కానీ ఆనందమూర్తి కీ వూళ్ళో తిరిగి ప్రవేశించే అవకాశం రాలేదు.
మంచిలో చెడ్డ కలుస్తుంది. చేద్దలో మంచి కలుస్తుంది. మనిషి వాటిని విడివిడిగా అర్ధంచేసుకుని _ తనలోని మంచి చెడ్డలు గ్రహించగలిగితే ప్రపంచంలో ఈ అన్యాయాలు౦డవు. అక్రమాలుండవు.
* * * *
"ఈ మధ్య కొందరు నా యింట్లో చేరి రాజారావుగారు నక్సలైట్లనే అభిప్రాయం నాలో కలిగించి నమ్మించారు. ఇలాంటి పొరపాటే ముప్ఫై ఏళ్ళక్రితమూ ఒకటి జరిగి అనండమూర్తి అనే ఒక ఉత్తమ గ్రామపౌరుడ్ని మనం కోల్పోయాం ఆయనకు జరిగిన అన్యాయానికి ప్రయశ్చిత్తం జరగాల్సిన బాధ్యతను నేనూ, చలమయ్యగారూ స్వీకరించాం. ఆయనకి అన్వేషించగా అన్వేషించగా ఇటీవలే రాజారావుగారి ఆచూకీ తెలిసింది వచ్చాం. శ్రీ రాజారావుగారు ఆనందమూర్తి ఏకైక పుత్రుడు . ఫలాన్ని బట్టి చెట్టు పేరుంటు౦దంటారు. మీకు రాజరావుగారిపై ఎలాంటభిప్రాయాలే ఉన్నాయి. అనండమూర్తిగారిపై ఎలాంటభిప్రాయాలున్నాయో __ మా కానంద మూర్తిగారిపైనా అటువంటి అభిప్రాయాలే ఉన్నాయి. అనండమూర్తి వెళ్ళిపోయాక మనూళ్ళో ఒకమహానుభావుడు౦డే వాడు __ అని మాత్రం అంతా చెప్పుకునే వాళ్ళం. రాజారావు గారోచ్చేక _ మనూళ్ళో ఒక మహానుభావుడున్నాడని చెప్పు కునే అవకాశం మళ్ళీ మనకోచ్చింది. అయన మన గ్రామ పౌరులేవన్న విషయాన్నీ రోజు ధైర్యంగా మీ ముందు చెబుతున్నాను......"
అది రమాకాంతం ఉపన్యాసం ఆ రోజే ఉచిత భోజన వసతి గృహానికి _ నర్సన్న ద్వారా శంకుస్థాపన జరిగింది.
* * * *
భావన నిర్మాణానికే కాకా __ రాజారావు ఉచిత భోజన వసతి గృహానికి పదెకరాల భూమిని కూడా కొని దానం చేశాడు. అనందమూర్తిని పేరిట వెలసిన ఆ భవనానికి చలమయ్య, రమాకాంతం ముఖ్య నిర్వాహకులయ్యారు.
ఆ భావన నిర్మాణం పూర్తయిన రోజున రాజారావు భార్యతో _ "వసూ! ఈ భవనం నా ప్రతీకరానికీ చిహ్నం ఈ భవనమున్నంత కాలం ఇక్కడ నా తండ్రిపేరు నిలుస్తుంది. నిజం చెప్పాలంటే నాకీ ఊరిమీదనే పగ! ఊరికోసం బ్రతికిన మా నాన్న జాతకం ఒక్క రాత్రిలో మారిపోతే ఊళ్ళో ఒక్కరంటే __ ఒక్కరు నేనున్నానంటూ ఆసరాగా ముందుకు రాలేదు. ఎంత మంచివాడికీ అనుమానం, అవమానం తప్పవు. కొందరి కుట్ర కారణంగా అనాడాయన అవమానించబడ్డాడు. నా కారణంగా ఈనాడీ యనక్తీర్తించాబడుతున్నాడు. అంటే __ యీ ప్రజలు తమకు తాముగా ఎవరిమంచి చేద్దలూ నిర్ణయించలేరు. తమకు తామై మహాత్మతుల మంచిచెడ్డలు నిర్ణయించగలిగితే మంచిరోజు వచ్చేవరకూ వీరికి మేలు జరగదు. ఏమయితేనేం _ ఈ ఊళ్ళో నా తండ్రి అనుమానించి అవమానించబడ్డాడో_ అక్కడే అయన స్మారకచిహ్నం వెలసింది. ఆయనపై అపవాదుకు కారణభూతులయిన వారే _ ఆ స్మారిక చిహ్నానికి నిర్వాహకులయ్యారు. ఇది చాలు నా తండ్రి ఆత్మశాంతికి! ఇదిచాలు నా మనసు తృప్తితో నిమ్డడానికి!! ఇది చాలు -- చలమయ్య, రమాకాంతాలను పాత జ్ఞాపకాలతో కలవర పెడుతూగతంలోకి పోకుండా హెచ్చరించడానికి !" అన్నాడు.
అందుకు వసంత నవ్వి __ "ఏ కోరికతో ఇక్కడడుగుపెట్టారో అది సాధించడమే కాక _ మీరీ ఊళ్ళో మహానుభావుడిననిపించుకున్నారు. మీ విజయం మీదేదాననుకుంటే అదంతా మీ భ్రమ. మీరు ప్రజల మనసు గెలిచి, మీరనుకున్నది. సాధించారు. మీ విజయం ప్రజా విజయం.నాకీ ప్రజల భవిష్యత్తుపై అమ్తిలేని విశ్వాసముంది _ " అంది.
"అయితే ఏమంటావు?' అన్నాడు రాజారావు.
"ఎందరు మిమ్మల్ని మహానుభావుడని అభినందించినా _ ప్రజలపై విశ్వాసముంచనంత కాలం, వారి గొప్పతనాన్ని గుర్తించనంత కాలం __ మీరు మహానుభావుడు కాలేరు ...." అంది వసంత.
మహానుభావు డనిపించుకోవాలన్న తపన రాజారావుకుందో లేదో చెప్పలేం కానీ __ రాజారావు ప్రతీకార చిహ్నం ఆనందమూర్తి స్మారక చిహ్నం అయిన ఆ అభవనంలో ఉచిత భోజనవసతి పొందుతున్న పేద విద్యార్ధులు మాత్రం _- ఆ ఊరు మహానుభావుడిగా అతణ్ణి కీర్తిస్తూనే ఉన్నారు.
__ అయిపోయింది __
____[౦] ____