Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 45

 

      "అయితే __ నా శక్తి ఇంతే!"

    "అప్పుడదేవతతో నాట్యం చేస్తే నూటమదహార్లిచ్చేరు."

    "అది దైవకార్యం కాదు ....."

    ఈ తలతిరుగుడు సమాధానాని కెమెనాలో తెలియక _ "సరే __ మీరేనా ఇవక్కర్లేదు . ఈ రూపాయ తీసేస్కోండి __" అన్నాడు నర్సన్న.

    రాజరావా నోటు తీసేసుకుంటూ __ "తర్వాత నేను చందా ఇవ్వలేదనుకోవద్దు. నేనిస్తే మీరే వద్దాన్నారని గుర్తించుకోండి _" అన్నాడు.

    హఠాత్తుగా నర్సన్న ముఖంలోకి లేనినవ్వు తెచ్చిపెట్టుకుని _ "మీకు డబ్బుకక్కుర్తి లేదని నాకు తెలసు. కానీ ఎందుకో మీరు నాతో వేళకొళామాడుతున్నారు__" అన్నాడు.

    "మీరు వయసులోనూ అనుభవంలోనూ నాకంటే పెద్దవారు. మీతో వేళకోళామాడే కుసంస్కారిని కాదు నేను. నా అభిప్రాయం కావాలంటే వినండి. ఈ రూపాయ తీసేస్కోండి __ " అన్నాడు నర్సన్న.

    రాజరావా నోటు తీసేసుకుంటూ _ "తర్వాత  నేను చందాఇవ్వలేదనవద్దు. నేనిస్తే మీరే వద్దాన్నారని గుర్తించుకొ౦డి __ " అన్నాడు.

    హఠాత్తుగా నర్సన్న ముఖంలోకి లేనినువ్వు తెచ్చిపెట్టుకుని __ "మీకు డబ్బుకక్కుర్తి లేదని నాకుతెలుసు. కానీ ఎందుకో మీరు నాతో వేళవేళామడుతున్నారు__" అన్నాడు.

    "మీరు వయసులోనూ, అనుభవంలోనూ నాకంటే పెద్దవారు. మీతో వేళాకొళామాడే కుసంస్కారమని కాదు నేను. నా అభిప్రాయం  కావాలంటే వినండి. ఈఊళ్ళో ఇప్పటికే మూడు గుళ్ళున్నాయి. ఇవి చాలమన్నట్టు మరికొన్ని వేలు పోసి ఇంకో గుడి కడతారా? మన వేర్రిగానీ _ దేవుడికి డబ్బూ, ఇళ్ళూ కావాలా? మన ఊరి బడి పరిస్థితి చూస్తే నాకు కడుపు తరుక్కుపోతోంది. ఆ ఇరుకు స్థలంలోనే తంటాలుపడి అన్ని క్లాసులూ నడుపుతున్నారు. దేవుడి గుడిబదులు పాఠశాలలో భవనం కట్టిస్తే ఎంత బాగుంటుంది? చందా కావాలంటే అప్పుడు నన్నడగండి _ అందరికంటే ఎవరెక్కువ వేశారో __ వాళ్ళకంటే ఓ వందరూపాయ లేక్కువిస్తాను __" అన్నాడు రాజారావు గంభీరంగా.

    "ఇన్నాళ్ళుగా పరిచయమున్నా __ మీరు నాస్తికులని నాకింతవరకూ తెలియదు ....." అన్నాడు నర్సన్న .

    "భలేవారే _ నాకు దేవుడంటే నమ్మకమూ, భక్తితో పాటు భయం కూడా ఉంది. అందుకే నా మనసుకు నచ్చని పని ఏడీ చెయ్యను సరిగదా, ఎదుటివాడు చేస్తూంటే ప్రోత్సహించాను కూడా. నా మనసుకు నచ్చనివన్నీ భగవంతుడికి నచ్చనవని నా అభిప్రాయ ...." అన్నాడు రాజరావు

    "మంచిది _ వస్తాను మరి!" అంటూ లేచాడు నర్సన్న. ఆ లేవడంలో విసురుంది. ఆ మాట అనడంలో విసుగుంది.

    "మంచిది_" అన్నాడు రాజారావు. అతడి మాటలో నిర్లక్ష్యముంది. అనే తీరులో నిర్భయత్వ\ముంది.

    రాజరావివ్వక పోవచ్చుగాక  _దేవాలయ నిర్మాణానికి చందాల పేరు చెప్పి పదివేలకు పైగా పొగయింది. ఇదికాక నర్సన్నగారి గుడిదగ్గర హుండీలో కూడా కానుకలు దండిగా  పడుతున్నాయి.

    నర్సన్నకివి మంచి రోజులు. నక్సలైట్లు, నారయ్య ధర్మమూ అని అతడు __ నర్సన్న మంచివాదాన్న పేరు తెచ్చుకున్నాడు. నలుగురూ అతడి మాటలు వినే అవకాశం వచ్చింది. నారయ్య దేవుడాయితే, ఆ దేవాలయానికి నర్సన్న ధర్మకర్త తనను ధర్మకర్త నర్సన్నగా ఊరంతా గుర్తించేలా చేసుకున్నాడు. ఆ ఊళ్ళో _ రామకామ్తం ప్రెసిడెంటుయితే __ నర్సన్న ధర్మకర్త. తనకున్న ధర్మచిమ్తననాను చూపడాని కన్నట్లు _ ఊళ్ళో నాలుగయిదు కూడలి స్థలాల్లో అతడు బావురిమ్గులు తీయించి వేయించాడు.

    ఎన్నికలిక రెండే నేలలున్నాయనాగా భగవంతుడి సమక్షంలో నర్సన్న నిర్ణయ౦ ఆయనకు నచ్చలేదు. మానవసేవ మాధవసేవని నీకు తెలియదా అని ఉగ్రరూపంలో ఉరిమాట్ట. నర్సన్న భయపడిపోయి, కళ్ళు మూసుకుని శాంతించమని భగవంతుడ్నీ వేడుకున్నాడు. ప్పుదాయన శాంతించి __ "నీలో నేర్పుగా వ్యవహారాలు నడిపే తెలివుంది. అది నాయక లక్షణం నీనాయకత్వంలో మీ గ్రామాన్ని బాగుచేయి. నీ నేర్పుని నీగ్రామం కోసం వినియోగించు. అప్పుడే నేనూ సంతోషిస్తాను. అలా చూస్తావేం _ ఇంకా అర్ధంకాలేదా _ ఎన్నికల్లో నిలబడు నేను చూస్తావేం ఇంకా అర్ధంకాలేదా ఎన్నికల్లో నిలబడు. నేను నీ అండనఉన్నాను. న అమామూలె నీ ఎన్నిక గుర్తు. విజయం నీదే__" అన్నాడు. నర్సన్న అభ్యంతరం చెబుదామనుకూంటుండగా _ ఇంకేమీ వినకుండా అయన మాయమయ్యాడు.

    నర్సన్న నారయ్య సమక్షంలో నలుగురికీ ఈ విషయం చెప్పి __ తను భగవంతుడికి ఆజ్ఞపై ఎన్నికల్లో నిలబడుతున్నానని ప్రకటించాడు. ఈ ప్రకటన గురించి నారయ్య తన పూనకంలో ఏమీ చెప్పలేదు. అతడు తన మామూలు నీతులే నర్నిమ్చాడు. నర్సన్న అబద్హం చెప్పిఉంటే _ దేవుడు పూనకంలో ఆ మాట ఖండించి ఉండేవాడు కాబట్టి __ అయన అబద్హం చెప్పలేదని అంతా అనుకున్నారు.

    ఈ ప్రకటన ఊళ్ళో పెద్ద సంచలనం కలిగించింది.

    "నర్సన్న తిరుగులేని ఎత్తే వేశాడు __" అనుకున్నాడు రమాకాంతం. నిరాశా నిస్ప్రుహాల మధ్య వ్రేలాడుతున సందర్భంలో ఆశాకిరణంలా రాజారావు ప్రత్యేకంగా ఆయన్నోసారి కలుసుకుని __ "నర్సన్నగారి స్వప్నవ్రుత్తాత్తం విన్నారా?" అన్నాడు.
      
    రాజారావు నవ్వి __ "ఇందులో భాగావన్నిర్ణయమేమీ లేదు. అంతా నర్సన్నగారి తెలివి. ఆయనకు ఎదుటివాళ్ళ మనసులు గ్రహించే తెలివుంది. ఆఖరికి భగవంతుడి మనసుకూడా పెట్టేశాడాయన ...."

    "అంటే ?"

    "అంటే ఏమయినా కానీండి కానీ __ నర్సన్న రాజకీయాలు నాకు నచ్చలేదు. ఈ ఎన్నికల్లో మీరు గెలవాలి. అదీ నా సంకల్పం. ఇది చెప్పడానికే ఇప్పుడిక్కడికివచ్చాను __" అన్నాడు రాజారావు.

    రమాకాంతంలో ఉత్సాహంతో పాటు భయం కూడా కనబడింది__ "రాజారావుగారూ! ఇది దేవుడితో వ్యవహారం. అసలు నా అంతట నేనే రంగం నుంచి తప్పుకోవలనుకుంటున్నాను ......"

    "అలా చేస్తారనే భయపడి ముందుగా మీ యింటి కొచ్చాను. ఇక దేవుడి సంగతంటారా? మీరేం భయపడకండి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కదా __ దేవుణ్ణి దేవుడితోనే ఎదుర్కో౦టాను. ఎన్నికల సంగతి మీరు చూసుకోండి. ఈసారి ఎన్నికల్లో కూడా మళ్ళీ రమాకాంతం గారే ప్రెసిడెంటుతారు. ఇది న మాట . దేవుడి మాటయినా తప్పుతుందేమో కానీ, నా మాట తప్పదు. గుర్తుమ్చికోండి. వస్తాను ...." అంటూ లేచాడు రాజారావు.

    అతడు వెళ్ళిపోతూ౦టే రమాకాంతం గౌరవభావంతో అతడు కనబడేవరకూ చూస్తూ __ "ఇఅతాడు చాలా చిత్రమయిన మనిషి!" అనుకున్నాడు.

    తన పంచప్రాణాలూ పదవిలో ఉన్నాయి. ఈ దెబ్బతో పంచప్రాణాలూ పోయాయనే అనుకున్నాడాయన. ఇప్పుడు రాజరావన్న మాటలతో తిరిగి ఆయనలో ధైర్యం వచ్చింది. "నా పదవి నాకే ఉంటుంది_" అనుకున్నాడాయన నమ్మకంగా.

 Previous Page Next Page