ తాగడం తప్ప మరేదన్నా పనికొచ్చే పనిచేయండి. వాతావరణం పొగని గుర్తుచేసే అన్ని వస్తువులనీ కట్టకట్టి అవతల పారేయండి. మీ సిగిరెట్‌ ప్యాకెట్లు, లైటర్లు, యాష్‌ట్రేలు.... వీటన్నింటినీ చెత్తబుట్టలో పారేయండి. ఇక పొగని గుర్తుచేసే ప్రాంతాలకి (ఉదా॥ సినిమా హాళ్లు, బార్లు...) దూరంగా ఉండండి. మీ స్నేహితులలో తెగ పొగ తాగేవారికి కొన్నాళ్లు దూరంగా ఉండండి. వారి సాన్నిహిత్యంలో మీకు పొగ గుర్తుకురావడం మాట అటుంచి, మీతో మళ్లీ పొగ తాగించేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు! సలహాసంప్రదింపులు సిగిరెట్టు వ్యసనానికి ముఖ్య కారణం అందులో ఉండే నికోటిన్‌ అనే పదార్థమే! కాబట్టి నికోటిన్‌ వ్యసనం నుంచి తప్పించుకునేందుకు వైద్యుల సలహా తప్పకుండా ఉపయోగపడుతంది. నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ పేరుతో కొన్నాళ్ల పాటు తక్కువ మోతాదులో నికోటిన్‌ ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. నికోటిన్‌ వ్యసనం నుంచి దూరం చేసేందుకు మందులూ ఉన్నాయి. మన పరిస్థితిని బట్టి మనకి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు గుర్తిస్తారు. అదీ ఇదీ కాదంటే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి, సిగిరెట్‌ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు సాయపడే సైకాలజిస్టులూ అందుబాటులో ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే ఏమాత్రం మొహమాటం లేకుండా వైద్యుల సాయాన్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉండండి సిగిరెట్‌ మానేసిన మొదటి రోజు నుంచి తలనొప్పి మొదలుకొని నానారకాల ఇబ్బందులూ మీ శరీరాన్ని పీడించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు... వారాల తరబడి నానారకాల సమస్యలూ మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దేని మీదా ధ్యాస నిలువదు. నిస్సత్తువ, అజీర్ణం, దగ్గు... మనల్ని కుంగతీస్తాయి. వీటన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల కోసం, మీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం కొన్నాళ్లపాటు వీటిని భరించక తప్పదని గుర్తుంచుకోండి. ఒకో వారం గడిచేకొద్దీ మీ ప్రయత్నాన్ని మీరే అభినందించుకోండి. మీకు మీరే బహుమతిగా ఇష్టమైన వస్తువులను కొనుక్కోండి.   - నిర్జర.
  మీ పిల్లలకి నిజంగా స్కిల్స్ ఉన్నాయా? అని అడిగితే, అవునండి మా అబ్బాయి/అమ్మాయి ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ సాధిస్తారు. ఎప్పుడు, మంచి మార్కులు మరియు ర్యాంకులు తెచ్చుకుంటారు అని సమాధానం ఇస్తారు తల్లిదండ్రులు. కానీ, మార్కులు తెచ్చుకోవడం ఒక్కటే నిజమయిన స్కిల్ కాదంటున్నారు డాక్టర్ పూర్ణిమ నాగరాజా గారు. పిల్లల ఇష్టా, అయిష్టాల విషయంలో గౌరవం ఇవ్వాలి అంటున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=b8SXTuOEwms  
దక్షణ   ఆఫ్రికాలో శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదన తో పాటు ప్రపంచం మొత్తం ఓమిక్రాన్ పై విస్తృత పరిశోదనలు చేస్తున్నారు. ఓమైక్రాన్  లో చాలా రకాలు  ఉన్నందున  ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని  అందించే ప్రయత్నం.  ఓమై క్రాన్ వ్యాప్తి ... ఓమైక్రాన్ పై ఇప్పటికీ ఏరకమైన స్పష్టత లేదు. ఓమైక్రాన్ త్వరా విస్తరిస్తుందని వ్యక్తి నుండి వ్యక్తికి త్వరాగా వ్యాపించే అవకాసం ఉందని పేర్కొన్నారు.ఇతర వేరియంట్ తో పోలిస్తే  డెల్టా వేరియంట్ పై జరిపిన పరీక్షలలో బాధితుల సంఖ్య పెర్గింది.ఎపిడమాలాజి పరిశోదనలో ఒమైక్రాన్ పై నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వ్యాధి తీవ్రత...  ఓమై క్రాన్  కు గల కారణాలు తీవ్రత ఇన్ఫెక్షన్ శాతం పై ఇతర వేరియంట్ల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ ను పోల్చి చూడాల్సి ఉంది. దక్షణ ఆఫ్రికాలో పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది.ఎపిడమాలజి పరిశీలనలో ఒమైక్రాన్ కాక ఇతర ఏ కారణాలు ప్రభావం చూపుతుంది అన్న అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఆసుపత్రులలో చేరుతున్న వారిసంఖ్య పెరుగుతుంది.దీనికికారణం ఇన్ఫెక్షనేనా లేదా ఓమై క్రాన్ ఇన్ఫెక్షన్ కారణమా కాదా? అన్నది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఓమైక్రాన్ లక్షణాలు లేనట్లు గుర్తించారు. ఇతర వేరియంట్లు ఇన్ఫెక్షన్ ఉందా అన్న కోణం లో  విశ్వవిద్యాలయం పరిశోదనలు చేస్తున్నారు  ఈ క్రమం లోనే చాలా మంది యువతీ యువకులలో లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు.ఓమైక్రాన్ తీవ్రత శాతం ఓమైక్రాన్ వారం లేదా కొన్ని వారాలు డెల్టా వేరియంట్  ప్రపంచ వ్యాప్తంగా   తీవ్రప్రభావం చూపింది. మరణాల కు కారణమయ్యింది. డెల్టా వేరియంట్ తో ప్రభావం చూపినప్పుడు  మరణాల రేటును నివారించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని  నిపుణులు సూచిస్తున్నారు. సార్క్ కోవిడ్ 2 తీవ్రప్రభావం... ప్రాధమిక సాక్జ్ష్యదారాల మేరకు ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిన వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్ సోకడం ఇతర వేరియంట్లతో పోల్చి చూసినప్పుడు. ఓమిక్రాన్ గురించిన సమాచారం  తక్కువే రానున్న రోజుల్లో మరింతసమాచారాం సేకరించాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ ప్రభావం... ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే సాంకేతిక సభ్యులతో వేరియంట్ త్గీవ్రత ప్రభావందానిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వ్యాక్సిన్లు వ్యాదితీవ్రతను,మరణాలను  నివారించాగాలదా? నివారణలో వ్యాక్సిన్ పనితీరు,ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు తీవ్రవ్యాదులపై  ఎలాంటి ప్రభావం చూపుతుందా ? అన్న సందేహాలకు  పరిశోదన ల లో  సమాధానం  దొరకాల్సి ఉంది.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు  వాటి ప్రభావం... కాస్టికో  స్టెరాయిడ్స్ 1ల్  రేసిప్టర్లు,బ్లాకర్లు,ఎలాంటి ప్రభావం చూపుతాయి,కోవిడ్ తీవ్రతను ఎలా నియంత్రించాలి చికిత్సను సమార్ధంగా ఎలా నిర్వహించాలి.ఇతర చికిత్సలవల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నది ఒక అంచనా చికిత్స ప్రభావవంతంగా ఉండేందుకు మార్పులు. ఓమై కరణ్ గురించి తెలుసుకోవాలి.  ఓమై క్రాన్ కు చికిత్స చేయవచ్చు లండన్  ఎం హెచ్ ఆర్ ఏ ఆమోదం ... ఓమై క్రాన్ దేనికి లొంగదు దాదాపు 3౦ రకాలుగా వేరియంట్ మార్పు చెందుతుందని మ్యుటేషన్  కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా ? అన్నది సందేహం గామారింది.ఈ నేపధ్యంలో లండన్ కు చెందినా డాక్టర్స్ చేసిన పరిశోదన లో సోత్రో వేమాబ్ చికిత్స తో ఓమిక్రాన్ ను  చెక్ పెట్టవచ్చు అంటూ చేసిన ప్రకటన అందుకు బ్రిటన్ లోని  వైద్య నియంత్రణ సంస్థ ది మెడిసిన్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ రేగ్యులేట రీ అధారిటీ  ఎం హెచ్ ఆర్ ఏ  చికిత్సకు ఆమోదం తెలిపింది.సరికొత్త యాంటీ బాడీ చికిత్స ఓమైక్రాన్ వంటి కొత్త వేరియంట్ పై సమర్ధంగా  పనిచేస్తుందని అధికారులు  అభిప్రాయ పడ్డారు. సోత్రో విమాబ్ ఔషదాన్ని సింగల్ మొనో క్లోనల్ యాంటీ  బాడీ లతో తయారు చేసినట్లు సమాచారం.కోరోనా వైరస్ పైన ఉండే కొమ్ము వైరస్  కు అంటుకుంటుంది ఆ వైరస్ మానవాళి  కణాలలోకి ప్రవేసించకుండా  నిలువరిస్తుంది. సోత్రో విమాబ్ సురక్షితమని   ఒమైక్రాన్  వ్యాదిలక్షణాలు  బయట పద్దవెంటనే సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం ఉంటుందని,తీవ్రస్తాయి అనారోగ్యం ముప్పు ఉన్నవారికి  ఈ ఔషదం ఉపయోగపడుతుందని.ఎం హెచ్ ఆర్ ఏ  EXEQUTIVE డైరెక్టర్ జూన్ రేస్స్  తెలిపారు. సోత్రో విమాబ్ ను రక్తనాళాల ద్వారా 3౦ నిమిషాలు ఇవ్వవచని తెలిపారు కాగా 1 2 సంవత్సరాలు ప బడ్డ వారికి సోత్రో విమాబ్  వారు  ఆసుపత్రి పాలు కాకుండా మరణాల బారిన పడకుండా 79% రక్షణ కల్పించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  అయితే సోత్రో విమాబ్ ఇచ్చినవారిలో  ఔషదానికి ముందు ఔషదం తీసుకున్న తరువాత  ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అసలు సోత్రో వేమాబ్ చికిత్స కు ముందు ఎలాంటి క్లినికల్ ట్రైల్స్  చేసారు వాటి ఫలితాలు  వెల్లడి కావాల్సి  ఉందని అప్పుడే  ఔషదం  పనితీరు తెలుస్తుంది ఒక అంచనా వేయవచ్చని  నిపుణులు అంటున్నారు.  ఒమైక్రాన్ లేదా ఇతర వేరియంట్ల పై పరిశోదన కొనసాగాల్సిందే... ప్రస్తుత  సమయం లో పెద్ద శాస్త్రజ్ఞులతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రజ్ఞులు ఓమిక్రాన్ ను గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు.ఆదిసగా  పరిశోదన కొనసాగించాల్సిన అవసరం ఉంది.ప్రస్తుతం ఓమై క్రాన్ దాని ప్రభావం స్వరూప స్వభావాలు  అంచనా వివిధ దేశాలలో కోరోనా ప్రభావం చికిత్సా పద్దతులు.అంచనా అవగాహనా అవసరం గతం నుండే వర్తమానం సాధ్యం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని  అనుసరించాల్సిన విధాన నిర్ణయాలు లేదా ఆరోగ్యవిదివిదానం అమలుతీరు వంటి అంశాలను  సమీక్షించు కోవాలి.  ఓమిక్రాన్ తీవ్రత వ్యాప్తి ఇన్ఫెక్షన్ తీవ్రత లక్షణాలు వ్యాక్సిన్ పనితీరు చేస్తున్న పరిక్షలు ఆధునిక పరీక్ష సాంకేతికత వివరాలు సమగ్రసమాచారం. వివిదరకాల్ చికిత్సలు వాటి ప్రాభావం పై పరిశోదనలు.  ఆసుపత్రిలో చేరినరోగుల వివరాలు డాటా సేకరించేందుకు ప్రోత్సహిస్తుంది.క్లినికల్ దాటా క్లినికల్ గా ఎలాంటి లక్షణాలు రోగులు ఎదుర్కుంటున్నారు. అన్న అంశం పై వచ్చే ఫలితాలు. ఎప్పటికప్పుడు అందించడం అవసరం. రానున్న రోజుల్లో మరింత సమాచారం ప్రపంచ ఆరోగ్యసంస్థ  పర్యవేక్షణ కొనసాగిస్తుంది. డాటా అందుబాటులో ఉంచే ప్రాయాత్నం ఓమిక్రాన్ ప్రవర్తన, రూపాంతరం చెందడం.పై నిశితంగా పరిశీలించాల్సి ఉంది. డబ్ల్యు.హెచ్ ఓ  చేపట్టిన చర్యల పై దేశాలకు దిశానిర్దేశం... ఓమైక్రాన్ వేరియంట్ ను గుర్తించిన అనంతరం ప్రపంచ ఆరోగ్యసంస్థ చాలా చర్యాలు చేపట్టింది. దేశాలు పూర్తిగా దృష్టి సారించాలని కేసులు సీక్వెన్స్ పెరుగుదల జీనోమ్ సీక్వెన్స్ దాటా ఆధారంగా ప్రాచుర్యం లేదా ప్రాచారం కల్పించడం జి ఐ ఎస్ ఏ ఐ ఇన్  ఆధారంగా ప్రాధమిక స్థాయిలో వచ్చే  కేసులు  ఆయా ప్రాంత్ఘాలలో క్లస్టర్ల ఏర్పాటు.ఆయా ప్రాంతాలలో చేపట్టిన పరీక్షలు ల్యాబొరేటరీ రిపోర్ట్ ఆధారంగా అంచనా.ఓమై క్రాన్ విస్తరణ రూ పాలు దానిలక్షణాలు,ప్రభావం వ్యాక్సిన్ ప్రభావం వ్యాధినిర్ధారణ,చికిత్ద్సలు తెరఫీలు ప్రజా ఆరోగ్యం సామాజిక పద్దతులు. 26 తేదీన ప్రకటన కోవిస్తరణను నియంత్రించడం.ప్రామాడం అంచనా శాస్త్రీయ పద్ధతి అనుసరించాలి. ప్రజా ఆరోగ్యానికి వైద్యం అందించే శాక్తి వ్యాధి తీవ్రత కేసులు పెరిగి నప్పుడు సమర్ధవంతంగా నిర్వహించడం. కీలకం కోవిడ్ వ్యసినేషణ్ వివిధ వర్గాలలో వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించడం. ఓమైక్రాన్ లేదా ఇతర వైరస్ లు వేరియంట్లు విస్తరించకుండా ఉండాలంటే స్వీయా నియంత్రణ వ్యక్తిగతం గా సామాజిక దూరం పాటించడం ఒక్కకరు ఒక్కోమీతారు దూరాన్ని పాటించడం తప్పనిసరి. ఇంట్లో గాలి వెలుతురు సరిగా ఉండే విధంగా చర్యలు చేపట్టడం. సమూహాలకు దూరంగా ఉండడం.,దగ్గు లేదా తుమ్ములు వచ్చి నప్పుడు మీ మోచేతిని అడ్డుగా పెట్టుకోవడంవ్యాక్సిన్ వేయించకోవడం ముఖ్యం.ఇప్పటికే ప్రపంచదేశాలలో ఓమిక్రాన్  ప్రభావం చూపుతోంది. మరింత సామగ్ర సమాచారం క్రోడీక రించాల్సి ఉంది..                    
ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమైక్రాన్ కు ప్రస్తుతం ఉన్న మోలోక్లోనల్ తెరఫీ పెద్దగా ఉపయోగపడదని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ఏ చికిత్సకు లొంగదని  ఓమిక్రాన్ వేరియంట్ లో 3౦ రకాలుగా పరివర్తన మ్యుటేట్ కావడం వల్ల చికిత్స సాధ్యమా కాదా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ. లండన్ కు చెందిన  వైద్య నిపుణులు  సరికొత్త  యాంటి బాడీ  చికిత్స ను  బ్రిటన్ లోని వైద్యనియంత్రణ సంస్థ  ది మెడిసిన్ హెల్త్ కేర్  ప్రొడక్ట్స్ రేగ్యులేటరీ  ఆథారిటీ  ఏజెన్సీ ఆమోదించింది. ఒమైక్రాన్  వంటి కొత్త వేరియంట్ ను సమర్ధవంతంగా ఎదుర్కుంటుందని  ఆసంస్థ వెల్లడించింది.  ఈ  మందుకు సోత్రో విమాబ్ గా నామకరణం చేసారు.వేరియంట్ వచ్చిన తక్కువ కలం లోనే చికిత్స అందడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోరోనా వైరస్ పైన ఉండే స్పైక్ ప్రోటీన్ కొమ్ముఆకారాం లో ఉండే దీనికి వైరస్ అన్తుకుంటుందని  అది మానవ  కణ జాలం లోకి  ప్రవేసించ కుండా నిలువరిస్తుంది. ఇది సుఅరక్షిత మైన  ఔషద మని  కోరోనా తీవ్రంగా ప్రాణ హాని ఉన్నవారికి సైతం  ఉపయోగ పడుతుందని నిపుణులు వెల్లడించారు. సోత్రో విమాబ్ రక్తనాళాల ద్వారా  ఇవ్వవచ్చని ముప్పై నిమిషాలు చేసే చికిత్స  79% సురక్షితమని  నిపుణులు పేర్కొన్నారు. వ్య్యాది లక్షణాలు బయట పడిన వెంటనే చికిత్స అందించడం ద్వారా  సోత్రో విమాబ్ ఇస్తే ప్రయోజనం  ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. సో ఏది ఏమైనా  ఓమిక్రాన్ ను నిలువరించే చికిత్స అందుబాటులోకి రావడం  హర్షించ దగ్గ పరిణామం గా వైద్యులు పేర్కొన్నారు.  ఓమై క్రాన్ బారిన పడ్డ ఇజ్రాయిల్ డాక్టర్ .... ఇజ్రాయిల్ కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ మావుర్  వెల్లడించారు. స్వత హగా డాక్టర్ ఎలాడ్ మావుర్ ఫెబా మెడికల్ సెంటర్ అవీవ్  లో కార్దియలజిస్ట్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.  లండన్ లో నిర్వహించిన ఒక వైద్యసదస్సుకు హాజరయ్యేందుకు నవంబర్ 19 న లండన్   కు వెళ్లానని  ఆయన వివరించారు.  లన్ డ న్ లో నాలుగు రాత్రులు గడిపినట్లు తెలిపారు.  అయితే ఓమిక్రాన్ కొత్త వేరియంట్ గురించి తెలుకున్నానని. ఒమైక్రోన్  సౌత్ ఆఫ్రికాలో పుట్టిన విషయాన్నీ  గురించి విన్నానని అన్నారు.  లండన్ లో ఉన్న పది రోజులు కోవిడ్ లక్షణాలు గుర్తించానని డాక్టర్ మావుర్ వివరించారు. లండన్ లో ఉన్న కొద్ది రోజుల్లోనే  ఒమిక్రాన్ బారిన పడ్డట్టు గుర్తించినట్లు వివరించారు.   నవంబర్ 27 ణ లండన్ లో పరిక్షలు చేస్తే వెంటనే పాజిటివ్ గా నిర్ధారించారని డాక్టర్ మవోర్ తెలిపారు. ఓమిక్రాన్ లక్షణాలాలో భాగం గా  జ్వరం,కండరాల నొప్పులు,గొంతునొప్పి.ఉన్నట్లు డాక్టర్ మవోర్ స్పష్టం చేసారు.అయితే తనకు ఎప్పుడు ఎలా ఇన్ఫెక్ట్ అయ్యిందో చెప్పలేనని తనతో పాటు సదస్సు కు హాజరైన వారికి సోకి ఉండవచ్చు  అని నాకు ఓమిక్రాన్ సోకిన్దన్నది నిజం.పది రోజుల క్రితం సోకిందని డాక్టర్ ఎలాడ్ మావుర్ తొలి కేసుగా నమోదు కావడం విశేషం గతం లో వచ్చిన వేరియంట్ కన్నా త్వరగా సోకింది.   
 అనల్గేసిక్ నేఫ్రోపతి .... అనల్గేసిక్ నేఫ్రో పతి  వల్ల  కిడ్నీలు పూర్తిగా పాడై  పోవడం జరుగుతుంది. దీనికికారణం ఎక్కువ మోతాదులో మందులు వాడడమే అని,ఒక దానిని ఎదుర్కోడానికి మరో మందు వేసుకోవడం వల్ల ముఖ్యంగా ఫేనాసిన్,అసెట మినోఫిన్,ఆస్ప్రిన్,లేదా ఇబుఫ్రుబిన్, అనలగేసిక్ నేప్రోపతి  కి కారణం గా పేర్కొన్నారు.ఒకే రకమైన మందు రోజుకు మూడు మందులు  ఆరు సంవత్సరాలుగా లేదా వారికీ వారే సెల్ఫ్ మెడి కేషన్  అనల్గేసిక్ నేఫ్రో పతి 1౦,౦౦౦ మందిలో ఒక నలుగురికి మాత్రమే వస్తుంది. ఆయితే ముఖ్యంగా 3౦ సంవత్సరాలు పై బడిన మహిళలలో రావడం గమనార్హం.ఈ సమస్య పరిష్కారానికి ఫేనాసిన్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అనల్గే శిక్ నేఫ్రోపతి కేసులు తగ్గుముఖం పట్టాయి.  అనల్గేసిక్ నేఫ్రోపతి లక్షణాలు....  అయితే దీనికి ఏ రకమైన లక్షణాలు లేవని అంటున్నారు నిపుణులు.అనల్గేసిక్ నేఫ్రోపతి ని లక్షణాలను బట్టి అంచనా వేస్తారు త్వరగా అలిసిపోవడం,వెన్నుపూసలో తీవ్రమైన నొప్పి,మూత్ర వ్విసర్జనలో మార్పులు, మూత్రం లో రక్తం, గందర గోళం.ఒక్కోసారి రకరకాలుగా  రక్తస్రావం జరగడం.ఆహారం అరుగుదల కాక పోవడం. వాపు వంటి లక్షణాల ను బట్టి అనల్గేసిక్ నేఫ్రోపతి గా గుర్తిస్తారు.  అనల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణ పరీక్ష .... అనాల్గేసిక్ నేఫ్రోపతి నిర్ధారణకు రక్తం లో ఏమైనా టాక్సికాలజీ పరీక్ష చేస్తారు.మూత్ర పరీక్ష సిబిసి పరీక్ష మూత్రం నుండి ఎటువంటి మెటీరియల్ బయటికి వస్తుంది అన్న పరీక్ష,ఐ వి పి పరీక్ష అంటే వైద్య పరిభాషలో ఇంట్రా వేనేనౌస్  పైలోగ్రాం వంటి పరీక్షలు చేసి నిర్ధారిస్తారు.  అనల్గేసిక్ నేఫ్రోపతి కి చికిత్స.... అనల్గేసిక్ నేఫ్రోపతి తీవ్రంగా ఉంటె అది కిడ్ని ఫైల్యూర్ గా నిర్ధారిస్తారు.దీనికి ఆహారం లో మార్పులు ,ఫ్లూయిడ్స్ లోఎంపిక చేసిననవి మాత్రమే వాడాల్సి ఉంటుంది.డయాలసిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ .లేదా మీ కిడ్నీ తాత్కాలికంగా, లేదా శాస్వతంగా పాడుకవచ్చు.