Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 33

   

   గరవయ్య ముఖం ఎర్రబడింది. లేనని సూచిస్తూ తల అడ్డంగా ఊపాడు. అతడి ముఖంలోని ఎరుపుక్కారణం కోపం కాదు. లీలాసుందరి అతడి ఆలోచనల నాక్రమించుకుంది. ఆమె నేలా పలకరించాలో, ఆమెతో ఎలా ప్రవర్తించాలో మనసులోనే రిహార్సల్సు వేసుకోసాగేడతడు.

    రాజారావతడని ఎక్కువగా మాట్లాడించలేదు. ఇళ్ళు చేరాక మాత్రం __ "మరచిపోయి ఇంట్లో భోంచేశావు కానుక. పదకొండయ్యె సరికల్లా మా ఇంటికి రావాలి. నీ అక్క ఎదురు చూస్తుంటుంది __" అని గుర్తుచేశాడు గరవయ్యకు.

    గరవయ్య తలూపాడు . తరవాత ఎవరి వతాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.

                                              22

    "మీ వంట అద్భుతం __" అంది లీలాసుందరి.

    "నేనూ అదే ఆదాంమనుకుంటున్నాను __" అన్నాడు గరవయ్య.

    "అందమయిన ఆడపిల్లలు ఏమంటే అదే అనాలనుకుంటాడు నా తమ్ముడు _" అంది వసంత.

    గరవయ్యకు కోపం వచ్చినా బయటపడకుండా ......_ "సన్నాట పట్టించడం _ ఈ దంపలిద్దరికీ అదో సరదా _ ...." అన్నాడు.

    వాళ్ళు మీతో వరస కలుపుతుంటే _ మీరు వాళ్ళని ఎవరో దంపతులనడం బాగోలేదు ...." అంది లీలా సుందరి.

    ఆమెకు జవాబివ్వడానికి గరవయ్యకు ధైర్యం చాలక _ నీళ్ళు నములుతూ తలవంచుకున్నాడు.

    లీలాసుందరి మళ్ళీ _ "మిమ్మల్ని కలుసుకున్న౦దుకు నాకు చాలా సంతోషంగా ఉంది గరవయ్యగారూ! మీవంటి ఆరోగ్యవంతులయిన పల్లె యువకులే రేపు దేశాన్ని బాగుచేయాలి. ఇంతకీ మీరేం చేస్తూంటారు?" అంది గరవయ్య నుద్దేశించి.

    ఏం చెప్పాలో తోచలేదు గరవయ్యకు. అతడు తట పటాయిసస్తూండడం గమనించి రాజరావే సమాధాన మిచ్చాడు _ 'ఊళ్ళోకల్లా మోతుబరి చలమయ్య కొడుకుని ఏం చేస్తున్నానని అడిగితె ఏం చెబుతాను చెప్పండి. నన్నడిగితే నేను చెబుతాను ఇతగాడికి చదువుకోవాలనుంది కానీ మన పరీక్షల  సంప్రదాయం ఇతగాడికి సరిపడలేదు. అందువల్ల మెట్రిక్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. దురాలవాట్లేమీ లేవు. ఊరిని బాగుచేయాలనే తాపత్రయముంది. తను సంఘసేవ చేస్తూంటాడు...."

    లీలాసుందరి  కళ్ళు పెద్దవయ్యాయి ఆమె అభినందన పూర్వకంగా గరవయ్య వంకే చూస్తూ __ "దేశంలో గర్వపడాల్సిన యువకుడు మీరు. మెట్రిక్ ఫెయిలయి కావడం మీ తప్పు కాదు. మన విద్యా విధానంలో లోపముంది. అన్ని సబ్జక్టు ల్లోనూ అరవై వచ్చినవాడు, లెక్కల్లో ఒకే ఒక్క మార్కు తక్కువోచ్చి పరీక్షలో ఫేలాయివుతున్నాడు. లెక్కలతో సహా అన్నింట్లోనూ ముప్పహి వచ్చినవాడు, అతడ్ని దాటి వెళ్ళిపోతున్నాడు అభిలాషనుబట్టి చదువుకాదు, చదువును  బట్టి అభిలాష. తెలితెతలను బట్టి మార్కులు కాదు, జ్ఞాపక శక్తిని బట్టి మార్కులు ఈ విద్యావిధానం నశిస్తేగానీ దేశం బాగుపడదు. యువతరంలో చేవను చంపెస్తుందీ విధానం _" అంది.

    గరవయ్యకు రాజారావుపై కృతజ్ఞతాభావం, లీలా సుందరి తన్ను పోగిడినందుకుగర్వం కలిగాయి. కానీ ఆమె విద్యావిధానంపై చేసిన విమర్శ అతడికర్ధం కాలేదు. లీలా సుందరి మాట్లాడుతున్నప్పుడావేశంలో ఆమె పెదవులదురుతూంటే, అతడికి చూడ్డానికి మనోహరంగా ఉంది.

    నాట్య ప్రదర్శలివ్వడానికి కొచ్చిన లీలాసుందరి ఇలా ఆవేశంగా విద్యావిధానం గురించి మాట్లాడుతుందని రాజారావనుకోలేదు _ "అయితే విద్యావిధానం ఎలాగుండాలని మీ అభిప్రాయం?" అన్నాడతడు.

    "నిరుధ్యోగుల్ని తయారుచేయకుండా ఉండాలి. ప్రజల్లో బానిస భావాల్ని పెంపొందించకుండా ఉండాలి. తెలివితేటల్ని, జిజ్ఞాసనూ చంపేసి మనిషిల్ని మరలుగా మార్చకుండా ఉండాలి. ధనికవర్గపు రాక్షసత్వాన్ని ప్రజలకు తెలియజెప్పి _ ఆ రాక్షసలను అనగాద్రోక్కే ధైర్యాన్నిచ్చేలా ఉండాలి __" అంది లీలాసుందరి మరింతగా అవేశపడుతూ.

    "ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి! ఆచరణలో వీలయితే చూద్దాం....." అంది వసంత.

    "నేను చెప్పి ప్రయోజనంలేదు. ఇప్పుడు నడుస్తున్న పరిపాలనా విధానం మారితే తప్ప _ విద్యావిధానం మారదు _ మారలేదు ...."

    "అంటే?"

    "మనకసలు ప్రజాస్వామ్యం పనికిరాదు. అసలు ప్రజలకేం తెలుసుకుని ఓటు హక్కిచ్చారు? అది వారికి ఆపాత్ర దానంగా లభించింది. అందువల్లనే దేశానికి అపాత్రులు నాయుకులవుతున్నారు. నాయుకులై కార్లలో దేశంలో తిరుగుతున్నారు. విమానాల్లో విదేశ పర్యటనలు చేస్తున్నారు. అలా పర్యటనలు చేస్తూ _ దేశం ముందుకు వెళ్ళిపోతోందంటున్నారు.నెలకు వంద తెచ్చుకునేవాడి జీతం నూటయాభై అవుతోంది కానీ, పావలా బియ్యం రూపాయవుతోంది. మళ్ళీ జీతం పెరుగుతుంది. ధరలింకాపెరుగుతాయి. నాయకులు ముందుకు పోతున్నామంటారు. మనకసలు ముందుదారే కనిపించదు. చదువుకున్న వాళ్ళకుధ్యోగ్గాల్లేవు, పనిచేసే వాళ్ళకు పని లేదు. శ్రమపడే రైతుకి కానీ మిగలదు. ఇదంతా అపాత్రులకు నాయకత్వం కట్టబెట్టడం వల్ల, ఆ ఆపాత్ర్తులు నాయకు లేలా గౌతున్నారు ?  పున్నేమూ ఎరుగని అమాయుకులు ఓట౦టే  ఏమిటో తెలియకుండా ఓటు వెయడమే! అందుకే ప్రజాస్వామ్యం నశించాలి. వ్యక్తిస్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఉండకూడదు. దేశంలో ఎవరికీ స్వంత ఆస్తి ఉండకూడదు. స్వంతమన్న దేదీ ఉండకూడదు. అంతా ప్రభుత్వానికే చెందుతుంది. శ్రమనుబట్టి ప్రతి వాడికీ ప్రభుత్వమే ప్రతిప్జలమిస్తుంది. పని చేయనిలేని సోమరిపోతూ తిండికి కూడా మాది చావాలి. ప్రభుత్వాన్నే ధరించినవాడు తుఫాకి గుండుకు బలి కావాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. నిజానికి మన దేశంలో ఉన్న సంపదంతా ఒకచోట పోగేస్తే _ మదరికీ తిండి ఉంటుంది....."

    "మీ అభిప్రాయంలో మనిషికి కడుపునిండా తిండి ఉంటే సరిపోతుంది. తిండితో సరి పెట్టుకునే మాటయితే మనిషికీ, జంతువుకీ తేడా ఏమీలేదు. మనిషికి ముఖ్యమయినది స్వేచ్చ మీరు కోరుకున్నది. నియంతత్వం....." అంది వసంత.

    "లీలాసుందరి నవ్వింది _ "మీరు చాలా బాగా చెప్పారు . నియంతృత్వంలో వ్యక్తి స్వాతంత్య్రంముండదు. ఒప్పుకున్నాను. కాని మన దేశంలో ఒక్కడు కాదు, లక్షలాడి నియంతలున్నారు. ధనిక వర్గానికి చెందిన ఈ నియమతల చేతుల్లో బానిసత్వం అనుభవిస్తూ, జంతువుల్లా జీవిస్తున్న కోట్లాది ప్రజలకు _ ఇంతమందికి బదులు _ ఒక్కడే నియంత..... అనగా అదే ప్రభుత్వం ... అదీ సర్వమానవ సమాననత్వాన్ని కోరే ప్రభుత్వం ... ఉండదు మంచిది కదూ!"

    "మీరు సామాన్యనర్తకి అనుకున్నారు. మీమాటలువింటూ౦టే _ " అన్నాడు రాజరావున్నట్లుండి

    "అంటే ? అంది లీలాసుందరి ఉలిక్కిపడి.

 Previous Page Next Page