Previous Page Next Page 
ది రైటర్ పేజి 28

    అనాచ్చాదిత ఉపబృంహిత ఉపాసంగమయి ఆమె మేని వంపులు రెచ్చగొడుతుంటే అధోభువనాదిష్ట నాసక్తుడై ఉన్మదంగా చూస్తూ "రోషిణి ఎవర్నువ్వు...ఎక్కడినించి వచ్చావు...ఎందుకు నా జీవితంలో అడుగుపెట్టావు" గొణిగాడు కళ్ళు అరమోడ్పులవుతుంటే.
   
    "వైధయా" ఒక మాయ తెరను కప్పుతున్నట్టు ఊర్పులతో సౌష్టవాన్ని ఉద్దీపం చేస్తూ "నలిగిపోయిన ఒక అపురూపమయిన డైరీలో చిరిగిపోతున్నచివారి పేజీని నేను. చూడు కాని ఏనాడూ చదవాలని ప్రయత్నించకు" గొణిగింది కలలోలా.
   
    మరేదో అడగాలనుకున్నాడు. అదీ కొద్దిసేపే....
   
    కాని అంతలోనే ఆవేశం అవకుంఠితమై కాంక్ష అవష్టబ్ధమైణ అతడ్ని కాల్చుతుంటే ఆడుకునే ఉద్రేకం తప్ప మాటలాడుకునే వ్యవధి లేనట్టు అమాంతం ఆమెను పై కెత్తుకుని ఒక బొమ్మను విసిరినట్టు పరుపుపై పడేసి రెప్పపాటులో ఆమెను చుట్టేశాడు.
   
    అతడి స్పర్శకు ఆమె ఎగిరెగిరిపడుతూంది.
   
    క్రైంని మించి సెక్సును రాయగల వైదేయ రాతల్లోనే కాదు చేతుల్లోనూ విష్ణాతుడ్నే అని నిరూపించుకుంటున్నట్టు చేతివ్రేళ్ళ స్పర్స తో ఆమె ఒంటిని రాగాల పల్లకిగా మార్చుతున్నాడు.
   
    ఆమె పులకరింతగా మెలిదిరుగుతూ పిచ్చిదానిలా అతడి జుట్టును బిగపట్టుకుని సన్నగా మూలిగింది.
   
    ఆమె చేతులు అతడి నడుంపైకి అక్కడనుంచి క్రిందుగా ఇంకా దిగువగా సాగి...."గాడ్" అరిచాడు.ఆమెను మరింత బలంగా హత్తుకుపోతూనే.
   
    "యూ ఆర్ గ్రేట్ రోషిణీ..." కలవరింతలా అన్నాడు.
   
    "యూ టూ డియర్ వైదే...." ఆక్షణాన వైదేయరాసిన శృంగార సాహిత్య వినీలాకాశంలోని ప్రతి సన్ని వేశమూ ఒక తారకలా ఆమెకు దర్శనమిస్తూంటే ఆమె జాబిలి సోనలో తడిసిపోతున్నట్టు అనుభూతిచెందుతూంది "ప్రొసీడ్ వైధీ....స్టిల్ ప్రొసీడ్"
   
    ఆ గదిలో గాలి గడ్డకట్టుకుపోయింది.
   
    కాలం స్థంభించిపోయింది.
   
    అతడి చేతులు ఆమె పాదాలు అంచులపైనుంచి మోకాళ్ళమీదుగా ఇసుకతిన్నెల మనుపుని స్పృశిస్తూ అఘాతపు అంచులవరకూ వచ్చి నునువెచ్చగా తాకగానే ఉలికిపాటుగా అరిచింది. "డోంట్ కిల్ మి" అంటూ
   
    ఆమె రొప్పుతూ గిలగిల్లాడుతుంటే వైదేయ మరింత విజ్రుంభించాడు   

    కొండచిలువలా అతడ్ని చుట్టేసిన ఆమెచేతుల్ని మృదువుగా ఎడం చేసాడు.
   
    అదీ కొన్ని లిప్తలపాటు...అంతే...
   
    స్వేదంతో తడుస్తున్న ఆమె సౌందర్యాన్ని ఓ మారు అపాద మస్తకం పరికించి....అతడు కరిగిన హిమవన్నగమై రసాతలాన్ని చేరిన ఖగమయి ఖద్యోతుని కిరణాల ఖనిత్రమయి బలంగా చాలా వేగంగా సాగే ఝురిరా మారేడు.
   
    సొమ్మసిల్లిపోతున్నట్టు ఆమె నేత్రాలు అరమోడ్పులయ్యాయి!
   
    యుగాల తపస్సు ఫలించిన మౌనిలా క్షత్ర క్షుద్బాధ చల్లారని క్రూరమృగంలా అతడు విజ్రుంభిస్తుంటే...
`   
    "యూ ఆర్రియల్ హిమాన్" కలవరించిందామె. "అనుభవంలోని ఆనందం ఇంతటి అసదృశమని తెలియచెప్పిన నా వైదేయా నీకు నా జోహార్లు" స్పృహ తప్పిపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంది.
   
    అలసిన ఆమె కనురెప్పల అంచులనుంచి రెండు నీటి బొట్లు బాధగా ఆమె చెంపలపైకి జారేయి.
   
                         *    *    *
   
    ఉలికిపాటుగా నిద్రలేచింది రోషిణి.
   
    నిశ్శబ్దం...చుట్టూ నిశ్శబ్దం....కాని ఆమె గుండె గాడి తప్పినట్టు అస్తవ్యస్తంగా కొట్టుకుంటూంది.
   
    ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది.
   
    అర్దరాత్రి చీకట్లను చీల్చుతూ పిశాచాల హోరులా గాలి గదిలోకి దూసుకువస్తుంది.
   
    మంటలు...మంటలు...ఆమె కళ్ళముందు మంటలు__కళ్ళలో మంటల నీడలు....మహార్ణవపు మధ్యలో అగ్ని పర్వతాల పగుళ్ళు....భీకర బడబానలపు హోరు...దిగంబరంగా అంబరాన్ని చుంబించాలని ఒంటరిగా పరుగు....అగాధాల నీడలు__మేఘాల ఒరిపిళ్ళు...ఎవరిదో ఆర్తనాదం__
   
    అంతే ఆమె నిద్ర లేచింది.
   
    క్రోధంగా రెండు నీటిబొట్లు జారేయి ఆమె కళ్ళనుంచి.
   
    ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
   
    "ఎందుకే కన్నీరూ. ఎందుకు పడతావు. నీ అస్తిత్వంతో నన్ను ఓడించాలని ఎందుకు దూసుకొస్తావు కొండకోనల్లో విరిసిన గులాబీనే, విడిచి పెడితే వాడి రాలిపోదా...కోరి చేరిన వాళ్ళని ముళ్ళతోగుచ్చుతా....అలసిపోనివ్వకే నీ ఉనికితో కలిసిపోనివ్వకు....రాకమ్మా రాకు__నన్ను బేలగా మార్చకు"   

 Previous Page Next Page