నెలరోజుల్లో నారయ్య గురించిన వార్తా చుట్టుపక్కల ఊళ్ళలో కూడా పాకింది. అనేక ప్రదేశాల నుండి భక్తులా ఊరికి రాసాగారు. దీంతో నర్సన్నగారి పాక __ నర్సన్న గారి గుడిగా వ్యవహరించబడసాగింది.
ఊళ్ళోని ఒక్కొక్కరే భక్తులుగా మారిపోతున్నారు. ఇది రాజారావు నాశ్చర్యపరచింది. అతడు నాస్తికుడు కాదు. కానీ రాజారావు నాశ్చర్యపరిచింది.అతడు నాస్తికుడు కాదు. కానీ దేవుడికొకప్రత్యేకమయిన పేరుంటు౦దనీ __ ఆ దేవుడు అప్పుడప్పుడు మనుష్యుల నావహిస్తూ౦టాడనీ నమ్మలేడతడు. నారయ్యను వూనుతున్న దేవుడు తన పేరు వెంకటేశ్వర స్వామి అని చెప్పాడుట. అంటే ఆపేరుతో భగవంతుడోకడున్నాడన్నమాట. అంతకు కొన్నాల్లాక్రితం _ గుంటూరు జిలాలో ఏదో గ్రామంలో ఒక మనిషికి దేవుడు పూనుతున్నట్లు _ రాజారావు పేపర్లో చదివాడు. అ దేవుడు తనపేరు సత్యనారాయణస్వామి అని చెప్పాడుట.
మన పురాణగాధలు యదార్దాలా అన్న వాదం ఇంకా నినసగుతూనే ఉంది. ప్రజలను నైతిక పతనం నుంచి కాసాడ్డానికా కథలు సృష్టించబడ్డాయని కొందరంటారు. ఏది ఏమయినా భగవంతుడే వాడికి ప్రత్యెక రూపమున్నదనీ _ ఆయనకు భగవంతుడనే వాడికి ప్రత్యెక రూపమున్నదనీ __ ఆయనకు రకరకాల అంశంలలో రకరకాల పేర్లూ రకరకాల సంసారాలూ ఉన్నాయంటే __ తరకిక దృష్టి కలవాడికి నమ్మడం కష్టం.
భగవంతుడికి ప్రత్యేకమయిన ఆకారం లేదు. సృష్టిలోని ప్రతి అణువూ అయన ప్రతిబింబం. తన ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం అయన ప్రతిబింబం. తన ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం అయన ప్రత్యేకించి ఎవరినీ కోరడు. భగవంతుడు. స్వయంగా వచ్చి నీతిబోధలు చేయనవసరంలేదు. మనుష్యుల్లో పరివర్తన తీసుకురావడానికి సామాన్యుళవలంభించే పద్దతిఅది. ఇంత సృష్టిచేసిన భగవంతుడు. _ ఆషామాన్యుడు. సంకల్పమాత్రాన ఏమయినా సాధించగలడ. ఇవీ రాజారావుకు భగవంతుడిపై ఉన్న కొన్ని అభిప్రాయాలు.
నారయ్య ప్రవర్తన సామాన్య మానవుడివలెనే ఉంది. మాటతీరు కూడా ఏమీ మారలేదు. అదీకాక అతడు _ అరిషడ్వర్గాలను కూడా జయించలేదు. ఎవడయినాతిక్క సందేహలగితే __ అతడిని పూనిన దేవుడిక్కోపం వస్తోంది. నారయ్య చెప్పే నీతుల్లో కొత్తదనం లేదు. అవి మనం పురాణాల్లో చదివాం. పాఠాల్లో చదువుతున్నాం. అనేకులు గొప్పవాళ్ళు చెప్పారు.
"మీరు మీ తల్లితండ్రులను పూజించండి. వారిని మించిన దైవం మరొకరు లేరు. వాళ్ళనుఅలక్ష్యం చేసి, నరకానికి దగ్గర కాకండి __"
"తోటివాడికి సాయపడితే _ అది దేవుడి పూజకు మించిన ఫలితాన్నిస్తుంది __"
"జీవితం తిని తిరగడానికి కాదు. లక్ష్యసాధనకు. లక్ష్యంమంచిదయితే _ ఫలితంతో నిమిత్తంలేదు __"
"మీరు చేసే ప్రతి పపాన్నీ నేను వేయికళ్ళతో కనిపెడుతున్నాను. నాకు లంచమిచ్చి పాపం కడిగేసుకున్నామని భ్రమపడకండి. చేసిన పాపానికి శిక్ష తప్పదు. అందుకే పాపాలు చేయకండి __"
"ఎన్ని కష్టాలేదురయినా నామీద నమ్మకముంచి ధైర్యంగా ఎదుర్కో౦డి.నన్ను నమ్మనివాళ్ళు అధోగతి పాలవుతారు...."
ఈ ధోరణీలో నడుస్తాయి. నారయ్య నీతులు. ఇవి ఆచరించదగ్గవే కానీ __ వీటిని ప్రచారం చేయాలని దేవుడు నారయ్యకు పూనాలా?
ఎవరూ అడక్కుండానే నారయ్య దీనికి బదులిస్తున్నాడు. __ "ప్రపంచంలో పాపం నానాటికీ పెరిగిపోతోంది. ప్రజల్లో భగవంతుడిపై విశ్వాసం క్రమంగా తగ్గిపోతోంది. ప్రజల్లో విశ్వాసాన్ని పున: ప్రతిష్టించడానికై నేనిలా అనేక చోట్ల మనుష్యుల్నా వహిస్తూ ఉన్నాను. ఆయా ప్రజల విశ్వాసాలనుబట్టి ఆయా పేర్లను ధరిస్తున్నాను తప్పితే నిజానికి నాకే పేరూ లేదు. నేనే భగవంతుడినన్న నమ్మకం ప్రజల్లోకలగాలి కాబట్టి మహిమలు చేస్తున్నాను. నేను చేసే మహిమలు మానవులకు సాధ్యంకావు .... "
ఈ సమాధానం బాగానే ఉంది. ఊరంతా నారయ్యదైవత్వాన్ని నమ్ముతోంది. కానీ రాజారావుకిది ఏదోలాగుంది. అయితే ఒక విషయమతడూ అంగీకరించాడు. నారయ్య సామాన్యుడు, అమాయకుడు. తొలిసారి దేవుడు పూనేముందు రోజు వరకూ కూడా అతడు మామూలుగానే ఉన్నాడని ఎరిగున్న వాళ్ళు చెప్పారు. కాబట్టి నలుగురూ అనుకునే క్షుద్ర దేవతారాదన అతడు చేసిఉండడు. పైగా అతడి దైవత్వం ఊరివాళ్ళకు హాని చేయడంలేదు. అలాగని ప్రత్యేకించి ఎవరికీ మేలూ చేయడంలేదు.
నారయ్య పలికుబడి నానాటికీ పెరుగుతున్ననడానికి సూచనగా గుడి వెలసిన ఆరు వారాల్లో _ గుడి పక్కనే రెండు భోజన హోటళ్ళు కొత్తగా వచ్చాయి.
మనదేశంలోని ప్రజలది మూడభక్తి. తాము నమ్మేదేవుడిని నిందించినా, అనుమానించినా పట్ల్నాల్లోన్నే జనం క్షమించరు. పల్లె విషయం చెప్పనవసరంలేదు. అందుకే నారయ్య విషయంలో కలగజేసుకుని, తన కేర్పడిన గౌరవాన్ని పోగొట్టుకోకూడదని రాజారావు నిశ్చయించుకున్నాడు. కానీ భగవంతుడి రాజకీయ ప్రవేశంతో అతడి పరిస్థితి ఇరుకున పడింది.
పాపం - ఈ విషయంలో నారయ్యది కానీ, అతడి నావహించిన భగవంతుడిది కానీ తప్పులేదు. అసలా మాట కొస్తే _ తప్పేవరిదీ కాదు .....
నారయ్య తనకు దూరపు బంధువు కావడాన్నాసరాగా చేసుకుని _ నర్సన్న అతడి భక్తులతో అగ్రగణ్యుడయ్యాడు అతడి వేషధారుణ కూడా అమ్డుకనుకూలంగా మారిపోయింది.
ఒకరోజున భక్తీపారవశ్యంతో _ తన జీవితాన్నంతా ఇకమీదుట దైవసాన్నిధ్యంలోనే గదిపెస్తానని నర్సన్న అందరి ముందూ ప్రకటించాడు. రాజకీయాల నుంచి కూడా తను విరమించుకున్నట్లు ప్రకటించాడతడు.
ఈ వార్త ఊరందర్నీ కలిలించింది. నారయ్య మహిమకీడో పెద్ద తార్కాణమయింది తిరుగులేని ప్రత్యర్ధి ఎన్నికల నుంచి విరమించుకోవడంతో రమాకాంతానికికూడా నారయ్య మీద గురి, గౌరవభావం కలిగాయి.
జీవితాన్ని భగవంతుడిసేవ కంకితం చేసిన నర్సన్న తన మొదటి కార్యక్రమంగా ఊళ్ళో దేవుడికొక గుడి కట్టించాలన్నాడు. ఈ నిర్ణయం వెంటనే ప్రయోజమోదాన్ని పొందింది. స్థలం నర్సన్న దానం చేశాడు. ఇక గుడి కట్టడానికి చందాలు కావాలి. ఊళ్ళో అంతా బాగానే ఇచ్చారు. కానీ, రాజారావు మాత్రం ఒకే ఒక్క రూపాయిచ్చాడు.
నర్సన్న తెల్లబోయి _ "ఇదేంటండీ __ ఇదేమన్నా ముష్టిఅనుకున్నారా _ ఒక్క రూపాయిచ్చారు.!" అన్నాడు నిష్టూరంగా.
"ఇంతివ్వాలని మీరు నాకు చెప్పలేదు __" అన్నాడు రాజారావు.
"చెప్పాలిటండీ __ దైవకార్యంలో ఎవరి శక్తిని బట్టి వారికివ్వాలి....."