"ఇక చలమయ్యగారి విషయం. అయన విషయంలో ప్రతీకారమేం చేయాలో ముందుగా నిర్ణయించుకోలేదు. ఆయన్నర్ధం చేసుకునేందు కాయనింట్లోనే మకాం పెట్టాను. ముందు గరవయ్యను సంస్కరించడం ద్వారా ఆయనపై ప్రతీకార మవుతు౦దనుకున్నాను కానీ అజ్ఞాతంగా ఉన్న నాన్న ఊరుకుంటాడా? ఏ పరిస్థితులు చలమయ్య ద్వారా నాన్న కేర్పడ్డాయో _ ఆ పరిస్థితుల్లో౦చి ఆయన్ను నేను రక్షించగల అవకాశం నాకొచ్చింది.
"ఇప్పుడిక నా ప్రతీకారం ముగిసింది. రమాకాంతం గారు ఎన్నికయ్యే వరకూ నేనెవరో మీకు చెప్పకూడదని ఆగాను. ఇప్పుడు నా కోరిక చెబుతాను. అది మీరు తీర్చగలిగితే నా మనసు మరింత సంతోషపడుతుంది. నా ప్రతీకారం సఫలమవుతుంది. మీరంగీకరిస్తే _ మీ మనస్సులో కలిగిన పరివర్తన నన్ను పరవశుడ్ని చేస్తుంది. అంగీకరించరూ __ మీ మనస్సులో పరివర్తన కలిగలేదనే అర్ధం. అప్పుడు మీరు నాతండ్రికి పట్టిన గతి నాకు పట్టించనవసరం లేదు. ఓటమి నంగీకరించి నేనే ఇక్కణ్నించి వెళ్ళిపోతాను ....." అన్నాడు రాజారావు.
చలమయ్య, రమాకాంతం చాలాసేపు స్థాణువుల్లో ఉండిపోయారు. విపరీతమయిన మానసిక సంచలనానికి గురయినారు వాళ్ళు.
ఇది నిజమా?
అపకారం పొందిన వ్యక్తి ఉపకారం చేయడం కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. అందుకు నానా అవస్థలూ పడ్డాడు. ఆఖరికి దేవుడితో కూడా చెలగాటమాడాడు. అంతా అయేక _ ఇదే నా ప్రతీకారం !" అన్నాడు
ప్రతీకారం _ రాజరావా పదానికే కొత్త అర్ధాన్నిచ్చాడు.
చలమయ్య ప్రాణాల్నీ , అతడి భార్య మనాన్నీ రక్షించాడు. దుర్వ్యసనాల పాలయినచలమయ్య కొడుకు గరవయ్యను సంస్కరించాడు. రమాకాంతం పలుకుబడిని పెంచి, ఏమాత్రమూ అవకాశం లేదన్న సమయంలో అతడిని ప్రెసిడెంటుచేసే పరిస్తితు లేర్పరిచాడు. ఇదంతా ఎందుకు? అతడు చలమయ్య, రమాకాంతంపై పగబూనాడు. వారిరువురిపై అతడు పగ సాధించిన పద్దతి అది!
దీన్నిబట్టి _ రాజారావు వంటివాడికి అపకారం చేయడమే మంచిదేమో! అందుకు లభించే ప్రతీకారం కోసం ..... కానీ
రాజారావు తెల్కివితక్కువవాడు కాదు. చలమయ్య, రమాకాంతం గొంతు పెగుల్చుకుని _ రాజారావుగారూ _ నేనిక మీగోప్పతనాన్ని పొగడదల్చుకో లేదు. మా అల్పత్వాన్ని నిరసించదల్చుకోలేదు. మీ కోరికేమితో చెప్పండి ఏమయినా సరే __ అది తీర్చగలం __ ఇది తిరుగులేని మాట!" అన్నాడు.
రాజారావు గొంతు సవరించుకుని _ "ఊళ్ళో మా నాన్న పేరు కీర్తించబడాలి. ఏటేటా అయన పేరున వేడుకలు జరగాలి. కానీఅపరాధిలా ఈ గ్రామం వదిలిపెట్టిన మానాన్న కీసన్మానం జరగడాన్నీ వూళ్ళోని తలనేరిసిన పెద్దలందరూ నిరసిస్తారు. అలా జరక్కుండా ఉండాలంటే ఒకే ఒక్క ఉపాయ ముంది ...." అన్నాడు.
చలమయ్య వెంటనే __ "ఆనాటి కథను నలుగురికీ యథాతథంగా చెప్పి మా దోషాన్నంగీకరించమంటారా? నలుగురి ముందూ మమ్మల్నిద్దర్నీ దోషులుగా నిఅబడమంటారా _ అందుకు మేము సిద్దం ...." అన్నాడు.
"నలుగురి ముందూ మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడం నా అభిమతం కాదు. ఆనాటి కథ అసూయపరుల లేవరయినా బాధలేదు. మీరే కానవసరంలేదు. ......" అన్నాడు రాజారావు _ "అయితే డబ్బుతో, మంచితనంతో నేను నా తండ్రికి మంచితనాన్నాపాదిస్తున్నట్లు ఎవరూ భావించకూడదు. నా తండ్రి సత్పురుషుదవడానికి తిరుగులేని రుజువుండాలి_"
అప్పుడు రమాకాంతం తెలివిగా నిట్టూర్చి __ "అయితే అసలు విషయం మీకు తెలియదు. నేను చెబుతున్నాను __ వినండి !" అన్నాడు.
ఆనందమూర్తి సత్పురుషుడు. పదవి కోసం అతడిని ద్వేషించినా అతడిపై నిండా వేయడం రమాకాంతానికి నచ్చలేదు. ఓ సంవత్సరంపాటు పదవిలో ఉన్నాక అతడూరి పెద్దలందరికీ ఆనందమూర్తి జ్ఞాతుల కారణంగా ఈ అవమానానానికీ, అపనిందకూ గురయ్యాడనీ _ అతడు తనపట్ల తప్పుగా ప్రవర్తించిన విశేషం నాటకమని తన భార్యా సీతమ్మ కూడా అన్నదనీ చెప్పుకున్నాడు. వారిని నమ్మించడానికి అతడు పాత్రలను వేరుచేసి కట్టు కథను చెప్పాడు. ఊళ్ళో చాలామంది ఆనందమూర్తిని నిర్దోషిత్వాన్ని నిరూపించడం ద్వారా __ ఊళ్ళో అప్పట్లో ఏమకాంతం పలుకుబడి కూడా పెరిగింది.
"ఇది నిజం రాజరావుగారూ! అయితే మీరిప్పుడు కోరితే _ ఈ దోషంలోని మా పాత్రను కూడా ప్రజలముందోప్పుకుందుకు సిద్ధంగా ఉన్నామని నేను మనస్పూర్తిగా మరోసారి చెబుతున్నాను -- ....." అన్నాడు చలమయ్య.
"మిమ్మల్ని దోషులిగా నోరూపిమ్చడం నా అభిమతం కాదని ఎప్పుడో చెప్పాను ...." అన్నాడు రాజారావు.
"రాజరవుగారూ _ మీరు మమ్మల్ని కోరరు. అజ్ఞాపిస్తారు. ...." అన్నారు చలమయ్య . రమాకాంతం ఒకేసారి .
రాజారావాలోచిస్తున్నాడు
ఏమనిషీ పూర్తిగా చెడ్డవాడు కాదు. రమాకాంతం ప్రెసిడెంటు కావాలని ఆనందమూర్తిపై అత్యాచారమే చేశాడు. కానీ అదాయన్ను కలచివేయగా ఆ తప్పులో కొంత సవరించుకున్నాడు. ఆవిధంగా అనందమూర్తిపై నిండా ఎప్పుడో తొలగిపోయింది.