"నేనోప్పుకోను __ " అంది వసంత _ "దుర్యోధనుడు అకారణంగా పాండవులను ద్వేషించాడు. ఆకారణ ద్వేషం మించి ప్రభువు లక్షణం కాదు. అందులోనూ పాండవులు ధర్మ స్వరూపములు . వారు దుర్యోధనుడి మైత్రీ నే కోరేవారు. అసూయతో వారిని ద్వేషించాడంటే దుర్యోధనుడుకి విశాక్షణా జ్ఞానంకూడా లేదనిపిస్తోంది. అదీ మంచి ప్రభువు లక్షణం కాదు. అతడు పాండవుల నవమానించిన తీరు కూడా ధర్మోల్లంఘనమే! ధర్మల్లంఘన కూడా మంచి ప్రభువు లక్షణం కాదు. ఆ తరవాత అతడు పాండవులను మించి జనరంజకంగా ప్రజాపాలన చేశాడంటే అందుకు కారణం ప్రజాభిమానం కాదు. పాండవులు ప్రజలలో చూరగొన్న అభిమానాన్ని మిమ్చాలనీ _ ప్రజలు పాండవులను మరువాలనీ అతడి తాపత్రయం ఒక మంచి ప్రభువుగా కాక, పాండవ ద్వేషిగా అతడు ప్రజలకు మేలు చేశాడు. పాండవులు లేకుంటే అతడు ప్రజారంజకంగా పాలన చేయదు ఇవన్నీ అలాగుంచితే _ చివరి వరకూ తమ అవమానాలన్నింటీని వహించి _ ప్రజా క్షేమాన్నాశించి _ యుద్దన్నాపాలనుకున్నారు. పాండవులు. కేవలం పాండవ ద్వేషాన్ని పురష్కరించుకుని _ తనకు గెలుపు పక్షపాతులనీ గ్రహించి కూడా - ప్రజా క్షేమం గురించి ఒక్క క్షణం కూడా అలోచిమ్చిని వాడు దుర్యోధనుడు భూభారం తగ్గించడానికి భగవంతుడాదేశించిన ప్రణాళికలో _ నశించతగినవాడు దుర్యోధనుడు కాక వేరెవ్వరు? ఆ కార్యక్రమ సారధి శ్రీ కృష్ణుడు కాక భగవంతుడు వేరెవ్వరు?"
రాజారావు నోరు తెరుచుకుని వసంత వంకనే చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. ఆమె పూర్తీ చేయగానే __ "వసూ నేను నిజంగా అహంకారివె. ఇన్నేళ్ళుగా నీతో కాపురం చేస్తూ _ నువ్వు భారతాన్నింత లోతుగా అర్ధంచేసుకుని ఉంటానానీ నీ దగ్గర్నుంచి నేర్చుకోవలసిన విషయాలుంటాయనీ విస్మరించాను ...." అన్నాడు.
వసంత సిగ్గుపడి __ " పొగడ్తలు చాల్లెండి గానీ __ భిజనానికి లేవండి పాప కూడా ఆకలితో ఉంది మరి _ ..." అంది. అయితే ఆమెకు మనసానందంలో నిండిపోయింది. రాజారావింతలా ఆమెను పొగిడిన సందర్భాలు తక్కువ. అందుకతడిపై ఆమె కభిమానం పొంగి పొరలింది.
"భోంచేసి ఓసారి రమాకాంతంగారింటికి వెడదామను కుంటున్నాను ....."
ఏదో అనాలనుకుని ఆగింది వసంత. అప్పుడే భర్త తనను పొగిడి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ పొగిడితే తను టట్టుకోలేదు. ఎదుటి మనిషి నోరు మూయించడానికి _ పొగడ్తకు మించిన సదనం లేదు.
నీల మరీ అంత నీరసంగా లేదు. కొంత నీరసాన్నది నటిస్తోంది. ఇంతకూ లంకణం ఒక్క పూట చేసింది. ఇప్పుడు దానికి అన్నం మామూలుగానే సహించి౦ది. ముగ్గురూ ఒక్కసారే భోజనాలు ముగించి లేచారు.
"భోంజనమయింది. కదా అని పక్కెక్కేపు గనుక __ ఈ పూట పడుకునేందుకు వీల్లేదు. "ర" గుణితం దిద్దికో __" అంది వసంత.
"నీ వెర్రిగానీ, భోంచేసి పడుకుంటే ఏమీ కాదు. కావాలంటే డాక్టర్నిడిగి చూడు __" అన్నాడు రాజారావు.
"నాకు తెలుసులెండి. అన్నింటికీ మీ సైన్సు పనికిరాదు. ఇటువంటి విషయాల్లో మీరు కలగాజేసుకోవద్దు. అయినా అది "ర" గుణి౦తం దిద్దుకుంటుంది. అందువల్ల మీకేమీ నష్టంలేదు గదా __"
రాజరావింకేమీ అనకుండా వీధి గదిలోకి వచ్చి కూర్చుని, పేపర్లో ఎడిటోరియల్ చూడసాగాడు. బయటకు వెళ్ళాలనే ఉన్నప్పటికీ _ కదలడానికి బద్దకంగా ఉందతడికి. రమాకాంతంగారి౦టికిప్పుడెందుకూ, సాయంత్రం వెళ్ళవచ్చు __ అనుకున్నాడతడు. అతడలాగనుకునే సరికి ఎవరో వీదితలుపు తట్టారు. తలుపు తీసేసరికి రమాకాంతం ప్రత్యక్షమయ్యాడు.
"అరే __ నేనే వద్దామానుకుంటున్నాను _ మీరే వచ్చారు. రండి రండి __" అంటూ రాజరావాయన్ను ఆహ్వానించాడు.
రమాకాంతం వెంటనే _ "మీరు రావాడమేమిటండీ __ స్వయంగా వచ్చి మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యతా. ఊళ్ళో నా పలుకుబడి హఠాత్తుగా పెరిగింది. ఊరంతా నిన్న మీరు నారయ్యతో మాట్లాడిన విశేషం కధగా చెప్పుకుంటున్నారు. మీరలా చేయబోతున్నట్లు నాతో మాట మాత్ర మయినా అనుంటే _ ఆ దృశ్యాన్ని కన్నులపండుగుగా దర్శించడానికి నేనూ అక్కడికి వచ్చుండే వాడ్ని __ " అన్నాడు.
రాజారావు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
"నారయ్యను ప్రశ్నించాలన్న ఆలోచన నాకూ వచ్చిందిలెండి కానీ చేపోద్దూ _ అయన నర్సన్న పక్షమేమో నన్న అనుమానం నా అంతరాంతరాల్లో ఉండిపోయింది. ఆయన నేను నక్సలైట్లు మద్దతు నిచ్చాసన్నాడంటే కొంపములిగిపోతుంది. కాన్వీ నిన్న మీరు ధైర్యంచేసి అడిగేయడంలో నా మీద అపవాదు తొలగిపోయింది ......"
"నారయ్యను మీరనుమనించడం పొరపాటు. అతడు ఎవరి మనిషీ కాదు. అతడిలో భగవదంశ లేకపోలేదు. అతడు మంచివాడు, మహిమాన్వితుడు అదలాగుంచండి ఇప్పుడు మీ ఎన్నికల బలం పెరిగినట్టే అనిపిస్తుంది. నరహరకి మీరుధ్యోగం వేయించారు. ఈ విధంగా నరహారి తండ్రి సపోర్టు మీదే. ఇక్కడ చలమయ్యగారివి మీకు స్ట్రాంగ్ సపోర్టు .... ఈ సారి కూడా మళ్ళీ మీరే ....."
అతడిని మధ్యలో ఆపి __ "గెలుపు నాకు కొత్తకాదు. కానీ ఈసారి నేను గెలిస్తే అది నాడి కాదు __ మీ గెలిస్తే అవుతుంది. మీకు నామీదింత అభిమానమెందుకో నాకే అర్ధంకావడం లేదు. ......" అన్నాడు రమాకాంతం.
"కేవలం కాలక్షేపం ...." అన్నాడు రాజారావు. కానీ అతడి మనసులో కృష్ణడూ కావచ్చు. తను కృష్ణుడూ కావచ్చు. కానీ రమాకాంతం మాత్రం .....
ఈలోగా వసంత టీ తీసుకుని వచ్చింది.
రమాకాంతం టీ కప్పు అందుకని _ "అరే _ ఇప్పుడే భోంచేసి వస్తున్నానండీ! ఈ పల్లెటూళ్ళలో ఇలా ఇబ్బంది పెట్టకూడదు ...." అన్నాడు.
"మా యింటికొస్తే ఇలాంటిబ్బంది తప్పదు విశేషాలు మాట్లాడుతున్నారు. రమాకాంతం సెలవు తీసుకుని వెళ్ళబోయేముందు __ " మనూరికి మీ వంటి పదవీ వ్యామోహం లేని వాళ్ళే కలకాలం ప్రెసిడెంటుగా ఉండాలని న ఆశ!" అన్నాడు రాజారావుయనతో.
అంతవరకూ ఉత్సాహంగా ఉన్న రమాకాంతానికా వాక్యం చురుక్కుమంది. రాజారావు తన్నభినంది౦చాడో, వెటకారం చేశాడో అయన కర్ధం కాలేదు.
32
ఏ అలజడీ లేకుండా సాఫీగా పంచాయితీ ఎన్నికలు జరిగే ఆ గ్రామంలో మొదటిసారిగా రాజకీయపు చదరంగం ప్రారంభమయింది. నర్సన్న , రమాకాంతం _ ఒకర్ని మించి ఒకరు ఎత్తులు వేసుకూండగా _ రాజారావు రమాకాంతం పక్షం వహించి నర్సన్న ఎత్తులు చిత్తూ చేసేశాడు.
నర్సన్న ఈ విషయమే బెంగా పెట్టుకున్నాడు. ఎంతో ఆలోచించి తను వేసిన పతకాన్ని రాజారావు మావుదట్లావుకి నరికేశాడు . ఇప్పుడు తను తిరిగి ఎన్నికల్లో నిలబడే అవకాశం లేదు. నిలబడినా నేగ్గనూ లేదు. అటువంటప్పుడు.....