Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 35

  

      సుదర్శనమే ఆ చీటీ పేట్టి ఉంటాడని గ్రహించాడు గరవయ్య. ఎవరినుద్దేశించి ఆ చీటీ పెట్టబడిందో తెలుసు కోవాలని అతడిదితీసుకుని, బయట దీపం వెలుగులో అందులో ఏముందో చదివాడు.

    "అనుకోకుండా ప్రయాణం కవలసోచ్చింది రేపటికి తిరిగొచ్చేస్తాను _

                                                                                                                       సుదర్శనం __" 

    హీకతిలోని విశేషం చిత్రంగా తోచింది గరవయ్యకు. సుదర్శనానికి అంత అనుకొని ప్రయాణ మేమొచ్చింది? ప్రయాణమయితే ఇంటికి తాలమెందుకు? ఇంట్లో వంటమనిషేమైంది? ఇద్దరూ కలిసే ప్రయాణమై వెళ్ళారా?

    ఏ ప్రశ్నకూ సరయిన సమాధానం తోచలేదు. గవరయ్యకు కానీ ఏదో తమాషా జరిగిందనిపించింది. తిరిగి ఆ చీతిని తాళంకప్పులో గుచ్చడానికి లోనికి వెళ్ళాడు గవరయ్య ఆ పని చేసి బయటకు వచ్చేసరికి, రోడ్డుమీద రాజారావు తగిలాడు.

    గురువుగారి  దగ్గర్నుంచిలాగుందే!_ దాహం [పుచ్చుకుని వస్తున్నావా?" అన్నాడు రాజారావు.

    "అవును. నాకూ ఆశ్చర్యంగానే ఉంది. పిడుగులు మీద పడ్డా ఊరోదలి వెళ్ళడు నా గురువు ...." అన్నాడు గరవయ్య.

    "అలాగయితే ఇప్పుడూ నీ గురువూళ్ళోనే ఉండుంటాడు. ఊళ్ళోనే కాదు __ ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఏదో కొత్త పిట్ట దొరికుంటుంది. ఏకాంతం కోసం వీధి గుమ్మానికి తాళమేసి, దొడ్డి గుమ్మాన యింతలో దూరుంటాడు. నమ్మకం కోసం తాళంకప్పులో ఓ చీటీ కూడా పెట్టివుంటాడు...." అన్నాడు రాజారావు వేళాకోళంగా.

    "అరే _ నిజంగా మీరు చెప్పినట్టే తాళంకప్పులో చీటీ పెట్టి ఉంది. ఒక వేళ మీరన్నదే నిజమేనేమో __ కానీ ఇంట్లో ఎక్కడా దీపాలు లేవ్ !" అన్నాడు గరవయ్య.

    "కొందరు చీకటినే కోరుకుంటారు. అలాంటి వాళ్ళు వెలుగును భరించలేరు. మీ గురువులాంటి వాళ్ళలో అగ్రగణ్యుడు. పాపం ఏం పాతాల కోసమని వెడుతున్నావో _ కలుసుకుని రావడమే మంచిది నీకు __" వెటకారంగా అని ముందడుగు వేశాడు రాజారావు.

    అప్పటికి టైము తొమ్మిదియింది. ఆ ఊళ్ళో సాదారణంగా ఎనిమిది దాటేసరికే అంతా నిద్రపోతారు. తోమ్మిదయ్యేసరికి వీధులన్నీ నిర్మానుష్యమయిపోతాయి. కూతురు నీలకు _ ఉన్నట్లుండి విరోచనాలు ప్రారంభంకావడంతో _ రాజారావు మందుల దుకాణానికి వెళ్ళి బలవంతంగా వాళ్ళను లేపి మందులు కొనుక్కుని వస్తూండగా, అనుకోకుండా గరవయ్య కలిశాడు గరవయ్యతో తన మామూలుధోరణీలో మాట్లాడి ముందడుగు వేశాడు. అయినప్పటికీ గరవయ్యకు రాజారావు మాటల్లో నిజముండవచ్చు ననిపించి, సుదర్శనం ఇంటి దొడ్డి గుమ్మ౦వైపు వెళ్ళాడు.

    రాజారావుకు ఇల్లింక పదడుగుల దూరంలో ఉందనగా గరవయ్య గొంతు వినపడింది.

    "రాజారావుకుగారూ _ ఒక్కసారి ఆగండి ...."

    రాజారావు ఆగాడు. గరవయ్య అతణ్ణి సమీపించి ఆగాడు. మనిషి బాగా పరుగెత్తిన వాడిలా ఆయాసపడుతున్నాడు. ముఖంలో కంగారు ....

    "ఎందుకో కంగారు పడుతున్నట్లున్నావు.... ఏమైంది?" అన్నాడు రాజారావు కుతూహలంగా.

    ఏదో చెప్పాలనుకున్న గరవయ్యకు కాసేపు నొరమాట రాలేదు. కాసేపటికి తమాయించుకుని __"మీరు చెప్పినట్లే సుదర్శనంగారి దొడ్డిగుమ్మం వైపు వెళ్ళాను. లోపల్నుంచి ఎవరిదో మూలుగు నెమ్మదిగా వినిపిస్తోంది. గొంతును బట్టి మంసైహి ఆడదయుండవచ్చుననిపించింది. బహుశా సుదర్శనంగారి వంట మనిషేమో! ఎందుకు మూలుగుతోందో తెలుసుకోవలనుకునేలోగా, నాకీ కాగితం కనబడింది. ఇది సరిగ్గా గుమ్మం దగ్గరుంది. ఎగిరి పోకుండా ఎవరో దీనిమీద ఓ ఇటిక పెట్టారు. ఈ కాగితం చూసేసరికి నాకు చాలా భయమేసింది _-" అంటూ ఆ కాగితం రాజారావుకందించాడు

    రాజారావది చూసి ఉలిక్కిపడ్డాడు. దానిమీద అప్పటి  చైనా అధ్యక్షుడు బొమ్మ ఉంది. కొన్ని మావోసూక్తులు రాసి ఉన్నాయి. అక్షరాలన్నీ ఎర్రగా రక్తంతో రాసినట్లున్నాయి.

    "ఈ అక్షరాలూ చీకట్లో కూడా ఎర్రగా మెరుస్తూ కనబడ్డాయి. అవి రక్తతోనే రాశారు. ఆ రక్తం ఎక్కడిదంటారు.? ఇదంతా ఏమిటి?' అన్నాడు గరవయ్య.

    ఒక్క క్షణం రాజారావుకేమీ తోచలేదు.

    ఏమిటీ కాగితానికి అర్ధం? వార్తా పత్రికల్లో చదివిందాన్ని బట్టి _ ఇది మార్కిస్టు కమ్యీనిష్టుల కేనా సంబంధించి ఉండాలి __ లేదా నక్సక్లైట్లు చెందినదయి ఉండాలి.

    రాజారావు ఉల్లిక్కిపడ్డాడు.

    నక్సలైటు!

    ఇది తప్పకుండా నక్సలైటు సంబందించినదే అయుండాలి. మాయమయ్యాయి. అలా నిలబడే అతడు తీవ్రాలోచనలో పడ్డాడు. గరవయ్య మౌనంగా అతడినే చూస్తున్నాడు.

    టైము తొమ్మిదింపావు దాటింది.

    "లీలాసుందరి నిన్న రాత్రి సుదర్శనం ఇంటికి వెళ్ళింది. ఈ రోజు పది గంటలకు మా యింటికొస్తుంది అవునా?" అన్నాడు రాజారావు.

    గరవయ్య తలాడించాడు.

    "బహుశా _ఇది కేవలం నా అనుమానం కావచ్చు. కానీ అదే నిజమయితే __ నాకు నీ సాయం కావాలి. అప్పుడే ఊరంతా మాటుమణిగింది. ఇంకాసేపటిలో ఏమయినా వింతలు జరగవచ్చు. నువ్వు వీలయినంత రహస్యంగా మునసబుగారినీ , కారణంగారినీ, నర్సన్నగారినీ, నర్సన్నగారినీ కలిసి _ సుదర్శనం ఇంతలో పరిస్థితి వివరించి చెప్పి కొంతమందిని సాయం తీసుకుని సుదర్శనం ఇంతలో ప్రవేశించు . అక్కడైమైనా ఘోర దృశ్యం నీ కళ్ళబడితే _ వెంటనే వీలయినంతమంది యువకుల్ని వెంటబెట్టుకుని మనింటికి రా. అన్నట్లు ఈ రోజు లీలాసుందరి నాట్యం కోస్మాని ఓ యాభైమంది యువకులూళ్ళో దిగారు. మనవాళ్ళ సంఖ్య వాళ్ళను మించాలి. అజాగ్రత్త, ఆలస్యం _ రెండూ పనికిరానప్పుడు . నేను ఇంట్లోకి వెడుతున్నాను. నువ్వు రావడమాలస్య మయితే _ మీ కుటుంబమూ, మేమూకూడా ఏమయినా అయిపోవచ్చు __" అన్నాడు రాజారావు. అప్పుడే అతడి శరీరంలో వణుకు కూడా ప్రారంభించి౦ది.

    "అసలిదంతా ఏమిటి?" అన్నాడు గరవయ్య .

    "బహుశా నక్సలైట్లు మో __ మనూళ్ళో దిగారు. లీలాసుందరి వాళ్ళకు నాయుకురాలు కావచ్చు ....." అన్నాడు రాజారావు.

    గరవయ్య ఉలిక్కిపడ్డాడు.

    "గరవయ్యా _ నువ్వు రమాకాంతాన్ని మాత్రం కలవకు. ఆయనింట్లోనే  లీలాసుందరి ఉంటో౦ది. నువ్వు నేను చెప్పిన పని లీలాసుందరికీ, ఉంటోంది. నువ్వు నేను చెప్పిన పని లీలాసుమ్దరికీ, ఆమె బృందానికీ తెలియకుండా సాధించుకు రావాలి. తెలిసిందా?' అన్నాడు రాజారావు.   

 Previous Page Next Page