నానీ అంగలార్చుకుపోతున్నది దానికోసమే ......
అందుకే తన గురించి ఆలోచించే మనిషి కూడా ఈ లోకంలో వున్నడన్న సంబరమూ లేక ఇన్నాళ్ళూ నన్నెందుకెవరూ పట్టించుకో లేదన్నఉక్రోషమూ? అమాంతం అతడ్ని చుట్టేస్తూ వెక్కివెక్కి ఏడ్చాడు.
ఆ వ్యక్తి కళ్ళు చెమ్మగిల్లాయి..
"నానీ " తలనిమురుతూ బుజ్జగించాడు........
ఈ రోజంతా నానీ దగ్గరే కూర్చుని కబుర్లు చెప్పాడు.
"మా అమ్మేది. మా నాన్నేవరు" యుగాల తపస్సు తర్వాత కోట్ల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ జవాబుకోసమే తను బ్రతుకు తున్నంతవరకు తమకంతోఅడిగాడు....
"మీ అమ్మేది. మా నాన్నేవరు" యుగాల తపస్సు తర్వాత కోట్ల సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ జవాబుకోసమే తను బ్రతుకుతున్నంత తమకంతో అడిగాడు......
"మీ మీనాన్నకి స్నేహితుడ్ని" నానీని ఓడితో కూర్చోబెట్టుకుని కధంతా చెప్పాడు.
"రామారావు నా స్నేహితుడు ___ ఇద్దరం కలసి వ్యాపారం చేద్దామనుకున్నాం ఒకప్పుడు సరిగ్గా ఆ సమయంలోనే మీ అమ్మ వనజని ప్రేమించాడు . పెళ్ళిచేసుకుందామనుమన్నారు కూడా. ఎవరూలేని మీ అమ్మ గుడ్డిగా రామారావుని నమ్మి అతడే తన సర్వస్వం అనుకుని అంతా అర్పించింది. ఇలా జరుగుతుండగా రామారావుకీ ఒక ఉన్న యింటి సంభందం వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే అతడు వృద్ధి చేయాలనుకుంటున్న వ్యాపారానికి సరిపోయినంత డబ్బు కట్నంగా ఇస్తామనడంలో అతనిలో స్వార్ధం బయలుదేరింది. అదే మీ అమ్మ బ్రతుక్కి ఓ శాపమైపోయింది"అడిగేడతను. అతడు చెబుతున్నది పసివాడైనా నానీకి పూర్తిగా కాకపోయినా చాలావరకు అర్దమైంది.
"బోలెడంత ఆస్తితో తనజీవితంలో అడుగు పెడుతున్న ఆడదాని కోసం మీ అమ్మకి అన్యాయం చేయడానికి సిద్ధపడ్డాడు రామారావు. నేను నచ్చ జెప్పాలని ప్రయత్నించింది విఫలమయ్యాను . అప్పటికే మీ అమ్మ గర్భవతి. ఇక్కడ జరుగుతున్నా తతంగం మీ ఆత్మకు తెలియకూడదని త్వరలోనే పెళ్ళిచేసుకుంటానని మభ్యపేట్టి మరో వూళ్ళో కాపురం పెట్టాడు. నెలలు గడుస్తున్నాయి. రామారావు మీ అమ్మదగ్గరకి రాక్యవడం తగ్గించాడు చూసే దిక్కులేక వస్తులతో కూలీనాలీ చేసుకుంటూ ఎప్పటికైనా తిరిగి రాకపోవడమన్న నమ్మకతో రోజులు దోర్లించసాగింది. చూస్తె నాధుడు లేకుండానే నెలలు నిండిన మీ అమ్మ ప్రసరించసాగింది. చూస్తె నాధుడు లేకుండానే నెలలు నిండిన మీ అమ్మ ప్రసరించింది సరిగ్గా అప్పుడు ఆ ఇంట అడుగుపెట్టాడు రామారావు. అంతనీరసంలోనూ ఆమె కొండంత ధైర్యాన్ని పొందగలిగింది. కాని ఆమెకు తెలియదు .? అతడు వచ్చింది ఏదో కొంత డబ్బుపారేసి ఆమె నోరుమూయించడానికని. చెప్పాడు ఆమె గుండెలవిసేలా ఏడుస్తూ తలబాదుకుంది. ఆ బాధలో ఆమె స్పృహతప్పిపోతుండగా పొత్తిళ్ళాలోని పసికందునందుకుని అక్కడనుంచి బయటపడ్డాడు. ఆపే సత్తులేక అలాగే స్పృహాతప్పిపోయింది. ఆ తర్వాత నిన్ను యుక్తిగా నేను కాపాడి ఈ శరణాలయంలో చేర్చాను. ఎప్పటికైనా పరిస్థితులు చక్కబడితే మళ్ళీ నిన్ను మీ అమ్మానాన్నలను అప్పచెప్పాలనుకున్నాను"
"మరి ఆ తర్వాతనైనా అమ్మ నన్నెందుకు తీసుకెళ్ళాలేదు."
నానీ కళ్ళల్లో నీరుచూసి చలించపోయిన ఆ వ్యక్తి లాలనగా గుండెలకు హత్తుకున్నాడు.
"తీసుకువెళ్ళేదేమో" అగేడు క్షణం..... "స్పృహలోకి వచ్చిన మీ అమ్మ కోసం వెతుకుతూ రామారావు దగ్గరకి బయలుదేరింది. కాని అప్పటికే అక్కడ ఉన్నవాళ్ళ అమ్మాయితో రామారావు పెళ్ళి జరిగి పోతూంది. న్యాయం జరిపించమనికాదు కన్న కొడుకును వెనక్కీచ్చేయమని ప్రాధేయపడింది. కాదు వాడి కాళ్ళావెళ్ళాపడింది. ఎవరికీ ఎరుకపరచలేదు.. మెడపెట్టుకుని గెంటేసాడు. అంతా నాకు మరుసటి రోజు తెలిసింది. వాడినుంచి నిన్నెలా కాపాడి శరణాలయంలో చేర్చిచిందీ ఆమెకు చెప్పాలని ప్రయత్నించాను.... కాని ఆలస్యమైంది. అప్పటికే ఆమె నాకళ్ళ ముందే ఓ లోయలో దూకి చాలా నికృష్టంగా ...... ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది....."
నానీ కళ్ళు నీటిని చిమ్మడంలేదు.
చాలా భావరహితంగా వున్నాయి.
ఒక్కసారిగా ఎదిగిపోయినట్లు కనిపించాడు "ఇదంతా ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు చెబుతున్నావంకుల్ "
నిశ్సబ్దంగా చూసాడతను.
"చెప్పకముందే నేను చచ్చిపోతానేమో అని...."
"ఎందుకు చచ్చిపోతావు " నానీ ఆశ్చర్యంగా చూసేడు.
"నాకు కేన్సర్ బాబూ"
అంటే ఏమిటో అర్దంకాలేదు నానీకి.
అతడు వెళ్ళిపోయాడు నీరసంగా __ ఓ జీవిత సత్యాన్నీ తెలిపి.
అప్పుడే నిర్ణయించుకున్నాడు నానీ ఏం చేయాలో
ప్రపంచ గురించి పూర్తిగా తెలీని నానీ చాలా యుక్తీగా రామారావు ఇంట్లో ఆశ్రమం సంపాదించాడు.
మరో మజలీ ......
ఎందుకు వచ్చేడు వచ్చి ఏం చేయాలనుకుంటున్నడో ఆదిలో నానీకి తెలీని విషయమే......
కొత్త ఇల్లు . ఒకనాడు చిన్న ఇటుకుల వ్యాపారం చేసుకునే రామారావిప్పుడో పెద్ద కాంక్రక్టరు.
చాలా పరపతిగల వ్యక్తి.


