Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 56

   

     " రమాకాంతంగారూ! మీరు మళ్ళీ ప్రెసిడెంటైన అనందం స్పష్టంగా మీ ముఖంలో కనబడుతోంది. మీ రానందమూర్తిలా ఉన్నారు __" అన్నాడు రాజారావు.

    ఆనందమూర్తి పేరు విని __ "ఏమిటన్నారూ?" అన్నాడు రమాకాంతం ఉలిక్కిపడి. ఆనందమూర్తి పేరు రాజారావు నోట తనూ విని ఉన్న చలమయ్య _ అతడలాగనడం కాక తాళీయమా_ కావాలని అన్నాడా అనాలోచిస్తున్నాడు.

    రాజరావు స్నేహభావానికీ __ ఆనందమూర్తి టో అతడి సంబందానికీ ఎక్కడా పొసగదు. ఆనందమూర్తి ఆఖరున రాసిన ఉత్తరం ఇద్దరికీ బాగా గుర్తుంది.

    "వస్తాను మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పగ తీర్చుకుంటాను. జన్మ జన్మలకూ మర్చిపోలేని విధంగా పగ తీర్చుకుంటాను ...."

    ఇద్దరూ రాజారావువంక అదోలా చూశారు అతడిలో ఇద్దరికీ అనందమూర్తి పోలికలు కనబడ్డాయి.

    "ఆనందమూర్తి అంటే?" అన్నాడు రమాకాంతం.

    "ఇంతకాలం మీ నుంచి దాచిన రహస్యం ఇప్పుడు చెప్పబోతున్నాను. నా గురించిన వివరాలు మీ కప్పుడు తెలియబరుస్తాను ...." అన్నాడు రాజారావు. ఉన్నట్లుండి అతడి ముఖంలో ఆవేశం కనబడింది.

    చలమయ్య , రమాకాంతం భయం భయంగా అతడి వంక చూశారు. ఉన్నట్లుండి అతడి ముఖంలో ఆ ఆవేశమేమిటి? అతడికి ఆనందమూర్తి తెలుసా? అతడిప్పుడు తమనేం చేయబోతున్నాడు?

    "అయ్యా! తమరిద్దరూ ఊరి పెద్దలు. ఆస్తి ఒకరికీ, పదవి ఒకరికీ ఉన్నాయి. తలచుకుంటే మీరిద్దరూ కలసి ఏమైనా చేయగలరు? మీ యెడల నా కారణంగా పోరాపాటేదైనా జరగొచ్చు. అప్పుడు నాకూ అనందమూర్తికి పట్టిన గతే పట్టడాన్న హామీని మీనుంచి కోరుతున్నాను __" అన్నాడు రాజారావు.

    "అంటే మీ ఆనందమూర్తి తెలిసంనమాట!" అన్నాడు రమాకాంతం. వాలిద్దరి ముఖాలూ వేళ వసుల బోయాయి.

    "తెలుసు. ఆయనకు మీరు చేసినదంతా నాకు తెలుసు. కానీ అప్పటి మీరు వేరు. ఇప్పటి మీరు వేరు. అందుకే అడ్గుతున్నాను __ నాకూ ఆనందమూర్తి గతి పట్టదన్న హామీ ఇస్తారుగా ...."

    ఇద్దరి ముఖాల్లోనూ కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. విజయోత్సాహంతో కులాసా కబుర్లు చెప్పాకోవలసిన తరుణంలో తామిలా దోషులుగా నిలబడవలసుంటు౦దని వారనుకోలేదు.

    "నా మనసులోని కోరిక చెప్పబోయేముందు మీ రోక్కసారి గతాన్ని గుర్తుచేసుకోండి. ముప్ఫై ఏళ్ళక్రితం జరిగిన ఆ దారుణ హత్యాకాండను గుర్తు చేసుకోవడం జరిగేక __ మీకు నా గోడు చెప్పుకుని మీ దయకై ఎదురుచూస్తాను" అని ఆగాడు రాజారావు.

    చలంయ్యకూ, రమాకాంతానికి నోటమాట రావడం లేదు. ఇద్దరికీ గతం కళ్ళముందు సినిమా రీల్లా తిరుగుతోంది.

                                     *    *    *    *   

    "నేను ఆనందమూర్తి ఏకైక పుత్రుణ్ణి. మీరు నా తండ్రికి చేసిన ఘోరాపచారానికి పగ తీర్చుకుందుకే ఇక్కదికు వచ్చాను.

    "మా నాన్న ఈ ఊరొదిలేక ఓ పట్టణంలో చిన్న వ్యాపారం ప్రారంభించారు. అదే మా జీవినావిధారం. లోటు లేకుండా రోజులు గడిచేవి. నాకు బాగా చదువోచ్చింది. నా చదువు చివర్లో ఉండగా మా అమ్మ పోయింది. అమ్మపోగానే నాన్న మానసికంగా దెబ్బతిన్నాడు. నా చదువు పూర్తయ్యే సరికి వ్యాపారం మూలపడింది. నాన్న మంచాన పడ్డాడు. అదృష్టం కొద్దీ నాకు తన కథ చెప్పాడు. ఆ కథ వినగానే నా హృదయం ఉడికిపోయింది. రక్తం మరిగిపోయింది. నాన్న మాత్రం తాఫీగా తన కథ చెప్పి __ "ఒరేయ్ రాజూ? ఈ కథంతా ఎందుకు చెప్పావో తెలుసా? నువ్వు వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకోవాలని. ఆ ప్రతీకారం సామాన్యంగా ఉండకూడదు. దెబ్బకు దెబ్బ __ మనిషిలో పరివర్తన కలిగించదు. పరివర్తన తేలేని ప్రతీకారం వృధా! ప్రతీకారం శత్రుత్వాన్ని తెంచడానికే గానీ __ తరతరాలు కొనసాగించడానికి కాదు. నువ్వు వాళ్ళలో మార్పును తీస్కురావాలి చదువుకున్న వాడికే తన అల్పత్వం తెలుస్తుంది. నువ్వు వాళ్ళలో మానవత్వాన్ని కలిగించు కాడిలించు. అప్పుడు వాళ్ళు చేసిన కుమిలిపోతారు. పశ్చాత్తాపంతో దహించుకుపోతారు. అదే మన ప్రతీకారం. కానీ అదింక నావల కాదు. ఎప్పుడావకాశం దిరికినా ఈ ప్రతీకారం విషయం మరువకు __" అన్నాడు.

    "అప్పుడు నాలోని ఆవేశం చల్లారింది. నేనుధ్యోగంలో చేరిన రెండు నెలలకే నాన్న మరణించాడు. నాన్నలో ప్రతీకార వాంఛ తీవ్రంగా, ఉందని నాకు తెలుసు. అయన మానవాతీత శక్తిగా, అజ్ఞాత వ్యక్తిగా నాకు సాయపడతాడనీ తెలుసు. అందుకే నా మాసుకు సరిపడని విషయమాయినప్పుటికీ లాటరీ టికెట్లు కొన్నాను. గుర్రప్పండా లాడాను. స్టాక్ ఎక్సేంజ్లో రిస్కు తీసుకున్నాను. నా దగ్గర డబ్బు పొగడింది. ఒకటి కాదు, రెండుకాదు .... మొత్తం యాభై లక్షలు. ఆ డబ్బు సంపాదించడంలో నా ప్రతాపముందని కానీ, అది నా స్వంతమని కానీ నేను భావించలేదు. అది నాన్నగారు తల ప్రతీకారం సాధించమని ఇచ్చిన డబ్బు.

    ప్రతీకార మంటే నాన్న చెప్పినట్టే ఉండాలి. శత్రవులో మానసిక పరివర్తన తీసుకుని రావాలి. అందుకని నేనో నిర్ణయానికి వచ్చాను. నాన్న ఊరికి నేను వెళ్ళాలి నా దగ్గరున్న డబ్బుతో ఊళ్ళో మంచి పేరూ, పలుకుబడీ సంపాదించుకోవాలి. ఏ పదవి కారణంగా నాన్న ఊరోడలిపెట్టాడో. _ ఆ పదవి నన్ను వెతుక్కుంటూ రావాలి. ఏ వ్యక్తి ఆ పదవి కోసం నాన్న నా ఊళ్ళో౦ చి అమానుషంగా పంపిశాడో _ ఆ వ్యక్తికీ నేనా పదవిని దయాధర్మ భిక్షంగా ఇవ్వాలి. పదవి కోసం అమానుశాలు చేసేవాడికి _ పదవిని తృణప్రాయంగా చూసేవాడే గుణపాఠం నేర్పగలడు. మీకు గుణపాఠం మేర్పాలన్న న స్వార్ధమే నన్ను మీకు స్నేహితుడిని చేసింది. మిమ్మల్ని ప్రెసిడెంటు చేయడంలోని నా స్వార్ధమీదే!"

 Previous Page Next Page