సభలో గుస గుసలు ప్రారంభమయ్యాయి రాజారావు వేదికమీదకు రాగానే ఆ గుస గుస లాగిపోయాయి.
"పదవి అనేది ఎవరికి పడితే వారి కివ్వడానికి __ అట వస్తువుకాదు. సమర్దల చేతిలోని అది రాణిస్తుంది. మీరంతా నన్ను బలపరిస్తే అది నాకు గౌరవం. కానీ పదవికి కాదు. రాజకీయాల్లో నేనింకా పసివాణ్ణి. నాకు పదవి నిస్తే పసివాడి చేతిలో గాజుపాత్ర కావచ్చు. అసలు పంచాయితీ అధ్యక్షడన్నది ఒక వ్యక్తి కాదు, సంస్థ. ఊళ్ళోని. అనుభవజ్ఞ లారుగురు మెంబర్లు కాగా _ వారిలో ఒక సమర్ధుడు అధ్యక్షుడు కాగా _ అంతా ఒక్క తాటిమీద నడిచే వాళ్ళయితే _ గ్రామాని కంతకుమించిన అదృష్టమేముంది! అయితే వూరి మొత్తానికి మెంబర్లు మాత్రమె సమర్ధులు కాదు. మిగతా వారిలో _ గ్రామోద్దరణ ధ్యేయంగా కళ ప్రతి ఒక్కడూ కూడా గ్రామోపయోగకర కార్యాలలో మెంబర్సుకు చేయూత నివ్వాలి. మెంబరు. కావడానికి అందరికీ అవకాశం రాదు. కానీ ప్రజాసేవ చేయడానికి మెంబరు కాకపోవడం ఒక అడ్డంకి కాకూడదు. మెంబరు కావడంద్వారా అనేక బాధ్యతలు నెత్తిన వేసుకోవలసి ఉండడంవల్ల _ నాకు మెంబరు కావడం యిష్టముండదు. మామూలుగా ప్రజాసేవ చేసినంత సులభం కాదు __ మెంబరుగా బాధ్యతలు వహించడం ....! మెంబర్స్ కు చేయూత నివ్వడంలోనే నాకు సుఖముంది. గతంలో మీకు మనవిచేసి ఉన్నాను __ నేను తల పెట్టిన ప్రతిపని వెనుకా _ ఒక అజ్ఞాతవ్యక్తి ప్రోత్సాహమున్నదని, ఆ అజ్ఞాతవ్యక్తినే మనం అధ్యక్షుడిగా ఎన్నుకుందా౦. ఆ అజ్ఞాత వ్యక్తి ...." రాజారా వొక్కక్షణం ఆగి సభికులవంక కలయ జూశాడు. అంతా వూపిరి బిగాపెట్టి వింటున్నారు. రాజారావు కొనసాగిస్తూ _ "క్షమించాలి రమాకాంతంగారూ! ఈ రహస్యాన్ని దాచడం ఇక నా వల్ల కాదు. ఆ అజ్ఞతవ్యక్రి మీరే నన్న విషయాన్నీ రోజున నేను బహిరంగ పరుస్తున్నాను. గ్రామ శ్రేయస్సు దృష్ట్యా నేను చేస్తున్నా ఈ తప్పను మీరు మన్నిస్తారన్న నమ్మకం నాకుంది ...." అన్నాడు.
ఒక్కసారి సభికులలో కలకలం రేగింది. రమాకాంతంతో సహా అందరూ తెల్లబోయారు.
"ఊరికి ప్రెసిడెంటు గదా _ అంత చాటుగా ప్రజాసేవ చేయాల్సిన అవసర మేమొచ్చింది" అని ఒకడూ _ "అంత గ్రామం బాగును కోరేవాడు _ ఇన్నేళ్ళుగా ఏం చేస్తున్నాడ" ని ఇంకొకడూ _ "నలుగురిలోకి తన పేరు రాకూడదనుకునేవాడు పంచాయితీ ఎన్నికలల్లో ఎందుకు దిగేడూ" అని మరోకడూ _ ఇలా అందరూ తలొక విధంగానూ అనుకోసాగారు. మొత్తం మీద అజ్ఞాతవ్యక్తి రమాకాంతం కావడం _ ఎవరికీ సంతృప్తినీ , సంతోషాన్ని కలిగించలేదు.
మళ్ళీ రాజారావు ప్రారంభించాడు __" ఇక్కడ నేను మరికొన్ని విషయాలు మీ అందరికీ మంచి చేసుకోవాలి. మిమ్మల్నందర్నీ అనేక సందేహాలు పీడుస్తూన్నాయని నాకు తెలుసు. మీ గ్రామంలో రమాకాంతంగారు మహత్తర వ్యక్తి. అయితే అయన కీర్తికి భయపడతాడు. ఊరిని బాగుచేయడాని కాయన మొహమాట పడ్డాడు. ఇది హాస్యాస్పండంగా మీకు తోచవచ్చు. అందుకే అతనంటే హాస్యాస్పదంగా తావుచగల మరో నిజం చెబుతున్నాను. రామకా౦తంగారికీ పదవీ వ్యామోహం కూడా లేదు. గ్రామంలో నాయుకుడు కాదగ్గ మరో వ్యక్తి లేడని అయన ఎన్నికల్లో నిలబడుతున్నాడు. అనేకమంది యితర గ్రామాధ్యక్షులతో పోలిస్తే _ ఇన్నేళ్ళుగా పదవిని నిర్వహిస్తూ _ అయన దుర్వినియోగం చేసిన ప్రజాధనం స్వల్పం. గ్రామంలో రోడ్డ్లు వేయించాలని చాలా కాలంగా అభిలాషిస్తున్నప్పటికీ __ ప్రజాలందుకు సుముఖలుగా కాలేమోనని భయపడ్డా డాయన, ప్రజలందరి అభిప్రాయం ఏదో విధంగా తెలుసుకోమని నన్నుకోరితే _ అయన మాటపై నేను రంగంలోకి దిగాను. ఇది విన్నాక మీ అందరికి ఒక విషయం అర్ధమయియుంటుంది. రమాకాంతంగారిలో నాయుకుల కుండాల్సిన చొరవలేదు.
ప్రజల కోరికలు తెలుసుకోగలిగితే చకచక్యం లేదు. ఈ లెండూ లేనివాడు ప్రజానాయుకుడేలా గౌతాడని మీరనవచ్చు. అందుకే యిప్పుడు మరో విషయం మనవి చేసుకుంతున్నాను. అసలు మన పద్దతిలోనే ఒక పెద్ద లోపం వుంది. పంచాయితీ ఉద్దేశ్యం ఎవరికీ అర్ధం కాలేదు. గ్రామంలో స్వయంపలనకోసం అది వెలసిందని ఎవరూ గుర్తించినట్లు లేదు. ఇన్నేళ్ళకోసారి ఎన్నికలు జరగాలి కాబట్టి జరిపించడమూ _ మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా పదవిలో వున్నవాడు నిద్రపోవడమూ జరుగుతోంది. ఆ అధ్యక్షుడు నిద్ర పోతూంటే లేపవలసిన బాధ్యత _ బాధ్యత గల పౌరులది. మీలో ఒక్కడైన మీ రమాకాంగారి వద్ద _ మీలో ఎందరు మీ కోరికలను ప్రకటించాడు? అయన ఏం చేసినా మేమున్నామన్న హామీని ఎంతమందిచ్చారు? అయన ఏం చేసినా మేమున్నామన్న హామిని ఎంతమందిచ్చారు? అయన ఏం చేసినా ఏం చేయకపోయినా ఎన్నికల్లో తన నేన్నుకుంటూ౦టే _ మీరు తననుంచి ఏమీ ఆశించడం లేదన్న అనుమాన మాయనకు రావడం సహజం. గ్రామాభివృద్ధి కార్యక్రామాలను ప్రజలు కాంక్షించటం లేదనీ _ నామ: _ ఒక అధ్యక్షుడు గా తన నేననుకుంటున్నారనీ గ్రహింపయేం _ రమాకాంతంగారిలో ప్రజాసేవ పట్ల నిర్లిప్తత కలిగింది. ఎంతో ఉత్సాహంతో ఈ రాజకీయాల్లో అడుగుపెట్టిన అయన అతి త్వరలోనే చల్లబడి పోయాడు. ఊరి సొమ్మును ఊరిబాగు కుపయోగించలేకపోయినా కనీసం దానికి రక్షకుడిగానైనా ఉండవచ్చుననే అభిప్రాయం అయన ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నారు. అటువంటి. వ్యక్తిని కలిసుకునే మహద్భాగ్యం లభించడం నా అదృష్టం. ఆ చివరకాలంలోనే అయన నన్ను తన అప్తుల్లో చేర్చుకున్నాడు. అప్పుడే తన బాధను నాకు చెప్పుకున్నా డాయన. నేనేపనిచేసినా నా ప్రజలు నా వెనుక నంటారన్న ధైర్యముంటే ఊరిని స్వర్గతుల్యంగా చేయగలనని ఆయనన్నప్పుడు నా కావేశం కలిగింది. అప్పుడు నేను రంగప్రవేశం చేశాను. ఏ సందర్భంలోనూ తన పేరు పైకి రాకూడదని అయన నన్ను వేడుకున్నాడు. ఆ నిస్వార్ధపరుడుకి మనసులోనే జోహారు లర్పించుకున్నాడు. ఆ నిస్వార్ధపరుడుకి మనసులోనే జోహారు లర్పించుకున్నను. ఇప్పుడు కూడా _ సరైన యువకుడాదిపత్యం వహించే పక్షంలో ఆయనకు ఎన్నికలంటే ఇష్టం లేదు. ఆయనకు పదవీ వ్యామోహం లేదనిడాని కింతకంటె నిదర్శన మేం కావాలి? ఇలాంటి ఉన్నతాదర్శాలు గల వ్యక్తిని మన మేళ వదులుకోగలం? నేనేమో ఊరికి కొత్త. నేను సమర్ధడిని ఊరంతా భావించే మాటైతే __ ఊరంతా నా అభిప్రాయానికి క్కూడా విలువ నిచ్చి శ్రీ రమాకాంతంగారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి. ఆయనే మనకు సరైన నాయుకుడు. కుడిభుజంగా ఉంటాను. ఈ సందర్భంలో మరొక శుభవార్త. ఒకనాటి తమ స్నేహితుడి స్మృతి చిహ్నంగా ఈ గ్రామంలో పేద విద్యార్దులకు ఒక భోజన వసతి గృహం నిర్మించాలని చలమయ్యగారు, రమాకాంతం గారు నిశ్చయించారు. వారి స్నేహితుడు నాకూ కావలసిన వాడు కాబట్టి _ నేనూ విరాళమిచ్చి వారికి సహకరించదలిచాను. వారిద్దరూ చెరో పదివేలూ యిస్తే _ మిగతా సొమ్ము ఎంత పడితే అంతా నేనిచ్చుకుంటాను. ఆ వసతిగృహం పేరు రమాకాంతంగారి ఎన్నిక జరిగిన రోజున నిర్ణయించబడుతుంది ....." అని అనగానే అనుకోకుండానే సభికు లుత్సాహంగా చప్పట్లు కొట్టేశారు.
"ఇప్పటికే నేను చాలా మాట్లాడాను. ఇంకా ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని విసిగించదల్చుకోలేదు. వేదిక దిగబోయే ముందు శ్రీ నర్సన్నగారి గురించి కూడా రెండు ముక్కలు చెప్పవలసి ఉంది. గ్రామంలో ఐకమత్యంకోసం వారు చేసిన త్యాగం చాలా గొప్పది. ఏకగ్రీవంగా ఎన్నికలు జరగాలని అయన ఎన్నికల్లోంచి విరమించుకోవడం సామాన్య విశేషం కాదు. అయన దైవభక్తి అసాధారణమైనది. ఆ దైవభక్తే అయన దృష్టిని రాజకీయాల నుంచి శాశ్వతంగా మళ్ళించింది. ఈ భక్తిని నెత్తికవర్తన మనందరికీ ఆదర్శనంగా వుంటుంది. అయన అనుభవం మన ప్రెసిడెంటుకు సలహలిస్తుంది. ఇలాంటి మహానుభావుల్ని ఈ గ్రామంలో యిక ముందు పార్టీలు కూడా తలెత్తరని ఆశిస్తున్నాను ....."