"వెళ్దామా" స్వప్నంలోలా మందుకు చాచిన ఆమె చేతినందుకున్నాడు.
ఆనందరావు ఎప్పుడో పారిపోయాడు
వారు నేమ్మదిగా కదిలారు.....
సరిగ్గా అప్పుడే ఓ ఆకారం చెట్టు చాటు నుంచి
స్మశానం నడిబొడ్డుకు వచ్చింది..... ఒక క్షుద్ర
శక్తిలా నిప్పురవ్వల్ని నేత్రాలనుంచి చిమ్ముతూ
వెళ్తున్న జంటవేపు చూస్తూ మరుక్షణం
సమాధిని చేరుకుంది.
7
"నేనో అనాధనమ్మా! అమ్మా నాన్నలు ఎలావుంటారో తెలియని పసివాడని . జాలితో బియ్యమోపట్టేడన్నమో వేసి పూజ్యం కట్టుకో అమ్మా."
ఎవరి తప్పుకో అనాధగా మారినా పదేల్లా నానీ తప్పు ల్లెకుమ్డా ఈ ఒక్క వాక్యాన్ని వల్లించగలడు. కాదు అలా కంటస్థం చేయించాను నానీకి నీడనిచ్చే శరణాలయంలో.
బాధ్యతలు తెలీకుండా ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టుకుంటూ గడపాల్సిన వయసులో ప్రేమ సమాజపు పసిపిల్లలు బృందంతో వీధుల్లో తిరుగుతూ చందాలు పోగుచేయడం, అలా సంపాదించడం శరణాలయానికి అందచేయడం నానీ దైనందిన జీవితం.
ఒక్కోమారు ఏతల్లి చేయో ప్రేమగా పిడిగేడు బియ్యం వేస్తె మరోసారి ఎంగిలి చేతినైనా విదిలించేవారు కారెవరూ.
______________________________________
ఐ ఫర్ ఇన్ వేజన్
__________________________________
తన ఈడు పిల్లలు విచిత్రంగా తనవేపు చూస్తూ అమ్మ ఒడిలోనుంచే ఆకతాయిగా నవ్వుతుంటే ఆదిలో చూడముచ్చటగా వుండేది.
రానురాను ఏదో అర్దంకాని వెలితి.
అందరిలాగే అమ్మ గుండెలపైకి బ్రాకుతూ గారంచేసే అవకాశం తన కెందుకు లేదా అన్న ఆలోచన ఈ వయసులో తను ఎవరికీ కానివాడు ఎందుకాయ్యాడో తెలీక కుమిలిపోయేవాడు.
ఎవరిపైనో తెలియని కసి.
ఓదార్పు ఇవ్వని నాలుగు గోడల మధ్య నిశ్శబ్దపు చీకటి రాత్రులతో చెలిమిని పెంచుకుంటూ కాలం దొర్లించాడు కాలం దొర్లించేవాడు.
విచిత్రమైన అభద్రతాభావం
వయసు పెరుగుతున్న కొద్దీ వయసును మించి మనసు ఎదిగి అంతకుమించి ఒంటరితనం కలచివేస్తుంటే తక్కిన పిల్లలతో కలిసేవాడు కాదు.
అదోశానం.... ఒక దేవుడి శాసనం.....
ఎడారిలో ఏ ఆస్తి త్వమూలేని ఓ ఇసుక రేణువు తుఫాను తాకిడికి కదిలి స్థానభ్ర౦శం చెందినా మళ్ళీ తనవంటి మరెన్నో రేణువుల మధ్యే మిగిలిన ఒక ఉనికిని ఆపాదించుకుంటుంది.
నానీ జీవితమూ నిర్దాక్షిణ్యంగా విసిరేసిన ఓ అల్పప్రాణి......
పెరుగుతున్నది మరెందరో అనాధ ప్రాణులమధ్యే___
అయినా ఒంటరితనం .......
అందుకే మిగతా కేరింతల్ని భరించలేకపోయేవాడు.
ఎవరిపై పగ తీర్చుకోవాలో తెలీక చాటుగా ఓ మూల కూర్చుని శరణాలయపు ఆవరణంలో పెరిగిన అందమైన పూలమొక్కల్ని కసిగా పెరేకేసేవాడు.
అరవిసిరిన పూలను చూస్తూ ఇంకా చెట్టును అంటిపెట్టుకునే వున్నామన్నా వాటి తృప్తిని చూడలేనట్టు పీకి నులిమేసేచాడు.
అదో రకం కాప్లేక్సిటీ .....
ఫోభియా......
శరణాలయం పెద్దలకు నానీ ఓ విచిత్రమైన పిల్లాడిగాకనిపించేవాడు.
ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించి బుజ్జగించడానికి వారు నానీ ఆత్మీయులుకారు......
అందుకే పూలమొక్కల్ని త్రుంచేస్తుంటే శిక్షగా అన్నం పెట్టడం మానెసేవారు.....
ఎవరికీ తోచని ఓ విచిత్ర మనస్తత్వమని అందరికీ అర్దమయి పడేవారు.
ఎవరికీ తోచని ఓ విచిత్ర మనస్తత్వమని అందరికీ అర్దమయిపోయింది.
కధ ఇలాగే కొనసాగితే నానీ ఓ క్రిమినల్ గా మారేవాడు, లేదా మతి భ్రమణంతో పిచ్చివాడయ్యేవాడు.....
అలాటిదేమీ జరక్కుండానే నానీ పన్నెండేళ్ళు వయసులో ఓ విచిత్రమయిన సంఘటన జరిగింది......
ఒకనాడు నానీ ఓ మూల కూచుని నీళ్ళు నిండిన కళ్ళతో శిఇంయంలోకి చూస్తుంటే ఓ వ్యక్తి వచ్చాడు......
అతడే నానీని బాల్యంలో శరణాలయానికి అప్పజెప్పిన వ్యక్తిని ఆ తర్వాత తెలిసింది.....
ఒడిలోకి తీసుకుని అప్యాయంగా కబర్లు చెబుతూ బిస్కెట్ పేకేట్ అందించిన వ్యక్తిని అబ్బురంగా చూసాడు నానీ.
అదే నానీకి వూహ తెలిపాక ఎవరైనా ప్రేమగా దగ్గరకు తీసుకున్నది.