Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 55

  

       రాజారావు లేచి అడిగాడు.

    అతడి ఉపన్యాసం ఆగినా కరతాళద్వను లాగడానికి చాలాసేపు పట్టింది. 

                                                  35

    రాజారావు ఉపన్యాసం రమాకాంతాన్ని కలవరపరిచింది. అతడు తనకెందు కిమ్టగా అభిమానించి గౌరవిస్తున్నాడో అయన కర్ధంకావడం లేదు. అందులో ఏదో రహస్య మున్నదని అయన అనుమానం. అందుకని ఆ రాత్రి అయన చలమయ్యింటికి వెళ్ళి __ ఆయన్ను వెంటబెట్టుకుని _ రాజారావింటికి వెళ్ళాడు.

    వాళ్ళు తనని కలవగానే రాజరావన్న మొదటి ముక్కలివి __ " రమాకాంతంగారూ పదివేల గురించి మీరు గాభరాపడవద్దు. ఆ వసతి గృహా నిర్మాణ బాధ్యత పూర్తిగా నాదే! ఊళ్ళో పేదవిద్యార్ధుల కిలామ్తి సదుపాయం కల్పించాలన్నది నా ఆశయం.  అది ప్రజాభిప్రాయాన్ని మీరు అనుకూలంగా మార్చడానికి సహకరించాలని __ నలుగురిలో అలా చెప్పాను. ఇందులో న స్వార్ధం కూడా లేకపోలేదు __" అని చంయ్యవైపు తిరిగి __ "మీరిద్దరూ నా కోరికోకటి తీర్చాలి. ఆ పదివేలూ మీరూ యివ్వక్కర్లేదు. ఇద్దరూ చెరో పదివేలూ యిచ్చినట్లు నలుగురికీ చెప్పండి. అన్నిఎర్పాత్త్లో నేనూ చూసుకుంటాను. కానీ ఆ వసతి గృహా నిర్వాహికులు మాత్రం మా ఇద్దరే అవుతారు. తరతరాలుగా మీ కుటుంబాలు _ ఆ వసతి గృహా నిర్వహణ చూడాలి __"

    రమాకాంతం, చలమయ్య _ ఇద్దరూ షాక్ తిన్నారు. ఉదయం సభలో రాజరావన్న మాటలకు మించిన కలవరం _ ఇప్పటి మాటలు కలిగిమ్చాయ్తి. రాజారావు __ తను తలపెట్టిన ఒక ఉత్తమ కార్యానికి _ తనే పూర్తీ విరాలమిస్తూ _ దానితో ఏ ప్రమేయమూ లేని తననూ, చలంయ్యనూ సరదులుగా ప్రజలకు పరిచయం చేస్తున్నాడు తన తఫావు ఫలాన్ని తామిద్దరికీ పంచిపెడుతున్నాడు. దీని కంతకూ కారణ మేమిటి? అతడు తమ నుండి ఏమి వాంచిస్తున్నాడు?

    "రాజరావుగారూ _ ఈ రోజు మీ ఉపన్యాసం నన్ను కదిలించింది. మీ పొగడ్తలను నేనణ్ణికాదు. చిన్నవారైనా మీరు నాకంటే గొప్పవారు. మీ వంటివారున్న గ్రామంలో నేను ప్రెసిడెంటు గా నిలబడలేదు . మీరే ఆ పదవికి అర్హులు మీరు నా నుండి ఏమైనా అశిస్తూంటే _ అందుకు ప్రతిఫలంగా నన్ను ప్రెసిడెంటుని చేయనక్కర్లేదు./ మీరేం కావాలో చెప్పండి __ ఇప్పుడే ఈ క్షణంలో చేస్తాను ...." అన్నాడు రమాకాంతం.

    "మీరు నాకు ప్రాణదాతలు. అయితే మీరు నాకు చేసిన యితర వుపకారలింకా గొప్పవి. మీరు నాలో మానవత్వాన్ని మేల్కోలిపారు. చెడిపోతున్న మా గరవయ్యను ప్రయోజకుడిగా చేశారు. ప్రత్యుపకారం కోరడాని కింతకంటే మీరేమీ చేయనక్కర్లేదు. ఇంకా నా పేరు చెప్పి మీరే పదివేలు విరాళం భరించనక్కర్లేదు. ఆ మాత్రం స్తోమతునాకుంది. కానీ మీ కోరికేమిటో చెప్పండి __ నా శక్తిని మించి ప్రయత్నించి మిమ్మల్ని సంతోష పెడతాను ...." అన్నాడు చలమయ్య.

    ఇద్దరికీ రాజారావు ఒక్కటే సమాధాన మిచ్చాడు _ ప్రస్తుతానికి నన్నింకేమీ ప్రశ్నించవద్దు. నేను మీ నుంచి ఏదో ఆశిస్తున్న మాట నిజం. సమయం వచ్చినప్పుడు నా కోరిక నేనే మ్మీకు చెబుతాను. అదేమీ అసాధ్యమైనది కాదు కానీ అంతా మీ నైతికబలం మీద ఆధారపడి ఉంటుంది. మీరిస్తానన్నా మీ దగ్గర్నుంచి ఆ పదివేలూ నేను తీసుకోను _ నన్ను మన్నించండి. మనం మళ్ళీ మరోసారి అనీ వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పటికింకేమీ చెప్పాలేను __"

                                                      36

    కొన్నాళ్ళపాటు రాజరావా ఊళ్ళో చర్చాంశమయ్యాడు.

    చేతికందిన పదవిని మృదువుగా నిరాకరించడ౦ వల్ల ఊళ్ళో అతడి గౌరవం పెరిగింది. నారయ్య కెదురు నిలిచిమాట్లాడినపుడు _ నారయ్యతడితో మాట్లాడిన తీరునుబట్టి _ రాజారావు వంటి వ్యక్తిని భగవంతుడు కూడా గౌరవస్తాడని అంతా చెప్పుకున్నారు. రాజారావు చలమయ్యతో పరివర్తన తేవడం నమ్మలేని నిజంగా అంతా ఆశ్చర్యంతో చెప్పుకుంటున్నారు. ఇక అతడికి రమాకాంతమంటే అంత అభిమాన మెందుకో ఎవరికీ అర్ధం కావడంలేదు. అతడి మాటలవల్ల ఊళ్ళో రమాకాంతం పలుకుబడి పెరిగినా _ రాజారావు మాటలను గుడ్డిగా విశ్వసించినవారు లేరు. రోడ్ల విషయంలో కొన్నాళ్ళు అజ్ఞాతంగా ఉంచి __ ఇప్పుడు బయట పెట్టడం ఎన్ని కళస్ట్రాటజీ అని కొందరనుకున్నారు. ఏదేమైనా ఊళ్ళో రమాకాంతం అద్రుష్టాన్నే తప్ప గొప్పతనాన్ని గుర్తించిన వారు తక్కువ. ఆయనా ఊరి వాళ్ళకు కొత్త గనుకనా!

     ఈ సందర్భంలో అసలీ రాజరావువేవరు? ఏమ్డుకక్కడి కొచ్చాడు? _ అన్న విషయం కూడా ఎందరో చర్చించారు. అతడి ఆర్ధిక పరిస్థితిమీటో __ ఊరిబాగు గురించి ఎందుకింత తంటాలు పడుతున్నాడో ఎవరి వూహకూ అందకపోయినా బయటివాళ్ళ కతడి గురించి _ మా వూళ్ళో మహానుభావుడు _ అని చెబుతూంటారు.

    ఊరివారి సంగతలాగుంటే రమాకాంత మొక విచిత్ర మానసిక స్థితికి లోనయయాడు. అయన స్వయంగా దుర్మార్గుడు. కాదు. పదవీ వ్యామోహానికి మించిన వ్యసనమూ లేదాయనకు. పదవికోసమే అయన ఆ కార్యాలు చేశాడు. రాజారావు సత్కార్యాలు చేస్తే పదవి వెతుక్కుంటూ వెళ్ళింది. అతడా సత్కార్యాలను తనకే అంటగట్టి _ పదవినీ తనకే కట్టబెడుతున్నాడు. చేతికందిన పదవిని రాజరావే తనకోసందారపోశాడు. దారపోస్తూ - తనకు పదవీ వ్యామోహం లేదని పొగిడాడు. కానీ తనకు పదవీ వ్యామోహముంది. పదవీ వ్యామోహంతో తను అనుమానుషంగా ప్రవర్తించిన సందర్భాలూ వున్నాయి. అసలు తను పదవిలోని కేలా వచ్చాడు?

    పాత జ్ఞాపకాలు రమాకాంతం మెదడులో సూదులుగా తిరగసాగాయి. ఆ జ్ఞాపకాల మధ్య ఒక వ్యక్తి నవ్వుతున్నాడు. అది నవ్వుకాదు. అట్టహాసం . ఆ అట్టహాసం చేస్తున్నది రాజరావా? కాదు ... అతడు .....

    రమాకాంతం వులుక్కిపడ్డాడు. అట్టహాసం చేస్తున వ్యక్తిలో రాజారావు పోలికలు కనబడుతున్నాయి. అయితే రాజారావు ....?

    అది అసాధ్యం అనుకున్నాడు రమాకాంతం . ఇటీవల రాజారావు తన తన ఆలోచనలను బాగా ఆక్రమించడంవల్ల _ ఆ వ్యక్తిలోనూ రాజారావు పోలికలు కనబడుతున్నాయి.  తప్ప అతడికి రాజారావుకి సంబంధ ముండును. ఉండి వుంటే రాజరవుయ్ తనతో స్నేహం చేయడు. తనకుపకారం చేయడు.

    ఏదిఎమైనా యిప్పుడు రమాకాంతంలోనూ మార్పు వచ్చింది. ఆయనలో పదవీవ్యామోహం తగ్గి విశాల దృక్పథం ఏర్పడింది. రాజారావు తన కాసాదించిన సద్గుణాల నలవరచుకోవాలని అయన ప్రయత్నిస్తున్నాడు.

    అటు రమాకాంతాన్ని ఇటు చలమయ్యనూ కూడా రాజారావు తమ నుండి ఏమి కోరుతున్నాడన్న కుతూహాలం బాధిస్తోంది. అది తీరే సమయమూ రాయే వచ్చింది.

    రమాకాంతం ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అందుకని నందన సభ రేపనగా _ ఈ రోజు రాత్రి రమాకాంతం, చలమయ్య __ రారాజావున అతడింట్లో కలుసుకున్నారు.

 Previous Page Next Page