సరేనని వసంత ఇంటిదారి పట్టింది.
రాజారావు డాక్టరింటికి వెళ్ళాడు. డాక్టర౦టే అయన డిగ్రీ పుచ్చుకున్నవాడెం కాదు. ఓ డాక్టరు వద్ద కొన్నాళ్ళు కౌంపౌండరుగా పనిచేసి, ఆ అనుభవాన్ని పురస్కరించుకుని ఇక్కడ మకాం పెట్టాడు. హస్తవాసి మంచిది కావడంవల్ల నయితేనేం, అదృష్టంకొద్దీ అయితేనేం _ మొదట్లో అతడు పట్టిన ప్రతి కేసూ ఫలించి, ఆ గ్రామంలో స్థిరపడ్డాడు. రాజారావుకూడా అతడి వైద్యం మీద మంచి నమ్మకముంది.
అయితే అప్పుడు డాక్టరింటిలో లేడు.పొరుగూరు వెళ్ళాట్ట. రాత్రికి గానీ, మర్నాడుదయానికి గానీ తిరిగోస్తాడనీ ఇంట్లో చెప్పాట్ట రాజారావుకిది అపశకునంలా తోచింది. ఊళ్ళో ఇంకా ఒకరిద్దరు వైద్యులున్నారు. కానీ, వాళ్ళకంటే తనకే ఎక్కువ వైద్యం తెలుసుకుని రాజారావు నమకం అతడింటిదారి పట్టాడు.
ఇంటివద్ద వసంత ఆతృతగా ఎదురుచూస్తోంది. అతడ్ని చూడగానే _ డాక్టరేడీ అన్న ప్రశ్న ఆమె కళ్ళలో కొట్టొచ్చినట్లు కనబడింది, రాజారావువిషయం చెప్పాడు.
ఉన్నట్లుండి వసంత ఏడ్చేసింది __ "నాకు చాలాసులభంగా ఉందండీ __ ఈరోజు మీరు దేవుడితో అతలాడేరు. మీకు బుద్ధి చెప్పడానికే దేవుడిలా చేశాడని నా కనుకూలంగా ఉంది. ఆ నారయ్యగారు సామాన్యుడు కాదు ....." దుఃఖంతో గొంతు పూడుకుపోయి అమెకిక నోట మాట రాలేదు.
"వసూ!" అన్నాడు రాజారావు కోపంగా __ "ఆ నారయ్యంత గొప్పవాడే అయితే __ ఈ లోకమిలా ఎందుకేడుస్తోంది? ఇంతమంది కుంటివాళ్ళు, గుద్దివాళ్ళ, బిచ్చగాళ్ళు _ ఎందుకు బాధలు పడుతున్నారు? తుఫాన్లు పేరు చెప్పి వేలాది ప్రజలు చవదమావు, నిరాశ్రయలు కావడమో ఎందుకు? హంతకులు హత్యలెందుకు చేస్తున్నారు? మారణాయుధాల భయంతో ఈ ప్రపంచం వణికిపోవడమెందుకు? వీటన్నింటినీ అయన అపగలడా ? ఆపలేదు! ఇది సృష్టించక్రం, ఒకళ్ళాపాలనుకు౦టే ఆగదది. ఒకళ్ళు తిప్పాలనుకుంటే తిరగదది. ఈ నారయ్యకు చేతనయిన విద్య __ నా పాపకు జ్వరం తెప్పించడమే అయితే __ అయన భగవంతుడు కాదు _ పిశాచమవుతాడు. నేనేం తప్పుచేశాను? ఎవరికయినా అన్యాయం చేశానా? దొంగతనాలు, మానభంగాలు, హత్యలు _ చేశానా? వీలయినంతలో పదిమందికి సాయపడుతున్నారు. నా మీద అలిగిన వాడు దేవుడు కాలేడు. ... అసలు దేవుడికి నాపై ఆగ్రహమెందుకు?"
"ఎందుకో చెప్పనా __ నారయ్యగారన్నట్టు _ మీలో అహంకారం జాస్తి. మిమ్మల్ని మించిన ప్రజ్ఞలు లేరని మీ నమ్మకం. మీ స్వార్ధం కోసం చేసే ప్రతి పనీ మీకు పరోపకారాంగానే కనబడుతుంది _ ..." అంది వసంత తీవ్రంగా.
"వసూ _ నీ ఆలోచనలు గాడి తప్పుతున్నాయి _" అన్నాడు రాజారావు.
"లేదు. మీ ఆలోచనలను సరిచేస్తున్నాను. నర్సన్న ప్రజలకు ప్రత్యేకంగా చేసిన అపకారమేమిటి? రమాకాంతం చేసిన ఉపకారమేమిటి? రమాకాంతాన్ని బలపరచడానికి మీ కారణం నిజంగా ప్రజా క్షేమమూ ? రామాకాంతం అంతయోగ్యుడా? కాదు .... మీరు మీ వ్యక్తిగత కారణాల కోసం రమాకాంతాన్ని బలపరుస్తున్నారు. మీరీ ఊళ్ళో అడుగుపెట్టి చేసిన ప్రతి మంచిపని వెనుకాస్వార్ధముంది. ఆ స్వార్ధాన్ని మంచితనం అనుకోవడం మీ అహంకారం నారయ్యగారు మహిమలు చేస్తూ, ప్రజలకు సద్భోధనలు చేస్తున్నాడు. భగవంతుడయితేనేం _ కాకపోతేనేం అయన మహాపురుషుడు. అటువంటి మహాపురుషుడి సమక్షంలో _ మీకు కలలో దేవుడు కనిపించాడంటూ అసత్యమాడారు. మీ ఉద్దేశ్యం నర్సన్న అబద్దాన్ని ఖండించడమే కావచ్చు. కానీ అలా ఖండించాల్సిన అవసరమే మొచ్చింది? రమాకాంత౦ సాటి చేయడా __ నర్సన్న !"
ఆమె కోపానికి భయపడుతూ __ "మరి నర్సన్న కూడా దేవుడి సమక్షంలోనే అబద్దమాడితే అయన కేమీ జరుగలేదు" అన్నాడు రాజారావు వీలయినంత నెమ్మదిగా.
"మీ తార్కిక విజ్ఞానానికి చాలా సంతోషించాంలెండి. అసలాయన అబద్దమాడేడని మీకెలా తెలుసు? అది కేవలం మీ అపోహా. పోనీ మీది అపోహా కాదనుకుందామన్నా _ అయన మీ అంత నిర్భయంగా అబద్దమాడి ఉండడు. కానీ మీకా భయమేదీ? మీలో విశాక్షణా జ్ఞానాన్ని పోగొట్టింది....."
"ఒప్పుకున్నాను వసూ __ నాది అహంకారమే! కానీ ఒక్క విషయం ఒప్పుకోను తెలసి, కావాలని తప్పు చేసిన వాడ్ని క్షమించమన్నా భగవంతుడు క్షమిమ్చాకూడదు. ఒకవేళ క్షమించినా __ ఆ తప్పులో కేవలం స్వార్ధచింతన ఉండనప్పుడే అలా చేయాలి. నేను తలపెట్టిన కార్యం పూర్తిగా స్వార్ధపూరిత౦ కాదని నీకూ తెలుసు ...."
వసంత కాసేపు మౌనం వహించి __ తర్వాత _ మీరెన్ని చెప్పండి ! పాప గురించి నాకు చాలా బెంగగా ఉంది. తప్పయిపోయిందని దేవుడికి దణ్ణం పెట్టుకుని __ రేపు వెళ్ళి క్షమార్పణ చెప్పుకోండి . అందులోనూ తనను నమ్మే అవసరం వస్తుందని అయాన ముందే చెప్పాడు ...." అంది.
"వసూ ! నువ్వు నన్ను కాదు, విజ్ఞానశాస్రాన్నే అనుమానిస్తున్నావు. పాపకేమీ జరగదు. పద _ పోయి చూద్దాం!" అన్నాడు రాజారావు సానునయంగా.
అయితే పాపకి౦కా అలాగే ఉంది. అది మూసినా కన్నేరక్కుండా పడివుంది. రాజారావు భార్యతో __"అనుమానం పెనుభూతం అన్నారు. నువ్వు పిచ్చి పిచ్చి అనుమానాలను మనసులోకి రానివక్క __ కాస్త మిరియాల కషాయం పెట్టియ్యి _" అన్నాడు.
వసంత వంటింట్లోకి వెళ్ళింది
రాజారావు మనసులో __ స్వామీ _ నారయ్యా _ నాకు నీ అపూర్వ శక్తులలో విశ్వాసం కుదిరింది . కానీ ణా పాపకు నీ కారణంగా జబ్బు వచ్చిందంటే నమ్మలేకుండా ఉన్నాను. మరో రెండు గంటల్లో ఏ వైద్యం అవసరం లేకుండానే న పాప మామూలుగా లేచి తిరగ్గాలిగితే _ నువ్వు దేవుడివని కాక పోయినా, నీలో దైవత్వం ఉందని నమ్ముతాను __" అనుకున్నాడు.
ఇలా అనుకుని అతడు గబగబా వంటింట్లోకి పరుగెత్తి "వసూ _ ఇప్పుడు మిరియాల కషాయం పెట్టవద్దు. ఇప్పుడే కదా ఊళ్ళో౦చి వచ్చాం. ఏ రెండు గంటలాగి అప్పుడు చూద్దాం. పిల్లకు విశ్రాంతి కావాలి __" అన్నాడు.
వసంత అతడివంక ఆశ్చర్యంగా చూసి __ "మళ్ళీ దేవుడిలో ఏదయినా ...." అనబోగా __
"అబ్బే _ అదేం లేదు ...." అన్నాడతను కంగారుగా.
అప్పటికి వసంత కాస్త చల్లబడి _ "పాపకు తగ్గుతుందంటారా?" అంది.
"వెర్రిదానా _ అది మామూలు జ్వరం దీనికే నువ్వింతగా కంగారుపడితే రేపోద్దున్న ...." ఏదో అనబోయి ఆగి __ " జీవితంలో ధైర్యం అలవర్చుకోవాలి వసూ!" అన్నాడు రాజారావు.
"అం ..... ధైర్యం మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆ మధ్య నాకు జ్వరమొచ్చినపుడు చూడాలి అయ్యగారి ముఖం ....." అంటూ నవ్వింది వసంత.
"అబ్బ __ ఎంతసేపటికి నవ్వావోయ్ ..... హమ్య్య __ ఇంక నిన్ను కాఫీ అడగొచ్చన్నమాట ...." అని __ "పిల్లక్కడ వాళ్ళు తెలియకుండా పడుంటే కాఫీ కావాలసిచ్చోందిట అయ్య గారికి _ అంటావేమొనని భయమేసి ఇందాకట్నుంఛీ అడగలేదు మరి __" అన్నాడు రాజారావు.