Previous Page Next Page 
ది రైటర్ పేజి 26

    మరుక్షణం వెలుగుతున్న లైటర్ ఓ మిస్సైలా ఎగిరి బంకుపక్కన పడింది.
   
    నేలపై మంటలు......
   
    చాలాస్వల్ప వ్యవధిలో బంకు మేనేజరు కుర్రాడూ  ప్రమాదాన్ని గుర్తించినట్లుగా దూరంగా పరుగెత్తాడు....
   
    అంతే.....
   
    పెట్రోల్ బంక్ కూడా అంటుకుంది.
   
    క్షణం నిశీధి వణికేట్టు పెద్ద ప్రేలుడు.
   
    మంటలు అకాశాన్నంటుకున్నాయి.
   
    'నో' దూరంగా కారాపిన నేలపై తలబాదుకున్నాడు మేనేజరు.
   
    ఓ పర్లాంగు దూరంలో కారాపిన రోషిణిడిగి వెనక్కీ చూసింది.
   
    "గుడ్ హేవేన్స్ .... దే ఆర్ సేఫ్"
   
    సరిగ్గా అప్పుడే ___
   
    ఒఅకారం చెట్టు ప్రక్క నుంచి కదిలిబంకువేపునడిచింది నెమ్మదిగా.
   
                     *    *    *    *   
   
    "స్ల్పెం డిడ్"
   
    కేష్ బాక్స్ తో కారులో వచ్చిన రోషణ్ణి చూడగానే హుషారుగా అభినందించాడు వైదేయ.
   
    నిజానికి ఆహుశారు డబ్బు కొల్లగట్టి తెచ్చినందుక్కాదు.
   
    ఆ రాత్రి అమెనుకొల్లగొట్టబోతున్న తన అదృష్టానికి .
   
    "కారేక్కడ" ఫియేట్ లోనుమ్చే అడిగింది.
   
    "అక్కడే...." ఇరవై అయిదోమైలు రాయికి అనుకుని వున్న ఒపోదచాటున కనిపించింది డాట్సన్ .
   
    "లవ్ లీ" కారును చూస్తూ ఈలవేసింది. "ఐలవ్ దిస్"
   
    "ఐ టూ" అనే కోరికిగా చూస్తూ అన్నాడు.
   
    నిర్మానుషంగా ఉన్న ప్రదేశం చుట్టూ ఓమారుకలియచూసి ఫియేట్ ని ఓమూల ఆపింది.
   
    దిగాపోతూ ఏదో గుర్తుకొచ్చినట్టు క్షణం ఆగి డేష్ బోర్డ్ లో వున్న విగ్గును అందుకుంది.
   
    అప్పటికే కాంట్రాక్ట్ లెన్స్ తీసేయడంలో ఆమె కళ్ళ నుంచి కొద్దిగా నీళ్ళు చిమ్ముతున్నాయి.
   
    చాలవేగంగా డాట్స్ న్ ని చెరుకున్నారిద్దరూ.
   
    ఈ సారి రోషణి డ్రైవింగ్ సీటులో కూచుంది. మరుక్షణం కారు కదిలింది.
   
    నెలకి రెండు మూడు అంగుళాల ఎత్తులో వెళ్తున్నట్టుగా వుంది డాట్సన్ ....
   
    అతడు వారించబోతుంటే "చివరికి ఆ రెస్టారెంట్ లో డాట్స్ నే సంపాదించారన్నమాట " అడిగిందామె.
   
    "అవును"
   
    "నాకు తెలుసు నువ్వదేతీసుకోస్తావని" నవ్వింది చిలిపిగా.
   
    "ఎలా...."
   
    "నీకు దుమ్ముంటే చాలా ఇష్టం కాబట్టి....." అతడుమారావు ప్రశ్న వేయబోతుండగా ఓ చేత్తో అమాంతంగా అతడ్ని దగ్గరకు లాక్కుని పెదవులపై బలంగా ముద్దేపెట్టుకుంది.
   
    అడగాల్సిన చాలా ముఖ్యమైన ప్రశ్న గొంతులోనే సామాదై పోయింది.
   
    "స్లోగా పోనియ్" భయంగా చూసేడు.
   
    "కొద్దిగా మిగిలింది"
   
    "ఏంటి" అడిగాడు.
   
    "నీలోని పిరికితనం"
   
    అతడు మాట్లాడలేదు.
   
    "లుక్ ఎట్ దిస్" కారు పెట్రోల్ బంకుఉన్న ప్రదేశాన్ని దాటుకు వెళ్తుంటే కేజువాల్ గా చూసిన వైధేయకి మతిపోయినట్టయింది.
   
    కారు మేఘాల్లా ఆ ప్రదేశాన్ని వ్యాపించి వున్నాయి నల్లని పొగలు __
   
    చుట్టూ జనం
   
    "హారిబుల్" గొంతు తడారిపోతుంటే "మరి ఆ ఇద్దరూ" అడిగాడు.
   
    "వాళ్ళకేం కాలేదు" సీరియస్ గా అంది.
   
    ఎందుకో ఇప్పుడు తన పక్కనున్న రోషణ్ణి చూస్తుంటే మనిషి రూపంలో వున్న మిన్నాగులా అనిపించింది.
   
    "ఏంటి ఆలోచిస్తున్నావు"
   
    "నీ గురించే"
   
    "నా గురించా? ఈ రాత్రికి నాతో గడవబోయే క్షణాల గురించా?" కవ్విస్తున్నట్ట్లుగా చూస్తుంటే తట్టుకోలేకపోయాడు.
   
    కాంక్షగా ఆమె చెంపల వేపు జరగగానే "కాస్త ఓపిక పట్టాలేపూ" అంది క్రీగంట చూస్తూనే "మరో అయిదు నిముషాలు అగు"
   
    కారు అప్పటికే రెస్టారెంట్ ను చేరుకుంది.
   
    "స్టాఫ్" అరిచాడు వైధేయ ఆవరణలో వున్న పోలీసుల్నీ చూస్తూ
   
    కారాపింది.....
   
    "నాకారు ..... నా కారుంచిందిక్కడే" గావు కేకలు పెడుతున్నాడోవుఅక్తి పార్కింగ్ ప్లేస్ లో నిలబడ్డ యస్ ఐ ఆగిన కారుకేసిచూసేడు.
   
    అంతే.......
   
    వైధేయమోహం పాలిపోయింది.         

 Previous Page Next Page