Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 46

   

    అయితే రాజారావు దేవుడితో ఏవిధంగా గుడి కోలాహలంగా ఉంది.

    ఎదురుగా రెండడుగుల ఎత్తూ, పదడుగుల పొడవూ ఆరడుగుల వెడల్పూ ఉన్న బల్ల వేదికగా వుంది. బల్లమీద బరకాలు పరచి ఉన్నాయి. వాటిమీద భక్తులు కూర్చుని వేదిక పంకె కూతూహలంగా చూస్తూన్నారు.

    వేదికపై నారయ్య అపస్మరిక స్థితిలో ఉన్నాడు అతడి కళ్ళు మూతలు పడ్డాయి. పిడికిళ్ళు బిగిశాయి. పొట్టఎగిరెగిరి పడుతోంది తప్పితే, మనిషిలో మరే చలనమూ లేదు.

    అక్కడ పోరూగురి వాళ్ళో పదిమందిదాకా ఉన్నారు. నారయ్య లేవగానే ప్రశ్నలడగాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

    కొందరు భాగావన్నాను జపం చేస్తూంటే, మరికొందరు మాటిమాటికీ నారయ్యకు నమస్కరించి చెంపలేసుకుంటున్నారు.
   
    పాకకు కాస్త అవతల కొబ్బరికాయలు, అగరొత్తులు ' భక్తులు విసుగ్గా బయటకు వస్తూంటే _ కొందరు కొత్త భక్తులు పాకలోకి వెళ్ళి కూర్చుంటున్నారు.

    ధర్మకర్త నర్సన్న బల్లమీదనే నారయ్య పక్కగా కూర్చుని, అతడి ముఖంలోకి భక్తీభావంతో చూస్తున్నాడు. బల్లకో మూలగా పెద్ద సైజు హుండీ ఉంది.

    హఠాత్తుగా పాకలో చిన్న సైజు కోలాహలం రేగింది. భాగాన్నామ సంకీర్తన రేగిపోయి, గుసగుసలు రేగాయి. పోరుగూరివారు కూతుహలంగా గ్రామస్తుల్నీ ప్రశ్నింస్తున్నారు. అప్పటికింకా నారయ్యకు స్పృహా రాకపోవడంవల్ల __ కోటూహాలానికి కారణమేమితా అని నర్సన్న తన దృష్టిని భక్తకోటి వైపు మళ్ళించాడు.

    నర్సన్న కళ్ళు నిజమేనని నమ్మినా, నమ్మకపోయినా అతడి కెదురుగా నిలబడి నవ్వుతున్నాడు రాజారావు. నర్సన్న తనవైపు చూడగానే, అతడాయనకు నమస్కరించి బరకంమీద కూర్చున్నాడు. పక్కనున్న వాళ్ళు గౌరవభావంతో కాస్త దూరంగా జరిగారు.

    "అయన పేరు రాజారావు. చాల గొప్పవాడు బాగా చదువుకున్నాడు. ఎంతో మంచివాడు. వడ్డీ లేకుండా ఎందరికో అప్పులిచ్చాడు. ఊళ్ళోవాళ్ళకి పైసా పుచ్చుకోకుండా చదువు చెబుతూంటాడు. ఊరి బాగోగుల విషయంలో ప్రెసిడెంటుగారికి సలహాల నిస్తూంటాడు. ఆ మధ్య చలమయ్యనే ఆయన్నేవరో హత్య చేయబోగా __ ప్రాణాలకు తెగించి రక్షించాడు. గరవయ్యనే కుర్రాడి చేత తాగుడు మాన్పించాడు. ఇన్ని చేసినా ఎక్కడా గర్వం కనబడదు. మనిషి వినయ విధేయతలకు పెట్టిందిపేరు. దేవుడు వెలసి ఇన్నాళ్ళయినా ఈయన మాత్రం ఈ రోజే మొదటిసారిక్కడికే వచ్చాడు...."

    పొరుగూరి వాళ్ళకీ సమచారమంతా అంచెలంచేల మీద క్షణాల్లో చేరిపోయింది. ఈలోగా వసంత, నీల వచ్చి __ ఆడవాళ్ళవైపు కూర్చున్నారు.

    "వాళ్ళే _ అతడి సంసారం __"

    గుసగుసలు ఆగిపోయాయి కట్టూ బోట్టూతో అక్కడి వారందరి మధ్యా కొత్తగా అగుపిస్తోందామె. చదువు, సంస్కారంలో తేడా ఉన్నప్పటికీ వసంత అక్కడ కొత్తగా ఫీలవడం లేదు. చాలామంది ఆమెకు తెలిసినవాళ్ళే. అందులో కొందరామె శిష్యురాండ్రూ ఉన్నారు. తనకు తెలిసన వారందరి వంకా చిర్నవ్వు ప్రసరించి ముభావంగా ఉండిపొయిందామె.

    రాజారావు రాక నర్సన్నలో రకరకాల భావాలు రేకెత్తించింది ఎక్కడెక్కడి వాళ్ళూ వచ్చి వెడుతున్న యీ దేవుడి దగ్గరకిన్నాళ్ళకు రాజారావు వచ్చాడు. అతడికి తెలివి, లోకజ్ఞానం , వ్యవహారం దక్షత _ సమపాళ్ళలో ఉన్నాయి. దేవుడంటే నమ్మకం లేదు. రమాకాంతామంటే పడి చస్తాడు. ఇప్పుడిక్కడికి కెందుకొచ్చాడు?

    నర్సన్న ఏకాగ్రత భక్తీ నుంచి రాజారావువైపు మళ్ళింది. నారయ్యలో చలనం కలిగే వరకూ ఎయా ఏకాగ్రతకు భంగం కలగలేదు.

    నారయ్య ముందు పిడికిళ్ళు విప్పాడు. తర్వాత చేతులు కదిపాడు. ఆ తర్వాత కాళ్ళోకసారి విదిలించి లేచి కూర్చున్నాడు. జనమందరూ నిశ్సబ్దంగా అయిపోయారు. అంతా అతడినే చూస్తున్నారు.
   
    నారయ్య కళ్ళింకా విడలేదు. అయితే అందరూ చూస్తుండగా అతడి ముఖాన అప్పటికప్పుడేవరో పేడుతున్నట్ట్లుగా పెద్ద నామాలు వచ్చాయి. భక్తులందరూ __ "గోవిందా!" అంటూ కేకలు పెట్టారు.

    రాజారావు, వసంత కూడా కళ్ళప్పగించి  విచిత్రాన్ని చూశారు. ఆప్రయతనంగా వసంత చేతులు జోడించి నారయ్యకు నమస్కరించింది. అప్పుడామెకు భగవత్సన్నిధిలో ఉన్న అనుభూతి కలిగింది. దేవుడివైపు చూడకుండా __ "గోవిందా!" అంటూ కేకలు పెడుతున్న భక్తకోటి వంక చిత్రంగా చూస్తున్న నీల దృష్టిని కూడా ఆమె నారయ్యవైపు మళ్ళించి __ "దణ్ణం పెట్టుకొమ్మా__" అంది నేమ్మదిగా.

    నీల తనూ నారయ్యకు నమస్కరించింది.
   
    నారయ్య కళ్ళు తెరిచాడు. అతడి కళ్ళు వింతకాంతితో ప్రకాశిస్తున్నాయి. అతడిప్పుడు సామాన్య మానవుడిలా లేడు.

    భక్తులారా !" అన్నాడతడు.

    అ పిలిచిన తీరులో ఒక ప్రత్యేకమయిన ఆకర్షణవుంది. అతడెం చెబుతాడో వినడానికక్కడ చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దం.

    "ఎందరో భక్తులిద్దరికి వచ్చారు. కానీ అందరూ నామీద భక్తీభావంతో రాలేదు. కొందరు తమ సమస్యలకు పరిష్కారం ఆశిస్తున్నారు. కొందరు కోర్కెలు తీర్చమని ప్రార్ధిస్తున్నారు. మీలో చాలామందికింకా ఈ ఇహాలోక సుఖాలపై మమకారం తీరలేదు. అది కేవలం అజ్ఞానం మర్నానంతరం మీరందరూ నన్ను చేరుకోవలసినవారే మీ ఆస్తులూ, గౌరవాలూ మీ కూడ రావు కాబట్టి ఈ అజ్ఞానాంధకారం నుండి మీరందరూ త్వరగా విముక్తి పొందాలని ఆశీర్వదిస్తున్నాను.__" అంటూ నారయ్య తన ఖాళీ చేతుల్లో ఏదో చల్లినట్లుగా అభినంయించాడు. అందరిపైనా అక్షింతలు పడ్డాయి.

    "గోవిందా!" అంటూ ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

    తన తలపై అక్షింతలు చూసుకుంటున్న రాజారావు కేదో కలలో ఉన్నట్లుగా ఉంది అతడిదివరలో మహిమలు చూసిన అనేక స్వాములు గురించి వినిఉన్నాడు. శ్రీ సత్యసాయబాబా గురించి విన్నాడు. వారు చూసే మహిమలు ప్రస్తుత విజ్ఞానానికి అందవు.

 Previous Page Next Page