వికృతంగా నవ్వేడు వైధేయ.
రాక్షసంగా పడీపడీ నవ్వేడు.
వైధేయ అలా నవ్వగలడని రోషణికి తెలీదు.
అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న క్రిమినల్ ఏటిట్యూడ్ తన్నుకుని బయటకి బస్తున్నట్టు నవ్వుతున్న వైదేయని చూస్తూ "ఎప్పుడూ లేనిది ఈ రోజెందుకిలా ప్రవర్తిస్తున్నావు" అందామె.
"నీకు వైశాచికానందమంటే తెలుసా రోషణి"
ఆమె జవాబు చెప్పలేదు. "వాడిమీద తొలిసారి చాలా పాశావికంగా చిన్న గేమ్ ప్లే చేశాను. ఆనందాన్ని పొందుతున్నాను."
|అదే ... ఎందుకూ అని."
వైధేయ కళ్ళల్లోకి అర్డంకానట్టు చూస్తూ అడిగింది.
"చెబుతాను రోషణి..... మనిషి జీవితమెప్పుడూ తను జీవించాలనుకొనిదే అన్న ఆస్కార్ వైల్డు మాటలు నా జేవితంలో నిజమేలా అయ్యాయో నీకు చెబితే ఈ రోజు నేను ఆత్మారాంపై ప్రదర్శించిన అవే శానికి అర్దమేంటో అన్న నీకు భోధపడుతుంది" రెప్పలార్చకుండా బయటకి చూస్తూ అన్నాడు.
రోషణి మరో రెండడుగులు ముందుకేసింది.
"కాని ఇప్పుడు కాదు.... ఈ మూడ్ లో నేను చెప్పలేను."
* * * *
అర్దరాత్రి దాటి చాలాసేపైంది.
ఊరికి ఉత్తరాన ఉన్న స్మశానపు నది బొడ్డులో నిర్విరామంగా ఓ వ్యక్తి సమాధిని తవ్వుతున్నాడు.
ఆ నిబిడాందికారంలోణి స్తబ్దతని అతడి నిట్టూర్పులు చెదరగొడుతున్నాయి.
అఖిలము అమనస్యమై అమిషార్దము పోరాడే ఓ క్రూరమృగపు ఆయోధము అతడి మండుతున్న గుండెల్లో __
స్తప్తజిశ్వుని శతనాల్కలు ఉరస్ప్రూత్రికగా మనసుపై మోదుతుంటే కక్కరము కగ్గమై కత్తివాతయమ్మ కసిగా ఆ మట్టిలో గ్రూచ్చుతూ కైటబారి బీకర సంగ్రామంలో వైరనిర్వాతానశక్తిలో కదం తొక్కుతున్నట్టు ఉగ్రుడై వ్యగ్రుడై ఉద్దీపిత వ్యాకుల నిర్భిన్న వాంచదగ్దుడై శ్రమిస్తున్నాడు.
ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణంలో అతడి పాలభాగాన అలుముకున్న స్వేదబిందువులు ఒక్కొక్కటి సమాధిపై పడి ఇంకిపోతున్నాయి.
సాక్ష్యం చెప్పలేని సమీపంలోని సమాధులు నిర్వికల్ప సమాధిలోకి జారిన జ్ఞానుల్లా మిగిలిపోయాయి.
ప్రేత్మాత్మలు ఘోష పెడుతున్నట్టు గాలిబుసలు కొడుతూంది.
నేలపైకి వెన్నెల జార్చగల ఆకాశంలోకి నక్షత్రాలు పొంచివున్న కాలసర్పపు నేత్రాల్లా క్రిందకి చూస్తున్నాయి.
అలసటగా అగేడొక్క క్షణం .....
ఏమిటి.... ఏవో నీడలు కదులుతున్న అనుభూతి.....
ఎందర్నోతన గుండెల్లో దాచుకున్న ఆ మరుభూమి కొద్దిగా కడులుతున్నట్టుగా అనిపించడంలో భయంతో వెనక్కీ తిరిగాడు.
పైకి ఒరిగిన ఓ గడ్డిముక్క అతడిపైకి వాలి వుంది. అతడు చేసిన పాపాన్ని ప్రశ్నిస్తున్నట్ట్లుగా ....
అదురుతున్న గుండెలతో అక్కడక్కడా విసిరేసేటట్టుగా .....
అదురుతున్న గుండెలతో చుట్టూ చూశాడు.
కపాలాలు కంకాళాలు అక్కడక్కడా విసిరేటట్టుగా .....
వాచీ చూసుకున్నాడు.... రాత్రి రెండున్నర......
పూర్తిగా సమాధిని తవ్వేయాలి ___ శవాన్నీ మాయం చేయాలి ___ తెల్లవారే సరికల్లా అంతా జరిగిపోవాలి__
లేనివాడు పోలీసులు పోస్టుమార్టం జరిపించి తనను దోషిగా నిర్ణయిస్తారు.
అప్పటికే సగానికి పైగా గోతిని తవ్వెడు.
సమానం నశించిపోతూంది.
చేతులు బొబ్బలేక్కుతున్నాయి.
ఆ ముందురోజే తన భార్య హత్యవిషయంలో ఎసీపీ ధావన్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించారు.
మరుసటిరోజే శవాన్ని వెలికితీయడానికి నిర్ణయించాడు.
మరో అడుగులోతు తవ్వితే చాలు___
హాఠాత్తుగా దుర్గంధం వ్యాపించింది. శవం నుంచి వస్తున్న భరింప శక్యంగాని వాసన అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ___
విచితరమైన విస్సహాయంతో దుఖం కట్టలు త్రేంచుకుంటూ౦ది.
గొంతులో సన్నగా వెక్కిళ్ళు____
పిచ్చివాడిలా మట్టినిలాగుతూ మరికాస్తక్రిందకి వంగేడు.
అప్పుడు వినిపించింది. ఎక్కడో ఏదో అడుగుల చప్పుడు......
ఉలికిపాటుగా పైకి చూశాడు...... భయంగా చుట్టూ కలియచూశాడు. అంతా చీకటి __ భ్రమపడుతున్నాడా __
మళ్ళీ ఏదో అలికిడి ... దూరంగా కాదు చాలా సమీపంలో __
ఒకటి __ రెండు __ మూడులిప్తులు ___
నెమ్మదిగా తలతిప్పేడు.
అంతే __
నేలకు నిర్వ్యధనమై నిటలాక్షుని నిర్విర్ణవాగ్ని నిర్వాసనార్డం పైకేగిసినట్టు రెండడుగులు వెనక్కీ దూకెడు. వ్యవధి లేదు......
పూర్తిగా సమాధిని తవ్వేయాలి __ శావన్నీ మాయం చేయాలి __
తెల్లవారేకల్లా అంతా జరిగిపోవాలి __
లేనివాడు పోలీసులు పోస్టుమారటం జరిపించి తనను దోషిగా నిర్ణయిస్తారు.
అప్పటికే సగానికి పైగా గోతిని తవ్వేడు.
సహానం నశించిపోతూంది.
చేతులు బొబ్బలెక్కుతున్నాయి .
ఆ ముందురోజే తన భార్య హత్యవిషయంలో ఎసిపి ధావన్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటరాగేషన్ ప్రారంభించారు.
మరుసటిరోజు శవాన్ని వెలికితీయడానికి నిర్ణయించారు.
మరో అడుగులోతు తవ్వితేచాలు__
హఠాత్తుగా దుర్గ౦ధం వ్యాపించిందిశవం నుంచి వస్తున్న భరింపశక్యంగానివాసన అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే __
విచిత్రమైన నిస్సహాయంతో దుఃఖం కట్టలు త్రెంచుకుంటూ౦ది.
గొంతులో సన్నగా వెక్కిళ్ళు ___
పిచ్చివాడిలా మట్టినిలాగుతూ మరికాస్త క్రిందకి వంగేడు.
అప్పుడు వినిపించింది ఎక్కడో ఏదో అడుగుల చప్పుడు.......
ఉలికిపాటుగా పైకి చూశాడు..... భయంగా చుట్టూ కలియచూశాడు.
అంతా చీకటి ___ భ్రమపడుతున్నాడా __
మళ్ళీ ఏదో అలికిడి .... దూరంగా కాదు చాలా సమీపంలో __
ఒకటి __ రెండు __ మూడులిప్తలు __
నెమ్మదిగా తలతిప్పేడు.
అంతే __
నేలకు నిర్వ్వ్యధనమై నిటాలాక్షునినిర్విద్ధివాగ్ని నిర్వాసనార్ధం పైకేగిసినట్టు బీటిగా రెండడుగులు వెనక్కీ దూకేడు.