Previous Page Next Page 
ది రైటర్ పేజి 41

    కొండల్ని ఛిద్రం చేసే సర్వాభిసారేచ్చాగల సద్దుతావు త్రీశూలం దూసుకువచ్చినట్టు ___
   
    రెండు కపాలాలు అతడిపై కేగారి పడ్డాయి......
   
    భయంతో కేకవేయబోయాడు___
   
    కాని గొంతు పెగల్లేదు .
   
    ఒకమ్ముడిగా కంకాళాలు ఎగురుతూ అతని ముందుకొచ్చి పడుతున్నాయి.\
   
    ఇది చాలదన్నట్టు వికృతమైన నవ్వులు.....
   
    ప్రేతాత్మలు ప్రజర్విల్లు తనపై తిత్రగాబడుతున్నట్టు ఈలలు....
   
    అంతే....
   
    ఒక ఆర్తనాదం అతడిగొంతు నుంచి వెలువడింది.
   
    నిశ్శబ్ద ప్రకృతి భీలీల్లినట్టు కేకవేస్తూ భయంతో పరుగెత్తాడు......
   
    ఇది వైధేయా రాసిన సీరియల్ లోని సంఘటన కాదు __
   
    ఇంచుమించు అలాగే జరిగిన సంఘటన.......
   
     అల శవాన్ని మాయం చేయాలని సమాధిని తవ్వింది కధలోని ధనుంజయ కాదు ___
   
    నవలలో మాదిరిగానే భార్యను చంపి అక్కడ ఖననంచేసిన అనందరావు.
   
     పొదల్లో నుంచి ముందుగా బయటకువచ్చింది రోషణి.
   
    ఆమెను అనుసరించి వెనుకగావచ్చి నిలబడ్డాడు వైధేయ __
   
     అప్పటికే అతడు చెమటతో తడిసిపోయాడు.
   
    " భయపడుతున్నావా వైదేయా " చేతిలోని ఎముకల్ని నేలపైకి విసిశ్రేస్తూ అడిగింది రోషణి.
   
    ఆమెలో ఎలాంటి సంచాలనమూలేదు......
   
    చాలా మామూలుగా నిలబడి వుంది.
   
    "ఏంటిలా జరిగింది" అడిగాడు ఉద్వేగాన్ని అనుచుకుంటూ, "మనకంటె ముందు ఆనందరావు వచ్చాడేమిటి "
   
    "వచ్చి మనకి సమాధిని తవ్వేపని తప్పించాడు." నవ్వింది సూటిగా చూస్తూ "అవును వైదేయా! పోలీసులు నున్నా సాయంకాలంమే ఇంటరాగేషన్ ప్రారంభించారు. బహుశా రేపో ఎల్లుండో శవాన్ని అటాప్సీ కోసం తీస్తామనుకుంటారు. అందుకే శవాన్ని మాయంచేయాలని ఆనందరావువచ్చేడు మనకంటే ముందుగా "
   
    "ఇప్పుడు మనమేం చేయాలి..." అడిగాడు ఎక్కువ సేపు ఇకఅక్కడే నిలబడే ధైర్యంలేనట్టు.
   
     అ శవాన్ని మాయం చేయాలి "
   
    "ఎలా...."
   
    "ణీ నవల్లో ఎలా మాయంచేసారు ధనుంజయ ప్రత్యర్ధులు ?"
   
    "సమీపంలోని ఓ చితిపై ఉంచి తగలబెట్టేశారు  అది ఆ శావమే అన్న అనుమానం రాకుండా "
   
    "అటుచూడు"
   
    దూరంగా కర్రలు చితిలా పేర్చి ఉన్నాయి.
   
    విభ్రమంగా రోషణి వేపు చూసాడు.
   
    "వైదేయా .... అవసరమైన వాటిని నువ్వూహించనిరీతిలో ఇలా నేను సిద్ధం చేయిస్తుంటారు__ ఆశ్చర్యపోకు.... కమాన్ " సమాధికేసి నడిచింది.
   
     మమాత్రం వేసినట్టుగా ఆమెను అనుసరించాడు.
   
    శవంపైన ఉన్న మట్టిని తీస్తుంటే వైధేయ గుండెలు వేగంగా కొట్టుకోవడమేకాదు అడుర్గందానికి ఊపిరిరందనట్టు విలవిలలాదిపోయేడుకూడా.

    "ఒకవేళ మధ్యలో ఆనందరావు వస్తే___
   
    "అతనికి తోడుగా రోషణి లేదు వైదేయా, సాహాసం చేయడానికి"
   
    "అసలు ఈ శవాన్ని మనం మాయం చేయకపోతే ___" అడిగాడు తేరుకుంటూ.
   
     "కిరణే బహుశా ఆ పనికి వూనుకుంటాడు__"
   
    మరో షాక్ .....
   
     "అంటే __"
   
    "ఆనందరావుని కాపాడాల్సిన బాధ్యతా కిరణ్ దేగా"
   
    నుదురు చిట్లించి చూసేడు "ఎందుకని"
   
    "ఎందుకంటే కిరణ్ అండదండలతోనే ఆనందరావు తను చేసిన హత్యను ఆత్మహత్యగా నిర్ధారించాగలిగేడు కాబట్టి"
   
    "నిజమా!" నిశ్చేష్టుడయ్యాడు.
   
    "అవునూ...... ఇద్దరూ మంచి స్నేహితులుగా"
   
    ఇవన్నీ నీకెలా తెలుసుకున్నట్లు ఉత్కంఠంతో  మరేదో అడగబోతుంటే రోషణియే అంది "వైధీ___ ణీ నవల్లో నువ్వు సృష్టించిన పథకాన్ని ఇప్పుడు మనం అమలు పరచి కిరణ్ ణి సాధించబోతున్నాం"
   
    "ఎలా" వైధేయ గొంతు వణికింది.
   
    "వెయిట్ అండ్ సీ" నిర్లిప్తంగా నవ్వుతూ అతడివేపు చూసింది. ఆకాశంలో ఓ తీతువు అరిచింది.
   
    వైధేయ ఒళ్ళు జలదరిస్తుంది.
   
    మరో పదినిముషాల్లో......
   
    శవాన్ని సమీపంలోని చితిపై ఉంచి విప్పటించారు......
   
    దుర్గంధభూయిష్టంగా ఉన్న ఆ శవాన్ని తాకినా వైధేయకు వాంతయ్యేట్టుగా ఉంది.
   
    పెట్రోలుతో అంటుకున్న చితి భగభగా మండుతుంటే  చేష్టలుడిగిన వైధేయ రోషణ్నేచూస్తున్నాడు.
   
    ఆ నిశ్శబ్ద నిశిరత్రిలో మగవాళ్ళగుండెలు సైతం అదిరిపడే మరు భూమిని బొడ్డున అతిమామూలుగా ఆమె ఎలా ప్రవర్తించాగాలుతూంది......   

 Previous Page Next Page