Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 48

   

   "ఏదో విధంగా దాని మెళ్ళో పసుపుతాడు పడితే చాలు స్వామీ __ స్వామీవారి హుండీలో నూటపదహార్లు వేసుకుంటాను __" అందామె నారయ్యకు నమస్కరించి.

    ఆమె కూర్చోగానే మరో వ్యక్తి లేచాడు. అలా ఒకోక్కరే లేవదమూ __ నారయ్య వారి సమస్యలను పరిష్కారాలు సూచించడమూ జరిగింది. ఇక అందరి సమస్యలూ చటుక్కున లేచి నిలబడ్డాడు.

    నర్సన్న ఆశ్చర్యపోయాడు.  రాజారావు నారయ్యకు తన సమస్యలు చెప్పుకుంటాడని అతడూహించలేదు.

    నారయ్య హుందాగా నవ్వుతూ రాజారావు వంక చూసి __ "నీలో ఉన్న తాశయాలతోపాటు అహంకారంకూడా ఉంది. నువ్వు నన్ను నమ్మకపోయినా __ అందువల్ల ఎవరికీ ఏ హానీ లేదు కాబట్టి, నేను నిన్ను క్షమించాను. పాపాలకు దూరంగా ఉంటూ, వీలయినంతలో ఇతరులకు సాయపడే వాళ్ళు భగవంతుడికి సాయపడనవసరంలేదు. అయినా నువ్వు నన్ను నమ్మే అవసరం వ్వస్తుందిలే! ఏమయితేనేం __ నీ ప్రశ్ననిన్ను గురించి కాదు. రమాకాంత౦ నక్సలైటతో చేయికలిపెడన్న ఆరోపణ నిజమా, కాదా అనడుగుతున్నావు. ఆ ఆరోపణ నమ్మడానికి అవకాశాలు చాలా ఉన్నప్పటికీ ఈ విషయంలో రమాకాంతం నిర్దోషి. వాడు __ అమాయకంగా వాళ్ళను నమ్మి అశ్రమిచ్చి __ ఊళ్ళో పలికుబడి కోల్పోయాడు . ఈ ప్రశ్నకు సమాధానం కోరడంలో నీ ఆశయం  __ వాడి నిర్దోషిత్వాన్ని నా ద్వారా నిరూపించాలానే! అయితే అందులోనూ నీ స్వార్ధముంది. అవునా?" అన్నాడు.

    నారయ్య మాటలు వింటూనే రాజారావు చేతులు జోడించి అతడికి నమస్కరించి __ "స్వామీ __ మీరు నేనూహించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పవారు. నన్ను బాధిస్తున్న మరో పెద్ద సందేహానికి _ అరిషడ్వర్గాలను జయించిన తమ రాగ్రహించరనుకుంటాను. మీరు శ్రీ వెంకటేశ్వరుడు కాదు, భగవంతుడు కాదు. ఆ విషయం నాకు తెలుసు. అయితే ఎవరు మీరు?" అన్నాడు.

    అంతవరకూ ఉన్న చిరునాగపు నారయ్య ముఖంలోంచి మాయమయింది. అతడు అసహనంగా రాజారావు వంకచూసి "ఓరీ !" అని ఏదో అనబోయి ఆగాడు. "అవును నేను అరిషడ్వర్గాలను జయించినవాడ్ని. నేను నీపై ఆగ్రహించకూడదు. నీ సందేహం గొప్పదే! ఇటువంటి సందేహం కలిగిందుకు నిన్నభినందిస్తున్నాను. నేను భగవంతుడ్ని కాదు. భగవంతుడి పరిచారకుడ్ని . మీ వంటి వాళ్ళ దృష్టిలో భగవంతుడినే నేను. ఇంక నన్నేమా ప్రశ్నించకు వెళ్ళు. మళ్ళీ ఈ పరిశారాలను కూడా రాకు ....." అన్నాడు.

    భక్తులందరూ ఆశ్చర్యంగా రాజరావునీ, నారయ్యనీ మార్చ్గి మార్చి చూస్తుండగా, నారయ్య ఉన్నట్లుండి వెనక్కు విరుచుకుని పడిపోయాడు. అతడి పూనకం ముగిసింది.

    భక్తగణంలో కోలాహలం ప్రారంభమై అంతా భకగీతాలు  పాడసాగారు. ఆ గీతాల నడుమ రాజారావు లేచి నారయ్య వైపు నడపసాగాడు.

    పారవశ్యంతో నారయ్య కాళ్ళవద్ద మఒకరి౦చి ఉన్న నర్సన్న రాజరావుని చూడలేదు. కానీ ఉన్నట్లుండి __ మిన్ను ముట్టిన భక్తుల కోలాహలం అణగారిపోవడం గ్రహించి తలెత్తి చూసేసరికి _ అతడికి నారయ్య తలవైపున కూర్చున్న రాజారావు కనపడ్డాడు.

    "భక్తులందరూ ఒక్క నిముషం మౌనం వహిస్తే _ నేను మనవి చేసికోవలసిన ముఖ్య విషయమోకటుంది __ ...." అన్నాడు రాజారావు.

    నర్సన్నగారి గుడిలో రాజారావు కారణంగా నిశ్శబ్దం ఆవరించింది.

    "ఇప్పుడే మనం భగవద్దర్శనం చేసుకున్నాం. జన్మతరించిందనుకున్నాం. కానీ ఆ భగవంతుడే పరిచారకుడిన్నీ చెప్పాడు అది నిజం ఇప్పుడు నారయ్యగారి నావహించి౦ది భగవంతుడు కాదు. బహుశా మరణించిన ఒక మహాభక్తుడి ఆత్మ అయుండవచ్చు. తనను భగవంతుడనేవాళ్ళు మూర్ఖులని శ్రీ నారయ్యగారు సెలవిచ్చారు. అసలు నారయ్యగారి గురిమ్హిన ఈ విషయం నాకెలా తెలిసిందో ఇప్పుడు చెబుతాను. నిన్న రాత్రి భగవంతుడు న కలలోకి వచ్చాడు. ఎవరనుకున్నారు __ సాక్ష్యాత్తూ శ్రీ వెంకటరమణమూర్తి. వచ్చి ఏమన్నాడో తెలుసా? మీ గ్రామంలో నా పేరుతో ఒకదేవుడు వెలిశాడు. నిజనాకి వాడు నా భక్తుడు మాత్రమె! వాడు మహిమలు చేస్తాడు. ప్రజలకు సాయపడతాడు. అందరి కష్టాలూ తీరుస్తాడు. కానీ వాడొక పొరపాటు చేశాడు. తన భక్తుదయినా నర్సన్న అనే వాడిని పరీక్షించాలనుకుని __ ఊరి ఎన్నికల్లో నిలబడని కలలో కనబడి చెప్పాడు . అంతకుముందుగా నర్సన్న తన జీవితాన్ని పూర్తిగా భగవంతుడి సేవకే అంకితం చేస్తానంటే __ వాడి చిత్తశుద్దిని పరీక్షించడం కోసం న భక్తుడలా చేశాడు. ఆ నర్సన్నది నిజంగానే భగవదాదేశమని నమ్మాడు.ఇందులో న భక్తుడిదే పొరపాటు. నా పేరు రాజకీయాల్లోకి రావడం నాకిష్టంలేదు. కాబట్టి యీ నిజం నీకు చెబుతున్నాను. రేపు నువ్వు దేవాలయంలో నలుగురి సమక్షంలో ఈ విషయం తెలియబరవచ్చు __ అని చెప్పాడు. అందుకే నేనీ రోజున ఇక్కడకు వచ్చాను. నిజానిజాలు నీ ముందు౦చుతున్నాను. ఈ విషయంలో మీకింకేమయినా సందేహలంటే రేపు నారయ్యగారినే అడిగి తెలుసుకోండి. అయితే నారయ్య గారినే అడిగి తెలుసుకోండి. అయితే నారయ్యగారి అవతారానికి పరమోద్దేశ్యం __ మీకు సత్ప్రవర్తన నేర్పడమే గానీ __ మీ సందేహాలకు సమాధానా లివ్వడం కాదని గుర్తుంచుకోండి. ...."

    రాజారావు ఉపన్యాసం ముగిసింది. శ్రోతల్లో కలకలం రేగింది. నారయ్య ఇంక అపస్మారక స్థితిలోనే ఉన్నాడు.
అనుకోకుండా తనకు తగిలిన ఈ దెబ్బకు _ నర్సన్న కూడా ఇంచుమించు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.

                                                                             30

    రాజారావు విజయగర్వంతో వేదిక దిగి __ వసంతవైపు పోదామన్నట్టు చూశాడు. వసంత తనూ లేస్తూ, పక్కనే నిద్రపోయిన కూతురు నీలను లేవదీస్తూ ఉలిక్కిపడింది. పాప ఒళ్ళు వేడిగా ఉంది. అనుమానం కలిగి ఆమె కూతురి వంటిమీద చేయివేసి చూసేసరికి సలసలా కాగిపోతొంది.

    వసంత మౌనంగా కూతుర్నేత్తుకుని పకలోంచిబయటకు వచ్చి, నెమ్మదిగా భర్తతో __ "పాప వళ్ళు సలసలా కాగిపోతోంది __" అంది.

    రాజరావులిక్కిపడి, తనూ నీల వళ్ళు తాకి చూసి __ "ఇంటిదగ్గర బయల్దేరినప్పుడు దానికేమీ లేదు కదూ __" అన్నాడు.

    "లేదండీ __ ఇక్కడికొచ్చి కూర్చున్నాక, మీరు లేచి నిలబడి మాట్లాదేవరకూ కూడా బాగానే ఉంది. నాకేమిటో భయంగా ఉందండీ __" అంది వసంత.

    రాజారావు తనలో తనే స్పష్టంగా గోణుక్కున్నాడు. తర్వాత ఏమనుకున్నాడో __ "నువ్వు ముందు __ ఇంటికి పద. నేను డాక్టర్ని తీసుకుని వస్తాను. ఈలోగా కంగారుపడి ఎవరితోనూ ఏమీ అనబోకు _ ....." అన్నాడు.

 Previous Page Next Page