Previous Page Next Page 
ది రైటర్ పేజి 27

    "వ్వాట్ హేపెండ్ ఇన్ స్పెక్టర్"
   
    డ్రైవింగ్ సీటులోనుంచే పక్కకు ఒరిగి అడిగింది రోషణి.
   
    "రెస్టారెంట్ కి వచ్చేటప్పుడు కారు తీసుకోచ్చానంటాడు మేడమ్..... బయటకు వచ్చేసరికి లేదంటాడు" కారు యజమానిని చూపిస్తూ అంటున్నాడు  యస్సై.
   
    "ఐసీ" కారును పార్కింగ్ కోసమన్నట్టుగా ఓ మూలకి పోనిచ్చిందామె.
   
    అంటే ___ అతడు పోయిందంటున్నది డాట్సన్ కారా ___
   
    తేరుకుంటూ ధైర్యంగా బయటకి వచ్చేడు వైధేయ___
   
    ఎంత ధైర్యంగా హేండిల్ చేసింది రోషణి.
   
    వైధేయ సాలోచనగా చూసాడు కారు దిగి.....
   
    ఆమెలో ఎలాంటి సంచలనమూ లేదు.
   
    చాలామమూలుగా ఉంది.
   
    "అయితే నా కారేమైన్నట్టు....."
   
    కారు యజమాని ఇంకా మొత్తుకుంటూనే ఉన్నాడు.
   
    లైటు వెలుగులో అప్పుడు స్పష్టంగా కనిపించాడు వైధేయకి.
   
    అతడు మరెవరో కాదు.
   
    ఆనందరావు....
   
    ఒకనాడు పార్కులోవైధేయాపైచేయి చేసుకోవడానికి సిద్దపడ్డ కౌర్ సింగ్ .
   
                       *    *    *    *   
   
    వైధేయకి ఇంకా అలజడి తగ్గలేదు.
   
    ఇంటికివచ్చి అరగంట గడుస్తున్నా చాలా దారుణంగా బెదిరిపోతూన్నాడింకా.......
   
                  ______________________________________________
                                                      ఎఫ్ ఫర్ ఫియర్
                       ____________________________________________
       

   
    ఏనాడూ లేనిది తను ఇంత సాహాసానికి ఒడిగట్టాడా.......
   
    తనకు బాగామెంతు౦టే మాత్రమేం   
    తను ఒనేరంలో పాలుపంచుకున్నాడు........
   
    ఒకవేళ పోలీసులకీ  పట్టుబడితే.......
   
    సమయం గడుస్తున్న కొద్దీ చాలా సహజమైన భయమ్కలవరపాటు అతన్ని చుట్టూముట్టి నిస్స్పృహవలో ముంచేస్తుంటే బాధగా తల పట్టుకున్నాడు......
   
    "ఇంకా అలాగే కూచున్నావా" రోషణి కంఠం వినిపించింది మత్తుగా నెమ్మదిగా తలపై కేట్టాడు వైధేయ.
   
    బెడ్ రూమ్ లో జీరోవాట్ బల్బు చిమ్ముతున్న మసక వెలుతురులో చేతులుసాచి నిలబడివుంది రోషణి.
   
    సన్నని ఉల్లిపొరలాంటి నితీ ధరించిన రోషణి రగులుతున్నరోషనారాలాకనిపించింది క్షణంపాటు.....
   
    ఆమె సన్నగా నవ్వుతూంది.
   
    నీలి ఆకాశం నుంచి రాలిపడిన మేఘశకలమా!
   
    లేక రోచిస్సుల మేలిముసుగులోరవలిమ్చే రెబెక్కా స్నిగ్డమోహన సౌందర్యమా౧   
   
    వైధేయఇంకా తేరుకోలేదు రెండడుగులు ముండుకునదిచిన రోషణి అతడి చెంపల్ని చేతుల్లోకి తీసుకుంది.
   
    అదురుతున్న అతడి పెదవుల్నిచూస్తూ లాలనగా ముద్దు పెట్టుకుంది.
   
    అమాంతం అమెను చుట్టేస్తాడనుకుంది.
   
    కాని అతడింకా ఏదో వేడుకుతున్నట్టు చేతులతో ఆమె శరీరాన్నిస్పృశిస్తున్నాడు.
   
    అ స్పర్శలోఅవేశం లేదు ...
   
    నిభిడాంధకారంలోదారి కోసం తడుముకుంటున్నట్లుగా వుంది.
   
    "ఏమైంది నీకు..."
   
    అడిగింది సుతారంగా.
   
    "ఒకవేళ మనం పోలీసులకీ దొరికితే....."
   
    "మైగాడ్ ! నువ్వింకా ఆ విషయమే ఆలోచిస్తున్నావా " అంది ఆశ్చర్యంగా.
   
    "అవును రోషణి! ఇంతటిలో అంతా ముగిసిపోలేదుగా."

    అతడి కంఠం వణికింది.
   
    "చాలా సల్పకాలంలో ఓ చరిత్రకు సృష్టికర్తవు కాబోతున్న ఓ వైధేయా! ప్రారంభంఇప్పుడే జరిగితే అంతా ముగిసిందని అప్పుడే ఎలా అనగలను" అంది లోతుగా అతడి కళ్ళలోకి చూస్తూ "అయినా నువ్వేం ఇంత పిరికివాడవి"
   
    "పిరికితనం కాదు రోషణి! పర్యవసానం గురించి భయం."
   
    "ఆ భయమే వైధేయా పిరికితనమంటే"
   
    "ఒకవేళ ఆ పెట్రోలు బంకువాళ్ళునిన్ను గుర్తుపడితే" అందోళన అతడి గొంతులో......
   
    "గుర్తుపట్టాకుండా జాగ్రత్త తీసుకున్నంగా."
   
    "కనీసం ణీ కారు నెంబరైనా చూసుంటారు."
   
    "చూసి వుండరు. ఒకవేళ చూసినా అది మనమే దొంగలించినట్టు రుజువేమిటి "స్థిరంగా జవాబిచ్చింది అతడి జూట్టులోకి వెళ్ళు పోనిస్తూ.
   
    "రోషణి" సంచలనంలో అతడి చేతులు ఆమెపై నర్తిస్తున్నాయి. "నేరం చేసిన వాళ్ళంతా సరిగ్గా నీలాగే ఆలోచిస్తున్నారు. రోషణి! కాని ఎక్కడో తమకు తెలియకుండానేఓ పొరపాటుచేస్తారు. అది చాలు"
   
    "స్టుపిడీటీ! అసలు నువ్వేనా ఇంత క్రైం సాహిత్యాన్నిరాసింది. పిచ్చి వైధయా! అన్నిటికీ నేనున్నాగా" కలలోలా అంటూ మృదువుగా అతని తలను గుండెలకు హత్తుకుంది."ఇంత అందం నీ ముందుండగా అమూల్యమైన కాలాన్ని అర్ధం లేని ఆలోచనలతో ఎందుకు పాడుచేస్తావు రా! అనుభవించు....మగాడిలా ఆలోచించు.... మగాడివై ఈ సుఖాల పడవపై ఆనందపు ఆవలిగట్టు వరకూ ప్రయణం చెయ్యి....వైధయా! కమాన్...."

 Previous Page Next Page