"బాగుంది వరస __ అది మాకు మాత్రం కూతురు కాదా, మీకు మాత్రం దానిమీద అపెక్షుండదా __ " అంటూ స్టౌ మీద నీళ్ళు పడేసింది వసంత.
భార్యాభర్తలిద్దరూ కాఫీ తాగారు.
రాజారావు భార్యతో కులాసాగా కబుర్లు చెబుతూనే, మధ్య మధ్య పాప వాళ్ళు చూస్తూ టైము చూసుకుంటూన్నాడు.
పాప జ్వరానికి నారయ్యే కారణమా? తనలో నమ్మకం పుట్టడానికి నారయ్యిప్పుడు నీలకు జ్వరం గట్టిస్తాడా? లేక తనను పరీక్షింస్తున్నందుకు అలిగి, స్పపనింకా బాధపెడతాడా? లేక అసలిదంతా కాకతాళీయమా?
తను మానవాతీటా శక్తులతో చేలగాటమాడుతున్నాడా? అసలు మనవాతీటా శక్తులున్నాయా? అవి ఏ అజ్ఞానానికీ అందవా? తనిప్పుడసహాయుడా?
రాజారావు అన్యమస్కంగా ఉన్న విషయం వసంత గుర్తించింది. కానీ ఆమెకు మనసులో బెంగగా వుంది. పాప వళ్ళు చల్లబడడంలేదు. అలా కాలిపోతూనే ఉంది.
రాజరావనుకున్న రెండు గంటలలోనూ ఇంకా ఓ నిముషం వ్యవధి ఉన్నదనగా ఎవరో తలుపు తట్టారు. రాజారావుకు దేవుడే తలుపు తట్టాడా అన్న భ్రమ కలిగింది. అతడు పరుగున వెళ్ళి తలుపు తీసేసరికి ఆ సమయంలో దేవుడి కంటే ముఖ్యమయిన వ్యక్తి కనిపించాడు.
"రండి రండి డాక్టరుగారూ! రెండు మూడు గంటలనుంచి మా పాప మూసినా కన్నెరక్కు౦డా పడి ఉంది. మీ రూళ్ళో లేరన్నారు. ఏం చేయాలో పాలుపోక అలా దుగులుగా కూర్చున్నాం __" అన్నాడు రాజారావు.
డాక్టరు పాప దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేసి చిరునవ్వుతో రాజారావు వంక తిరిగి __ "చాలా మామూలు జ్వరం. ఈ టాబ్లెట్ వేశారంటే రాత్రికి టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇప్పుడోకటీ _ రాత్రి ఒకటీ యివ్వండి. రేపిక నన్ను మీరు పిలవనక్కర్లేదు కూడా _ " అన్నాడు.
"దేవుడిలా వచ్చి మనం:స్థిమితం కలిగించారు ....." అంది వసంత.
రాజారావులిక్కి పడ్డాడు. రెండు గంటల్లో నయమైతే నారయ్యను నమ్ముతానన్నాడు. తను. రెండు గంటల్లో పాపకు నయంకాలేదు కానీ, ఊళ్ళో లేదనుకున్న డాక్టరు వచ్చే శాడు. పాపకు నయమవుతుందని రూఢీ అయింది. ఇది నారయ్య వల్లనే జరిగిందా?
రాజారావు మనసులో ఏదో మూల __ ఇందులో నారయ్య ప్రభావముండి ఉండాలపిస్తోంది. అతడు తటపటా ఇస్తూనే __ "రాత్రిదాకా రానన్నారు మీ యింట్లో __" అనడిగాడు డాక్టర్ని.
"అవునండీ _ పనిమీద పొరుగూరుని బయల్దేరాను. సగం దూరం వెళ్ళేసరికి రెండు టైర్లకీ ఒక్కసారే పంక్చర్లయ్యాయి. పనంత అర్జంటుకాదు. వెంటనే సైకిలు నడిపించుకుని వెనక్కోచ్చేసి _ సైకిలు బాగుచేయించుకుని ఇంటికెళ్ళే సరికి మీరొచ్చి వెళ్ళారని తెలిసింది _ ....." అన్నాడు డాక్టరు.
టైము లెక్కచూస్తుంటే తను నారయ్యని వేడుకున్న టైమూ, డాక్టరుగారి సైకిలు టైర్సు పంక్చారయిన సమయమూ ఒక్కటే అనిపించిందతడికి.
"చాలా థాంక్సండి __" అన్నాడు రాజారావు.
"ఇందులో థాంక్స్ దేముంది నా వృత్తిధర్మం నేను చేశాను. వస్తాను, సెలవు ...." అని డాక్టరు వెళ్ళిపోయాడు.
"ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది __" అంది వసంత.
రాజారావు మాత్రం జరిగిన విషయానికి మనసులో మధనపడుతూనే ఉన్నాడు. డాక్టరు చెప్పినట్లుగానే పాప జ్వరం రాత్రికి రాత్రే సులువుగా దిగజారిపోయింది.
31
విజ్ఞానం ఎంత పురోగామించినా, మనిషికి అర్ధంకాని మానవాతీతి శక్తులు కొన్ని లేకపోలేదు వాటిలో చేద్దవీ, మంచివీ కూడా ఉన్నాయి. క్షాతిబడి చిల్లంగి వంటివి దుష్టశక్తులనుకుంటే _ ప్రస్తుతం ఊరూరా వెలుస్తున్న ప్రత్యక్ష దైవాలు మంచి శక్తులనుకోవచ్చు.
ఈ ధోరణీలో తన ఆలోచనలు నడుస్తాయని రాజారావు వెన్నడూ అనుకోలేదు. నారయ్యతో సంభాషణ, పాపకు జ్వరం, వసంతచే దూషణ _ ఉన్నపళంగా డాక్టరు ప్రత్యక్షం కావడం _ అతడికి అయోమయంగా ఉంది.
అన్నింటికి మించి నారయ్య తనను అహంకారి అనడమూ _ వసంత అది సమర్ధించడం __ రాజరావును బాధించింది.
ఇతరుల లోపాలేన్నింనంతసులభంగా మనిషి తనలోని లోపాన్ని తెలుసుకోలేడు.
"నేను అహంకారిని. నాలోని ఈ లోపాన్ని సవరించుకోవాలి _ ..." అనుకున్నాడు రాజారావు.
'ఏమటండీ తీవ్రాలోచనలో ఉన్నారు. వంటయింది. వస్తారా?" అని వసంత పలకరిమచడంతో రాజారావుకు ధ్యాన భంగమయింది.
"ఊం" అన్నాడు రాజారావు పరధ్యానంగా. భార్యేమన్నదో తలలోకెక్కగానే __ "ఏమిటీ వంటయిపోయిందా __ నా సాయం లేకుండానే?" అన్నాడు నవ్వుతూ.
"అం! మీ సాయంలేదు కాబట్టి, పదిన్నరకే వంటయింది....."
"అన్నట్లు _ నీలకు పథ్యం పెట్టాలనుకున్నాంగదా ...."
"పాపం _ అది బాగా నీరసంగా ఉంది. కానీ ఏమీ ఏడిపించకుండా ఒక్కట్టీ బుద్ధిగా మంచంమీద పడుకుని వుంది ....." అంది వసంత.
"అవునుగానీ _ వసూ _ ఒక్కసారిలా కూర్చో! నిన్న జరిగిన విశేషం చెబుతాను __" అంటూ రాజారావు తను నారయ్యకు పెట్టిన రెండు గంటల పరీక్ష గురించి చెప్పి __ "నారయ్య భగవంతుడో, భగవదంశ గలవాడో అనుకుందాం. అయితే నా మనసులో తనపై నమ్మకమెందుకు కలిగించలేకపోతున్నాడో చెప్పాగలవా?" అన్నాడు.
"అది వారి వారి పూర్వజన్మ వాసలను బట్టి ఉంటుంది. కృష్ణుణ్ణి లోకమంతా భగవంతుడా గుర్తిస్తే కంసుడు, జరా సంధుడు , దుర్యోదునుడు నిరసించి వ్యతిరేకించారు _ ...." అంది వసంత.
"కానీ నేను కంసుడూ వాళ్ళకులా ప్రజా కంటకుణ్ణి కాదు. అదలాగుంచి _ ఎలాగూ సందర్భం వచ్చింది. కాబట్టి అంటున్నాను _ అసలు కృష్ణుడు మాత్రం భగవంతుడే నంటావా? భారతంలో దుర్యోధనుడు పాండవులపట్ల అనేక అపచారాలు చేసి ఉండవచ్చు గానీ __ అతడు ప్రజాకంటకుడు కాదు. అతగాడు పాండవులనుమించి ప్రజారంజకంగా రాజ్యం చేసినట్లు భారతంలో రాశారు. అలాంటప్పుడు కురుసర్వభౌమత్వాన్ని దుర్యోధునుడికే వదిలి ఉంటే _ కురుక్షేత్ర సంగ్రామం జరిగేదీ కాదు, పాండవ ద్వేషి అన్న కారణానికి దుర్యోదునుడ్ని సర్వనాశనం చేశాడు, పాండవ పక్షపాతి అయిన శ్రీ కృష్ణుడు, ప్రజలకు పాండవులయితేనేం _ కౌరవులయితేనేం ? కురుక్షేత్ర సంగ్రామం కృష్ణుడి రాజకీయ చతురతను. నిరూపిస్తుంది. తప్పితే - అతడ్ని భగవంతుడ్ని చేయలేదు. అవునా?'