అబ్బే _ ఏమీ లేదు.. . పెదప్రజలపై సానుభూతి వల్ల మీరు సంపాదించేదానిలో కొంత _ సేవా సంస్థలకు విరాళంగా ఇస్తూంటారను కంటున్నాను. అందువల్లనే _ సంపాదనకు మీరు నాట్యమొక్కటే కాక, ఇతర మార్గాలుకూడా అవలంబిస్తున్నారాను కుంటాను....." అన్నాడు రాజారావు నర్మగర్భంగా.
లీలాసుందరి ముఖం ఎర్రబడింది._ "మీ అభిప్రాయం నాకంత బాగా అర్ధంకాలేదు కానీ నా అనాత్యం కేవలం దీన జనోద్దరణకే ఉద్దేశించబడినది...."
"ఆ విషయం మీరిదివరలో చెప్పిఉండలేదు. లేకుంటే నేను మీకు మరో నూటపదహార్లూ చదివించి ఉండేవాడ్ని. దీనజనోద్దణలో నాకూ ఉత్సాహముంది_" అన్నాడు రాజారావు.
ఎందుకో లేలాసుందరి తడబడింది. __ "మాటల సందర్భంలో నోరు జారాను.దయుంచి ఈ నిజం ఎవరికీ చేపోద్దు. నలుగురికీ ఈ విషయం తెలియడం నాకిష్టంలేదు. నన్ను మామూలు నర్తకిగానే అందర్నీ బావించనీయండి....."
"దానికేముంది? రహస్యాలు దకాహడం నాకు బాగా అలవాటు. ఎటోచ్చీ మా గరవయ్య ...."
లేలాసుమ్దరి తన చేతిని గరవయ్యవైపు సాచి _"యీ విషయమిమ్కేవరికీ చెప్పానని ఓటేయండి ...." అంది.
గరవయ్య కుసుమ కొమలమయిన ఆమె చేతివంకే చూస్తూ _ ఆమెను టాకడానికే తటపటాయించాడు.
"వెయ్యరూ?" అంది లీలాసుందరి జాలిగా అతడివంక చూస్తూ.
ఆమె చూపులు గరవయ్యకొక అపూర్వమయిన వరం. ఆ క్షణంలో ఆమె ఆత్మహత్య చేసుకోమని శాసిమ్చినా వినేలాగున్నాడతడు. అతడామె చేతిలో చేయివేసి _ "ఈ విషయమింకెవ్వరికీ చెప్పను" అన్నాడు.
లీలాసుందరి అతడి చేతినోసారి మృదువుగా నొక్కివదిలింది. అప్పుడు గరవయ్య శరీరం పొందిన అనుభూతి కొన్ని సంవత్సరాలకు సరిపడ్డది.
"మీ అంతట మీరే వస్తానని ,మా యింటికి బోజనానికి వచ్చారు. మీవంటి కళాకారిణికి అతిథ్యమిచ్చే అవకాశం రావడం మా అదృష్టం _" అంది వసంత.
"ఆమె కేవలం కళాకారుణ్ణి కాదు. గొప్ప మానవతావాది _" అన్నాడు రాజారావు.
ఆ పొగడ్తకు లీలాసుందరి ముఖారవిందం మందార మయింది. ఆమె వసంతతో _ మీ యిల్లు చూస్తాను ...." అంది.
"మా వాటా నేను చూపిస్తాను . మిగతాది నా తమ్ముడు చూపిస్తాడు" అంది వసంత.
లీలాసుందరి లేచింది. అప్పుడామే మానస సరోవరం నుండి లేచిన హంసలా ఉంది. ఆమె వసంతతో కలసి వెళ్ళిపోగానే _ "రాత్రి లీలాసుందరి మీ యింటికొస్తుంది. నన్ను పిలుస్తావా?" అన్నాడు రాజారావు గరవయ్యతో.
"ఆమె మా యింటికొస్తుందని నాకు తెలియదు. కానీ తనొస్తే _ మిమ్మల్నేందుకూ పిలవడం?" అన్నాడు గరవయ్య.
"మరి నేను పిలిచేనుగా?" అంటూ తమాషాగా నవ్వడు రాజారావు.
గరవయ్యకు సమాధానం తోచలేదు.
23
లేలాసుందరి వెళ్ళిపోయాక, ఇంట్లో ఒక్కడూ కూర్చుని తీవ్రంగా అలోచించసాగాడు గరవయ్య.
ఆమెకు అందం, తెలివి ఉన్నాయి. మంచి నర్తకి ఆపైన మగవాడికి చూపులతోనే మత్తేక్కించగల సామర్ధ్యముంది. అటువంటి యువతి అనుభవానికి దొరికితే _ జీవితానికి సార్ధకత లభిస్తుంది.
తన జీవితం సారధకమవుతుందా?
రాత్రి ఆమె తన ఇంటికి వస్తోంది. ఇది తనకు మంచి అవకాశం. ఆమె వస్తున్నది తనను కలుసుకోవడానిక్కాదు.
తండ్రి ఆమె నాహ్వానించడానీ, ఆమె అతడి ఆహ్వానాన్ని మన్నించిందనీగరవయ్యకు తెలుసు. కానీ తండ్రి వృద్దుడు. ఆమెతో ఏం మాట్లాడతాడు?
ఏం మాట్లాడతాడో గరవయ్యకు తెలియదు. కానీ ఇంటి మందువానానుకునిఉన్న గది ఒకటి చలమయ్యకేప్రత్యెకమనీ, అందులో ఇతరులకు ప్రవేశంలేదనీ గరవయ్యకు తెలుసు. కూలి డబ్బులు వసూలు చేసుకునే నెపంతో వచ్చిన అడమనుశులూ గదిలోకి వెళ్ళడం, తండ్రి వాళ్ళతో తలుపులు వేసుకుని మాట్లాడడం అతడికి తెలుసు. అదతడుబయటి వారెవ్వరికీ చెప్పుకోలేని రహస్యం. ఈ విషయంలో అతడి అనుమానా లేమయినప్పటికీ _ తల్లి వహించే మౌనం అతడి అనుమానా లేమయినప్పటికీ _ తల్లి వహించే మౌనం అతడి కాశ్చర్య కారణం.
ఆ గది శుభ్రం చేయవలసిందిగా చలమయ్య భార్యా కారోజుదయం చెప్పాడు. అది గరవయ్య విన్నాడు.
సందేహంలేదు లీలాసుందరితో మాట్లాడ్డానికిచలమయ్య ఆ గదినే ఎంచుకున్నాడు. కానీ ... కానీ....
లీలాసుందరి అటువంటిదేనా?
మనిషిని చూడగానే ఉద్రేకం పడుతుంది. కానీ ఆమె అటువంటిదనీ అనిపించదు అయితే చలమయ్య తెలివితక్కువ వాడు కాదు అతడామెను పిలిచాడు. ఆ గడిలోకే ఆహ్వానించబోతున్నాడు ఒకవేళ ఆమె అటువంటిది కాకపోతే _ ఈరోజు నుంచి ఆమె జీవితం మారుతుంది.
చలమయ్య ఎవరికయినా తనకు అనుకూలంగా మార్చు కోగలడు అయితే ఆయనిప్పుడు వృద్ధుడు.....
లీలాసుందరి కోరి తనంత తానుగా ఇక్కడకు వస్తోంది. ఎందరో ఆహ్వానించగా ఆమె ఈ యిల్లెన్నుకుందంటే _ ఒక వేళ తనకోసమే ఏమో! అలా అనుకోగానే _ ఒత్తేసినప్పుడామే మృదువుగా తన చేతిని నొక్కివదలడం గుర్తుకొచ్చిందతడకి. అస్పర్శ ఎంత హాయిగా ఉంది!
ఆమెను ఏదోవిధంగా తను కలుసుకోగలడు. ప్రయత్నిస్తే తండ్రి కళ్ళుగప్పడం గరవయ్య కసాధ్యం కాదు. కానీ, అమ్తముందే ఆమె అంతర్యమేమిటోతెలుస్కోవడంఅవసరం .....
అప్పుడు గరవయ్యకు సుదర్శనం గుర్తుకొచ్చాడు.
నిన్ననే లీలాసుందరి సుదర్శనానికి కలుసుకుంది. ఆమె గురించి అతడికి చాలా విషయాలు తెలుసుండాలి.
"అరె __ ఈ ఆలోచన ముందే తట్టిఉంటే ఎంత బాగుండేది?" అనుకున్నాడు గరవయ్య. అనుకుంటూనే అతడోసారిచేతిగడియారం వంక చూసుకున్నాడు.
అప్పుడు రాత్రి ఎనిమిదిన్నరయింది.
గరవయ్య లేచి _ త్వరత్వరగా సుదర్శనం ఇళ్ళు చేరుకున్నాడు.
ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంది. సుదర్శనం ఇంట్లో దీపాలు వేలగడంలేదు. గరవయ్య ఇంటి తలుపుతట్టి _ "సుదర్శనంగారూ, సుదర్శనంగారూ!" అంటూ పిలిచాడు. లోపల్నుదెవరూ పలకలేదు. నాలుగయిదుసార్లు పిలిచి, చిరాగ్గా తలుపు గుంజబోయిన గరవయ్య ఉలిక్కిపడ్డాడు.
తలుపు తాళంవేసి ఉంది. ఆ తాళంకప్పులో ఓ చీటీ గుచ్చి ఉంది.