అప్పుడు చలమయ్య అనందమిఇర్తి రాసిన ఉత్తరం చదివి రాజేశ్వరికి వినిపించి _ "మరి నువ్వూ ఓ ఉత్తరం రాయాలి. మొడితనం చేస్తే ఇప్పుడు _ ఈ క్షణంలో నీకు రమాకాంతం రెండోభర్త అవుతాడు. శోభనం మా ఎదుటే జరుగుతుంది....." అన్నాడు.
రాజేశ్వరి కళ్ళలో నీళ్ళు. ఆమె భర్తవంక చూసింది. వాళ్ళెలా చెబితే అలా చేయమన్నట్టు చూశాడతను.
ప్రస్తుతం తన శరీరాన్ని కాపాడుకోవాలి. రాజేశ్వరి చలమయ్య ఆదించిన కాగితం, కాలం అందుకుంది.
చలమయ్య చెప్పడం ప్రారంభించాడు.
ప్రియమైన రమాకాంతానికి ప్రేమతో రాజేశ్వరి వ్రాయునది _
నేను గురవారం రాత్రి పన్నెండు గంటలకు మీరు మాఇంటికి రావలసిందిగా కోరుతున్నాను. మీ రూప సౌందర్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. మీ చిరునవ్వు నాకు మత్తెక్కిస్తోంది. ఇక ఆగలేను. నా భర్త గురించి మీరు భయపడవద్దు. కోరిన మగవాడితో సుఖంచడానికి నాకు భర్త అనుమతి ఉంది. సరయిన అవకాశం వస్తే నాకు నా భర్త అనుమతి ఉంది. సరయిన అవకాశం వస్తే యీ వూరి స్త్రీ పురుష సంబంధాల్లో గొప్ప మార్పు తేవలాని నా ఆశయం . యువతీ యువకులు హాయిగా, స్వేచ్చగా ఒకరి నొకరు అనుభవించగలిగితే ఎంత బాగుంటుంది ? మావారు ప్రెసిడెంటుయితే ఎంత బాగుంటుంది? మావారు ప్రెసిడెంటుయితే ఊళ్ళో అటువంటి మార్పులు చాలా తెవాలనుకుంటున్నారు. వాటి సంగతెలాగున్నా ఈ రోజు రాత్రి మీరు మా ఇంటికి తప్పక వచ్చి, నన్నాదింపజేస్తారని ఆశిస్తున్నాను. ఆ సమయానికి నా భర్త ఇంట్లో ఉండదు. ఎక్కడున్నదీ మన కనవసరం. మనకాయన అడ్డుగా ఉండరు. తప్పక వస్తారు కదూ?
ముద్దులతో మీ
రాజేశ్వరి __"
ఉత్తరంలోని ప్రతి అక్షరానికీ రాజేశ్వరి మనసు మూలిగింది. ఆమె వళ్ళంతా తేళ్ళూ, జేర్రాలూ పాకుతున్న ట్లుంది. కానీ తప్పదు. వంటిమీది అబద్దం కంటె కాగితం మీది అబద్దం కొంత నయం. ఎప్పటికయినా నిజం బయట పడకపోదు.
చలమయ్య ఆమెవద్ద నుంచి కాగితం తీసుకుని _ " మా రమాకాంతానికి స్త్రీలోత్వం లేదు. సీతమ్మ మొగుడి నందుకు కష్టపెట్టవలసొచ్చి౦ దంతే. నువ్వు బుద్ధిగా ఇంట్లో కూర్చునుంటే _ ఒక అరగంటలో మీ ఆయన్ను మా కూడా తీసుకుని వెళ్ళి పని ముగించుకుని _ ఒక అరగంటలో వెనక్కు పంపించేస్తాం. ఈలోగా ఇరుగు పోరుగులకు పిలిచి అల్లరి చేయాలనుకుంటే మాత్రం ప్రమాదం........" అన్నాడు.
భార్యాభర్త లిద్దరికీ కట్లు విప్పేశాడు రమాకాంతం.
"పద _ అరగంటలో వచ్చేద్దువుగాని ...."అన్నాడు చలమయ్య .
ఆనందమూర్తి కళ్ళలో జీవంలేదు. "తలుపెసుకో రాజేశ్వరీ!" అంటూ అతడు వాళ్ళతో బయటకు వెళ్ళాడు. భార్య ముఖం చూడ్డానికే అతడికి సిగ్గేసింది. ధన మానప్రాణ సంరక్షణ కలిగించవలసిన భర్తగా _ ఈ రోజు తన వీధిలో ఫేయిలయ్యా డతడు. ఆమెకు తన ముఖం చూపగలడా?
వాళ్ళు ముగ్గురూ బయటకు వెళ్ళాక రాజేశ్వరి తలుపులు వేసుకుంది. మరో రెండుగంటలకు అనందమూర్తి తిరిగి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన రాజేశ్వరి అతడి అవతారం చూసి తెల్లబోయింది.
అతడి బట్టలు పెలికలయ్యాయి. ముఖంమీద నెత్తురు జీరలు. నోట్లోంచి నెత్తురు చార. కళ్ళలో దైన్యం. అతడిప్పుడానంమూర్తి కాడు. విషాదమూర్తి!
"ఏం జరిగిందండీ?" ఏడ్పు నొక్కిపట్టుకుని అడిగిందామె.
"నేను రమాకాంతం భార్య సీతమ్మను చెరచబోయాను. ఆవిడ కేకలు విని, రమాకాంతం లేచి చుట్టుపక్కల వాళ్ళను కూడా పిలిచాడు. అంతా వచ్చి చూస్తే సీతమ్మా, నేనూ ఓ గదిలో ఉన్నాం ఆవిడ వంటినిండా రక్కులు చెప్పడానికేముంది? అంతా నన్నసహ్యించుకుని తలో చెయీ వేశారు. అసలు నా ప్రాణాలే పోవలసింది కానీ __ దయాహరుడయుడైన రమాకాంతం వాళ్ళను శాంతింపజేసి నన్ను క్షమించాడు. క్షమించేటప్పుడు __ "మళ్ళీ నీ ముఖం నాకూ, మా ఊరికీ మాత్రం చూపించకు _ ఫో! అన్నాడు ...." అన్నాడానందమూర్తి.
రాజేశ్వరి కళ్ళు ఎర్రబడ్డాయి _ "మేరీ ఇంతదారుణమా _ అసలు జరిగిందంతా ఊరివాళ్ళందరికీ చెప్పి......"
ఆమెను మధ్యలోనే వారించాడతడు _ "లాభంలేదే వెర్రి రాజూ! రమాకాంతం కథనం నీకు తెలుసా? నేను రాసిన ఉత్తరాన్ని సీతమ్మ అయన కిచ్చింది. అయన నాకు బాగా బుద్ధిచెప్పడం కోసం సీతమ్మ ఒప్పుకున్నట్లు కబురంపాడు. అది చూసి రాత్రికి నేను వెళ్ళాను. అయన సమయం చూసి నలుగుర్నీ పిలిచేడు. మనం రాసిన రెండుత్తరాలూ మనసుబుకిచ్చాడు. అక్కడున్న వాళ్ళంతా ఏకకంఠంతో _ నన్ను దుర్మార్గుడన్నారు. ఊపిరి పాడు చేయడానికి పుట్టిన మహాపాపినన్నారు. నిన్ను కూడా నానా మాటలూ అని అలిసి పోయి, ఎవరికళ్ళకు వాళ్ళు పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విన్నదే నిజంగానూ, మనం చెప్పేది కట్టుకథలాగానూ ఉంటుంది. ఆ ఉత్తరం వల్ల నర్సన్న కూడా నాకు శత్రువౌతాడు. ఊరంతా ఏకమై మన్ని గెంటేస్తారు...."
రాజేశ్వరి తలుపులు వేసి _ " ఎవరికీ ఎన్నడూ అపకారం చేయలేదే మనం! అటువంటిది మనం ఊరు ఊరంతకీ ఒక్క రాత్రిలో శత్రువులై పోయావా?" అంది.
అనందమూర్తికి విషాదపూరిత మందహాసం చేశాడు _ "ఈ లోకంలో ఎవరికీ అపకారం చేయకపోవడమూ, ఊరికి ఉపకారం చేద్దామనుకోవడమూ _ రేండూ కూడా ఎంతయినా మన్నించగల సమాజం బహిరంగంగా వీసామెత్తు అబద్దపూటారో పణల అవినీతిని కూడా సహించలేదు. ఈ ఊరి ప్రజలం నన్నేంరుగుడురు అందరితోపాటూ పుట్టి పెరిగినవాడినే నేను. కానీ ఈ రోజున రమాకాంతం సృష్టించిన కొన్ని అబద్దపు సాక్ష్యాలతో _ నేను భరించరాని వాడినయ్యాను. ఇంతటితో కాలేదు రాజూ __ రేపు మనింటి మీదికింకా జనం వస్తారు. రాళ్ళు రువ్వుతారు. శూలాల్లాంటి మాటలంటారు. వినలేనిబూతులు వినిపిస్తారు. మనమది భరించలేం. ఈ ఊళ్ళో పువ్వు లమ్మినఆనందమూర్తి చచ్చిపోయాడు. కట్టెలమ్ముకోవడం ఇక్కడ సాధ్యపడదు. మనం తక్షణం ఇక్కణ్ణించి వెళ్ళిపోదాం. భూమీ, పుట్రా అమ్మిపెట్టడానికీ _ ఇంటి వ్యవహారాలు ఫైసలు చేయించడానికీ నేను తర్వాత మనవాళ్ళ నేవర్నయినా పంపిస్తాను __ పద, పోదాం!"
అవమానం భరించలేక, ఉన్నవాడున్నట్లుగా యిల్లు కదిలేడు. అర్ధరాత్రి కటిక చీకటీలో, కట్టుకున్న ఇల్లాలితో, కొద్దిపాటి సామానుతో, పాలేరు కట్టిన రెండడ్లబండి మీద అతడు ఊర్నించి బయట పడ్డాడు.
ఆనందమూర్తి ఇంటి తాళం _ మర్నాడు గ్రామ పౌరుల్నందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆనందమూర్తి కథ ఊరంతా ప్రచారం కాగా _ ఆ యింటి తాళం చలమయ్య, రమాకాంతంల ఆరోపణలకు మరింత బలపరిచింది.
రాజేశ్వరి , ఆనందమూర్తిల ఉత్తరాల వివరాలూరంతా తెలిశాయి. అందమయిన రాజేశ్వరి తామందరికీ అందుబాటయినదేనని తెలిసేక , ఊళ్ళోని యువకులు చాలామంది _ అయ్యో _ వెళ్ళిపొయిందేనని బాధపడ్డం మాత్రమే కాక. ఆమెను గురించి రకరకాలుగా అసభ్య చర్చలు జరిపారు.
ఎక్కడో ఒకరిద్దరు ఆనందమూర్తి అలాంటివాడంటే నమ్మలేకపోయినా _ ఆ విషయాన్ని పైకి అనలేకపోయారు. ఊరు ఊరంతా ఏకగ్రీవంగా విమర్శింస్తున్నప్పుడు _ ఎవరెవరు చెప్పగలరు?
ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆనందమూర్తి బంధువొకడు వచ్చి _ అతడి ఆస్తిని వచ్చిన ధరకు అమ్మేసి వెళ్ళాడు. అనండమూర్తికా గ్రామం ఋణం తీరిపోయింది.
తర్వాత ఆనందమూర్తి గురించిన వివరాలేవరికీ తెలియలేదు కానీ, రమాకాంతం, ప్రెసిడెంటుగా ఎన్నికయిన నాలుగ రోజులకి _ చలమయ్యకూ, రమాకాంతానికకీ చెరో ఉత్తరం వచ్చింది. రెండింట్లోనూ ఒక్కటే విషయం.
"కుట్ర పన్ని నన్నూళ్ళోంచి తరిమేశావు కదూ! వస్తాను. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి పగ తీర్చుకుంటాను. జన్మజన్మలకూ మరచిపోలేని విధంగా పగ తీర్చుకుంటాను.
ఆనందమూర్తి __"