Previous Page Next Page 
ది రైటర్ పేజి 39

    ఇందాకటి వ్యక్తి వైధేయని క్రీగంట కనిపెడుతున్నాడు.
   
    ఆటో ఎలా ఎక్కాడో ఏం చెప్పాడో వైధేయకి గుర్తులేదు.
   
    "సన్నాఫై బీచ్ " వైధేయ గుండెలు మండిపోతున్నాయి కిరణ్ గుర్తుకోస్తుంటే.......
   
    "ఏ మార్గం కాని ఎంతటి శ్రమవ్వనీ వాడిపై పగసాధించాలి" అనుకున్నాడు దృఢంగానే ......
   
    ఆటో సందు మొగ తిరుగుతుండగా అలవోకగా చూసేడు.
   
    "ఇక్కడే పోయిందీ.... ఏమై పోయిందీ" దుఃఖాన్ని నిభాయించుకో లేనట్టు కుండికీ తలబాడుకుంటూది. పిచ్చిది.....
   
    "పోయిందేదైనా తలగొట్టుకుంటే మాత్తరం తిరిగొస్తడంటే " ఆ వృద్ధుడు ఎప్పటిలా ఆమెను ఆపే విఫల ప్రయత్నం చేస్తున్నాడు.
   
    ఆటోను వంపి నెమ్మదిగా ఆమెను సమీపించాడు. వైధేయ.
   
    పూర్వంలా కాదు.... చాలా ప్రదేశపడుతూందామె......
   
    గొంతు పెగలని మూగవేదనతో వెక్కి వెక్కి పడుతూంది.
   
    "అవ్వా"
   
    ఏడుపు ఆపిన ఆమె నెమ్మదిగా తలతిప్పి చూసింది.....
   
    నుదురుచిట్లి రక్తం సిందూరంలా పాలాభాగాన అలుముకునివుంది.
   
    "అవ్వా" మరోసారి అర్ధంగా పలికిందని కంఠం....
   
    ఆమె బదులివ్వలేదు .... కాని అశ్రుపూరతానమైనా కళ్ళతో సన్నని మెరుపు.....
   
    మనసు ద్రవించిన వైధేయ జేబులోని నోట్లు తీసి అందించాడు. ఎంతుందో కూడా చూసుకోలేదు.
   
    క్షణంపాటు డబ్బుకేసి వైధేయకి మార్చి మార్చి చూసింది.
   
    ఏడుస్తూనే నవ్వుతూ మొలతోదోసింది.....

    "నుదురు నగులునట్టుంది తాతా"
   
    అప్యాయంగా ఆమె   తలనిమిరి మనసు బాధగా మేలితిరిగిపోతుంటే వేగంగా నడిచాడు.
   
    "ఎందుకయ్యా..... ఎవరూ పట్టించుకోని ఈ అనాధమీద ఇంత వైధేయకి
   
    అయినా ఆగలేదు.....
   
     ఏ విధంగానూ వారికన్నా గొప్ప జీవితంకాదు తనది.... ఒకవేళ ఆ నవలే కాదు.... అప్పుడు ఇంచుమించు తన బతుకూ అస్తవ్యస్థమైనా ఉండేది:
   
    ఆ తాటకి తెలీని విషయమిది .
   
    కేవలం వైధేయకి మాత్రమె పరిమితమైన ఓ సత్యమిది.
   
    ప్రతి మనిషి ఓ బలమైన కార్యాక్రామానికి పూనుకునే ముందు దేవుడికి ముడుపు చెల్లించుకుంటాడు.
   
    కాని వైదేయకి ఆ అలవాటు లేదు.
   
    ఒక బలమయిన ప్రత్యర్ధిని దెబ్బ తీయడానికి ఆ రాత్రికే సిద్ధపడ్డ బోతున్న వైధేయ ఇంచుమించు అలాంటి భావనతో డబ్బు అందించాలామెకు.
   
    దాన్ని ఓ సెంటిమెంట్ గా మనసంగీకరరించినా అతడి కభ్యంతరం లేదు.   
   
                                                        *    *    *    *

    "గేటవుట్"
   
    కాళ్ళావెళ్ళా పడుతున్న ఆత్మారాం ని చూస్తూ అరిచాడు వైధేయ.
   
     "వైధేయగారూ! ఇది అన్యాయం ...... నవల నాకే ఇస్తానని మాటిచ్చి ఇంటికి రప్పించి ఇప్పుడిలా నా కళ్ళముందే మరో పబ్లిషర్ కివ్వడం భావ్యంకాదు."
   
    ఆత్మారాం ప్రాధేయపడుతున్నారు.

    "మీరు వెళ్ళండి" అంటూ వైధేయ నవల్సు ఎప్పుడూ పభ్లిష్ చేసే 'రమ్య చరిత' పభ్లిషర్ ను గేటువరకూ సాగానంపుతూ "ప్రస్తుతం వస్తున్న సీరియల్ నవలతోపాటు నేను త్వరలో ఇవ్వబోయే డైరెక్టు నవల గురించి కూడా పభ్లిసిటీ  ఇచ్చుకోండి" అన్నాడు ఆత్మారాంకి వినిపించేటట్టుగా.
   
    వెనక్కీ తిరిగి వచ్చిన వైధేయ "ఇంకా నిలబడే ఉన్నారేం ఆత్మారాంగారూ  చెప్పానుగా అసలు మీకు నవల ఇవ్వడం జరగని వాణి" అంటూ ద్వారం మాయ బోతుంటే ఆత్మారాం అతడి చేతులు పట్టుకున్నాడు.
   
    విదిలించుకుంటూ "గెట్ వుట్ "అరిచాడు వైధేయ.
   
    "ఇంత నమ్మకద్రోహమా గురించి మాట్లాడటమూ.... సిల్లీ "
   
    కిటికీ తలుపు సైతం భేదేలున  మూసేడు  వైధేయ.
   
    ఆత్మారాం చేసేదిలేనట్టు భారంగా అడుగులు వేస్తూ బయటకు నడిచాడు.
   
    అంతవరకూ అంతా నివ్వెరపోయి చూస్తున్న రోషణి "ఏమిటి వైధీ..... ఇదంతా" విస్తుపోతూ  అడిగింది.
   
    అతడిలో ఇలాంటి తిరుగుబాటు ధోరణి చూడడం అదే తొలిసారి.
   
    "సింపుల్" భుజాలు షగ్ చేశాడు. "నవల ఇస్తానని మాతిచాను. ఇప్పుడు కాదని బయటకి గెంటేస్తాను..... దట్సాల్"
   
    "అదే ... అతనిపై ఎందుకంత కోపమూ అని"              

 Previous Page Next Page