Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 47

  

     కొన్ని నియమాల ననుసరించి సృష్టి నడుస్తోందనీ, ఆ సృష్టి చలనానికి వెనుకనున్న అగ్నతశక్తి భగవంతుడనీ రాజారావు విశ్వాసం. సృష్టిలోని ప్రతి వస్తువు పుట్టుకాకూ కారణముంది. నక్షత్రాలు, గ్రహాలూ వగైరాలన్నీ ఎలా పుట్టాయో __ \తన మేధాశక్తి నుపయోగించి గ్రహించాను మానవుడు. సృష్టిలో జరిగే ప్రతి విశేషానికి సూత్రాలు కనుగొన్నాడు. ఇంకా ఎన్నో ఇతర సూత్రాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్నది సహస్ర విగ్ననానికే సవాలుగా ఉంది.

    నారయ్య హిప్నోటిజం చేస్తున్నాడా అని, అతడనుమానించాడు. హిప్నోటిజంలో ఎదుటి వాడిలో చూడనిది చూస్తున్నామన్న బరమ కలిగించడం.అయితే గతంలో నలుగురూ చూస్తుండగా శంఖ, చక్త్రాలు నారయ్య చేతిలోనికి వచ్చినపుడు __ ఓభక్తుడు ఫోటో తీశాడు. హిప్నోటిజమయితే ఫోటోలో శంఖ, చక్రాలు రాకూడదు. కానీ అవి ఫోటోలో పడ్డాయి. ఆ తర్వాత నారయ్య చేసిచూసిన మహిమలేన్నో ఫోటోల్లో వచ్చాయి.

    ఇది హిప్నాటిజం కాదు, ఇంద్రజాలం కాదు. తప్ప కుండా ఏదో మానవాతీత శక్తి అయుండాలి. అయితే ఆ మానావాతీతశక్తి  భగవంతుడేనా అన్నది వివాస్పదస్పదమయిన విషయం.

    ఇంటికెళ్ళే వరకూ ఉంటాయో, ఉండవో చూడాలని రాజరావా అక్షింతలు కొన్నింటిని జేబులో వేసుకున్నాడు. సరిగ్గా అప్పుడే నారయ్య కంఠం ఖంగుమంది.

    "ఇక్కడున్న వాళ్ళలో దేవుడంటే విశ్వాసం లేనివాడొకడున్నాడు. వాడు నన్ననుమనిస్తున్నాదు. ఇది నాకు అవమానం ...."

    రాజారావు తెల్లబోయాడు. తను నారయ్యను దేవుడిగా నమ్మడంలేదు. అతడిది గ్రహించేశాడా?

    నారయ్య కంఠం మళ్ళీ ఖంగుమంది __ "వాడు లేచి వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమార్పణ వేడుకోవాలి. అంత వరకూ నేను మాట్లాడను. వాడు తనంతట తానే లేచి వచ్చేడా సరేసరి __ లేదా జరగవలసింది జరుగుతుంది __"

    నర్సన్న దృష్టి రాజారావు వంక మళ్ళింది. అతడి కళ్ళు అనుమానంగా రాజరావునే చూస్తున్నాయి.

    రాజారావు నర్సన్న వంక చూశాడు. అతడి కళ్ళలో అనుమానం వెనుక అనందం _ అతడిక్కనిపించింది. అప్పు డతడు ఆడవాళ్ళవైపు తిరిగాడు. వసంత కలవరపాటుతో భర్త వంకే చూస్తోంది.

    తనకేదో జరుగుతుందని భార్య కలవరపడుతున్నట్లు గ్రహించి రాజారావు మనసులోనే  నవ్వుకున్నాడు. అతడి కిప్పుడు భయంగా లేదు. నారయ్యను నమ్మక చూపుకొందరు, మాట కొందరు పోగొట్టుకుని __ అతడి క్షమా లభించేక తిరిగి చూపు, మాట పొందిన విషేషాలతడు వినిఉన్నాడు. అలాంటి అనుభూతి తనూ పొందాలని తహతహా లాడుటున్నా డతడు. ఇప్పుడలాంటి అవకాశం వచ్చినట్లే ఉంది.

    అయిదు నిముషాలు గడిచాయి.

    రాజారావుకి నారయ్య కనబడుతూనే ఉన్నాడు. అంటే చూపు బాగానే ఉంది. నెమ్మదిగా "గోవిందా!" అనుకున్నాడు. మాట కూడ బాగానే వస్తోంది. నెమ్మదిగా కాళ్ళూ, చేతులూ కదిపి చూసుకున్నాడు. అన్నీ సక్రమంగానే ఉన్నాయి. అతడినే క్రీగంట కనిపెడుతున్న నర్సన్న మాత్రం కలవరపడుతున్నాడు. __ రాజారావు కదిలేలా లేడు.

    మరో అయిదు నిముషాలు గడిచాయి. ఎవ్వరూ ముందుకు రాలేదు నారయ్య మౌనవ్రతం వీడలేదు.

    ఇంకో అయిదు నిముషాలు గడిచేసరికి నర్సన్న కలవర పాటుతో __ "స్వామీ! మిమ్మల్ని నమ్మక మీకాగ్రహం తెప్పించిన ఆ అజ్ఞానిని మీరే బయటపెట్టి __ మీ మౌనవ్రతాన్ని భంగం చేసుకోండి ఎందరో భక్తులు తమ సమస్యలు మీకు చెప్పుకునెందుకు వేచియున్నారు __ ...." అన్నాడు.

    నారయ్య మందహాసం చేశాడు __ "వెర్రివాడా __ వాడిని నేను శిక్షించడమయింది. వాడు కూర్చున్నచోటుకు అంటుకుపోయాడు. రెండు మూడుసార్లు లేవబోయి, లేవలేక మానేశాడు. క్షమార్పణ అడగాలన్నకున్నప్పుడే __ వాడిక్కడి వరకూ నడిచి వచ్చి __ నా దగ్గర మాట్లాడాగల్గుతాడు. ఇప్పుడిప్పుడేవాడిలో పరువర్తన కలిగి __ నామీద నమ్మకం పెరుగుతోంద అడుగో _ లేస్తున్నాడు కూడా __" ఈ మాటలు _ నారయ్య పైకి చూస్తూ అంటూంటే , నర్సన్న ఆతృతగా రాజారావు వంకే చూస్తున్నాడు కానీ, అతడు లేవడానికి ప్రయత్నించడం లేదు. ఈలోగా రాజారావుకు కాస్త దూరంలో ఉన్న  ఓ పోరుగూరి యువకుడు లేచి నారయ్యను సమీపించి __ "మా అమ్మ బలవంతం మీద నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మకం కలిగింది. స్వామి క్షమను కొరుకున్నాను __ ...." అంటూ నారయ్యకు సాష్టాంగ పడ్డాడు.

    "నీవంటి మూర్ఖుల మనసులో జ్ఞానదీపం వెలిగించడమే నా ధ్యేయం. ఇప్పుడు కలిగిన దైవభక్తిని జీవితా౦తం విడనాడకు. వెళ్ళు ...." అన్నాడు నారయ్య. ఆ యువకుడు తిరిగి వెళ్ళి జనంలో కలిశాడు.

    భక్తులందరూ ఏ సంఘటనను  _ ఆశ్చర్యంతో తిలకించారు. కానీ రాజారావు ముఖంలో విజగార్వం కనబడుతోంది. తను నారయ్యను భగవంతుడిగా విశ్వసించలేదు. అయినా తన జోలికి రాలేదతడు. అంటే అతడు తన నిరసన భావాన్ని గుర్తించి ఉండడు. గుర్తించాడంటే ఉపేక్షింస్తున్నాడనుకోవాలి.

    రాజారావు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. తనయితే ఆ యువకుడిలా లేచి క్షపర్పణకోరి ఉండేవాడు కాదు. ప్రశ్నలతో భాగావంతుణ్నీ తికమక పెట్టి ఉండేవాడు. అందుకే   భగవంతు వూరుకున్నాడా ? అయినా తన మహిమను ప్రదర్శించి రాజారావు నోరు కట్టేయవచ్చు. ఈ దేవుడిలా ఎందుకు చేయలేదు?

    అలా ఎందుకు జరగలేదన్న చింత నర్సన్ననూ బాదిస్తోంది. నారయ్య మహిమలనాతడేన్నో చూశాడు. అలాంటి ఓ మహిమ రాజారావు మీద కూడ చూపిస్తే బాగుండునని అతడాశించాడు. ఇప్పుడలా  జరగలేదంటే అందుకు రెండే రెండు కారణాలుండాలి . రాజారావు నిజంగానే నారయ్య భక్తుడై ఉండాలి. లేదా అతడు దేవుడికి కూడా లొంగని మనిషనుకోవాలి. మొదటిది నమ్మడంలో నర్సన్నకు సుఖముందని పిమ్చినా __ రేండోదే నిజమవుతుందని అతడి మనసు భయపెడుతోంది.

    అటుపైన నారయ్య కార్యక్రమం ప్రారంభమయింది. సమస్యలు చెప్పుకునే అవకాశం ముందు పొరుగూరి వారికే యివ్వబడింది. వారిలో ముందుగా ఒకామె లేచి నిలబడి ఏదో చెప్పబోగా, నారయ్య ఆమెను వారించి __ నీ కూతురి పెళ్ళి గురుమ్చేగా నీ బెంగ! త్వరలోనే ఆమె వివాహం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఈపాటికి నీ కూతురు భర్తతో హాయిగా కాపురం చేసుకొంటూ౦టుంది. ఎటొచ్చీ నీ కూతురిలాగే నీక్కాబోయే అల్లుడు కూడా కుంటివాడే అవుతాడు. నీకుతురిలాగే నీక్కాబోయే అల్లుడు కూడా కుంటివాడే అవుతాడు. నీకుతురూరికే కాలు కొంచెం ఎత్తియెత్తి వేస్తుందేమో గానీ __ అతగాడు బాగా కుంటుతాడు. అయితేయెం _ భాగ్యవంతుల బిడ్డ. ఇళ్ళు కదలాల్సిన అవసరమే ఉండడు __ "అన్నాడు నారయ్య.        

 Previous Page Next Page