"ఆగష్టు ఇరవై మూడు.....క్రితంరాత్రి సుమారు పదిన్నర గంటల ప్రాతంలో విజయవాడ హైవేలోని ఓ పెట్రోలు బంకును దుండగులు దోచుకుని దగ్దం చేసారు......పెట్రోల్ బంకు మేనేజరు అందులో పనిచేసే పడిహేనుళ్ళు కుర్రవాడు షాక్ మూలంగా స్పృహా తప్పి ఈవార్త ప్రచురించే సమాయనికి ఇమ్కామేలుకువాలోకి రాకపోవడంతోపోలీసులు వివరాల్ని పూర్తిగా సేకరించలేకపోయారు.
రాష్ట్రంలో ఎన్నో దోపీడిలు దొంగతనాలుచేస్తున్నా ఓ అంత రాష్ట్రీయ ముఠాయే దీనికి కారణమై వుంటుందని పోలీసువర్గాల అంచనా ......
అసలు ఈ పెట్రోల్ బంకు అధిపతి అరుణ మరెవరో కాదు"
రోషణి చదువుతున్నదల్లా టక్కున ఆగిపోయింది.
"వాట్ కోయిన్సిడేన్స్"
వైధేయ వెన్నులో మొదలైన వణుకు అప్పటికే క్రమంగా శరీరమంతా వ్యాపించింది......
కొన్ని క్షణాల క్రితం వరకూ అతడు ఆ విషయాన్నే మరచిపోయాడు. కాదు రోషణితోపంచుకున్న అనుభవం మరిపించింది.
"ఇదేంటి! ఈ ఆడపిల్ల ఇంత మామూలుగా ఎలా వుండగల్గుతుంది" గగుర్పాటుగా అనుకున్నాడు రోషణ్ణి చూస్తూ .
ఆమె నవ్వూతుంది కసిగా క్రోధంగా ......
హఠాత్తుగా మరోమారు కిరణ్ పేరు వినబడడంతో "రోషణి! ఏమ్డుకానవ్వు" ఉడుకుమెత్తనంగా అరిచాడు వైధేయ.
ఆమె ఆగలేదు.
కళ్ళలో నీరు చిప్పిలేట్టు ఇంకా నవ్వుతూనే "నవ్వాలి వైధేయా! పగలపడి నవ్వాలి..... ఏమ్డుకావుతెలుసా ఆ పెట్రోల్ బంకు దగ్దం చేసి కిరణ్ పై దెబ్బ తీసాం కాబట్టి" అంది.
కిరణ్ పై దెబ్బ తీయడమేమిటి?
అనుమానంగా చూశాడు.
"ఈ బంకు యజమాని అరుణ్ మరెవరో కాదు వాడి అన్నేవట...... వాడే..... నన్ను నమ్మకద్రోహంతోజైలుకు పంపేడే కిరణ్...... ఇన్స్ స్పెక్టర్ కిరణ్......."
త్రుళ్ళిపడ్డాడు వైధేయ......"కిరణ్ పోలీస్ ఇన్ స్పెక్టరా ....!?"
"యస్" ఆమె ఉన్మాదిలా నవ్వుతూంది.
"మైగాడ్" గోణికాడు "అంటే మనం చాలా బలమైన ప్రత్యర్ధితో డీకన్నామన్నమాట"
"ఛ! అలా మాటాడకు ...." రోషంగా చూసింది. "వాడు ఆ రోగ్ మనకి బలమైన ప్రత్యర్దా....... ఆర్యూమేడ్..... ఎందుకు వైధేయా.... నీతో పాటు నన్నూఎందుకిలా తక్కువుగా అంచనా వేస్తావు"
నిజమే..... వైధేయ చాలా తక్కువుగా అంచనా వేసాడు......
"నీకు తెలీదు రోషణి! పోలీసులతో పెట్టుకుంటే పిచ్చికుక్కలా పడి వెంట తరుముతారు" ఉద్వేగాన్ని అణుచుకుంటూ అన్నాడు.
"షటప్ "చీత్కారంగా చూస్తూ "నువ్వేం మగాడివి" అంది.
"రోషణి"
"యస్ మిస్టర్ వైధేయా? నా అనుభవం కోసం వేంపర్లాడే నువ్వు నాకోసం ఏం చేయడాకైనా సిద్ధపడాల్సిన నువ్వు నాకుంయాయం చేసిన మగాడ్ని చూసి బెదిరి బిగుసుకుపోతున్నావంటే నిన్ను మగాడిలా ఎలా అంగీకారించను."
వైధేయకి పిచ్చేక్కుటున్నట్లుగా వుంది.
క్షణక్షణాకీ అమె అతడికో కొత్త వ్యక్తిగా దర్శనమిస్తుంటే అస్థిమితంగా చూస్తూ వుండిపోయాడు.
కొన్ని లిప్తల నిశ్శబ్దం తర్వాత నెమ్మదిగా అతడ్ని చేరుకొని "వైధేయా నా శత్రువు గాదూ" అత్రిగా అతడి కళ్ళలోకి చూస్తూ అతడు వెనక్కీ తగ్గడానికి.
అయినా వైధేయ అంతరంగంలో ఫలానాదీ అని గుర్తించలేని సంఘర్షణ.
"వైధేయా! నేరం ఏ అంతరాష్ట్రీయ ముఠాపైనోపడితే మనల్ల్నేలా గుర్తించగలరు పోలీసులు పైగా పెట్రోల్ బంకు మేనేజరూ కుర్రాడూ ఇంకా స్పృహాలోకి రాలేదుగా"
"ఒకవేళ వస్తే "
"వచ్చినా నన్ను గుర్తించరు"
"కాని కారు నెంబర్ చెబుతారు."
"చెప్పినా ఆకారుమనది కాదు..... అసలు అకారే దొంగలింఛబడలేదు" దృఢ౦గా వల్కిన రోషణ్ణి ఆ ప్రతిభడై చూసాడు.