Previous Page Next Page 
ది రైటర్ పేజి 29

    ఉద్రేకంగా కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా పరుపు చేరి నిద్రపోతున్న వైధేయ ముఖంలోకి చూస్తూ వుండిపోయింది__

    గుండె అట్టడుగుపొరల్లో ఒకకలవరం__కల్లోల సాగర మధనం...
   
    కిటికీలో నుంచి వీస్తున్న సన్నని చిరుగాలి నేపధ్యంలా__అయినా ఆమెలో అలజడి ఉధృతమౌతుంది తప్ప ఉపశమించడంలేదు.
   
    ఒక వేడి కన్నీటి బొట్టు ఆమె నుంచి రాలి వైధేయ నుదుటిపై బడింది.
   
    నిద్రలోనే కలవరించాడతను....'రోషిణీ!....ఐ లవ్ యూ'
   
    ఒక తల్లిని పెనవేసుకున్న పసిపాపలా ఓ చేత్తో ఆమెను చుట్టేసాడు.
   
    అప్పటికే ఆమె నేత్రాలు అరుణిమలయ్యాయి.
   
    కనుపాపలు రక్తం ఓడుతున్నట్టుగా మారేయి.
   
    మెల్లగా మెలమెల్లగా అతడి నుదుటిపై ఒరిగి సుతిమెత్తగా.
   
    ఆకాశంలో స్వేచ్చగా ఎగిరే ఓ పక్షి నేలపై అందంగా విరబూసిన ఓ తెల్లగులాబీని చూసి ఆకర్షతురాలైంది.నన్ను ప్రేమించవూ అంటూ ఆర్తిగా అడిగితే ఆకతాయి గులాబీ నువ్వు కోయిలలా పాడగలవా ప్రేమిస్తానూ అంది. పాటలు రాని పక్షి తెల్లబోయింది. కటాక్షించే వరకూ చుట్టూరా పరిభ్రమిస్థానంది.పక్షి మొండి తనం చూసిన తెల్లగులాబీ "పాటలురాని ఓ    పక్షీ పోనీ నేను ఎరుపుగా మారేవరకూ ఎదురు చూడగలవా" అంది మళ్ళీ చిలిపిగానే...ఏదో   
   
    అర్ధమైన పక్షి వెంటనే తెల్లగులాబీని చేరి కౌగలించుకుంది. గులాబీ ముళ్ళు గొంతులోకి దిగబడింది...ధారగా చిమ్మినరక్తం తెల్లగులాబీని ఎరుపుగా మార్చింది. ఆ క్షణాన పక్షి గొంతు నుండి వెలువడిన ఆర్తానాదమే ఓ అమరగీతమై గులాబీ గుండెల్ని జలదరింపజేసింది...    గులాబీ రెండు కోరికలూ నెరవేరాయి. కాని రెండూ ఒకటి కాకముందే పక్షి నేలకూలింది. "నా వైధేయా...నా పిచ్చి వైదేయా...నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను...కాని"
   
    తన చెంపల్ని అతడి గుండెలపై ఆన్చి అలాగే వుండిపోయింది చాలాసేపు__
   
    రెప్పలార్చకుండా చూస్తున్న అమెద్రుష్టి అలవోకగా టేబుల్ పై పడింది..... అంతే...... వేగంగా లేచి టేబుల్ ని చేరుకుంది.
   
    ఇమ్దాకతన "విగ్గు" ఉంచిన చోట విగ్గుతోపాటు ఓ పుస్తకం కనిపించి ఆత్రంగా పేజీలు తిప్పింది.
   
    అది కాదు యజమాని తాలూకూ డైరీ ___ పొరపాటున విగ్గుతోబాటు తీసుకు రాబడింది. బహుశా తాను "విగ్గు" దాచిన డేష్ బోర్డులో ఇదీ ఉంది ఉంటుంది.
   
    డైరీలోని అక్షరాల్ని చూసిన అమెపెడవులు మృదువుగా విచ్చుకున్నాయి ఆ స్థితిలో కూడా.
   
                      *    *    *    *   
   
    "ఎంతసేపైంది నిద్రలేచి"
   
    వెల్లకిలా పడుకుని సీలింగ్ వేపు చూస్తున్న రోషణి పైచేయి వేస్తూ అడిగాడు వైధేయ.
   
    తెల్లవారినసూచనగా రోడ్లపై సందడి.
   
    కిటికీలో వాలుగా పడుతున్న ఉదయ సూర్యుని లేత కిరణాల పసిమికాంతికి  రోషణి శరీరం బంగారంలా మెరిసిపోతూంది.
   
    "నిన్నే" రెట్టించాడు.
   
    "ఏంటి" అంది బడలికగా చూస్తూనే.
   
    "ఎప్పుడు లేచావూ అంటున్నాను."
   
    "నిద్రపోతేనా"
   
    "అదేం___"
   
    "వళ్ళంతా నుగ్గయిపోయింది"
   
    ఏ మగాడైనా గర్వపడే క్షణాలవి.
   
    "చెప్పాల్సింది" అన్నాడు.
   
    "ఏమని" స్వప్నంలోలా అడిగింది.
   
    "నంజుకోవాల్సిన అందాన్ని నుగ్గు చేయకూ అని"
   
    "అంటే మాత్రం నువ్వేం అగేటట్టున్నావా"
   
    "యూ... నాటీ" మీదికి రాబోయాడు.
   
    "నన్ను బ్రతకనీయ్ ___మహానుభావా" అలవొకగా తల తిప్పింది.

    ఎప్పుడు వచ్చిందోద్వారానికి క్రిందుగాఆరోజు దినపత్రిక .
   
    ఒంటికి దుప్పటి పట్టుకుని ఒక్క అంగలో ద్వారం దగ్గరకి నడిచి దినపత్రిక అందుకుంది.
   
    మొదటి పేజీలో చాలా స్పష్టంగా హెడ్ లైన్ తో ప్రచురింపబడింది.    

 Previous Page Next Page