Previous Page Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 31

                                                                       

                                              19        
   
      ఉలిక్కిపడ్డాడు  రమాకాంతం.

    "ఏనాటి సంగతిది? కానీ ఎంత భయంకరమైనది?"

    తను _ ఈ నాడిక్కడ చెప్పేకోతగ్గ పెద్దమనిషిగా చెలామణీ అవుతున్న తను _ ఒకనాడింత ఘోరం చేశాడంటే ప్రజలు నమ్మగలరా? ప్రజల సంగాతెందుకు _ తనే నమ్మలేకపోతున్నాడు. ఆ రోజు తను రాజేశ్వరి తాకినప్పుడు _ ఆమె బట్టలు వలిచినప్పుడు _ తనలో ఎక్కడా శృంగార భావాలు లేవు. శరీరాన్ని పూర్తిగా భయం ఆవరించింది. ఆమెను నగ్నంగా చూసినప్పుడు కూడా తన నరాల్లో వేడి పుట్టలేదు. వణుకు _ పాప భీతివల్ల కలిగిన వణుకు తనకు కలిగిందప్పుడు. ఆ వణుకు ఇప్పటికీ _ ఆ విశేషం తలచుకున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంది. అయితే ఆ రోజు తానలా ఎలా ప్రవర్తించగలిగాడు?

    తనకున్న పదవీ వ్యామోహం, చలమయ్య కర్కశాత్వం తనను మార్చివేశాయి. ఫలితంగా రాక్షసడయి పోయాడు. ఆ తర్వతే ప్రెసిడెంటుయ్యాడు.

    నిజానికి రమాకాంతం మరీ అంత దుర్మార్గుడు కాదు.  ఎన్నికయ్యేక ఊరికి చేసిన ఉపకారమేఎ లేకపోయినా అపకారమూ లేదు. ఇప్పుడా ప్రెసిడెంటు గిరీయే ఆయనకు బ్రతుకు తెరువుగా వుంది. నెమ్మదిగా ఊళ్ళో నలుగురిచేతా మంచివాడనిపించుకుని, తనకు పోటీలేకుండా చూసుకున్నాడు. అయన చాకచక్యం వల్ల నర్సన్న ఒక్కసారి కూడా ఎన్నికల్లో నెగ్గలేకపోయాడు.

    రమాకాంతం పాత ఆలోచనన్లల్లోంచి ఓసారి వాస్తవం లోకి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆయనకు నక్సలైట్ రాజారావు గుర్తుకొచ్చాడు.

    ఊళ్ళో దారుణాలు చేసిన పెద్ద మనుషులను మట్టుపెట్టె నక్సలైటు _ రాజారావు! దుర్మార్గులు చేసిన వాళ్ళను నిర్ధాక్షీణ్యంగా నడివీధుల్లో కీడ్చి __ బల్లెలలో పొడిచి క్రూరంగా చంపేనక్స్లైటు రాజారావు. పెత్తందార్లు స్రీలను బయటకు లాగి బట్టలూడదీసి, అమానుషంగా మానభంగం చేసే నక్సలైటు రాజారావు ......

    మరి తను .....

    తనూ ఇంచుమించు ఇలాంటి ఘోరాలు చేశాడు. చలంయ్యా చేశాడు. మరి నక్సలైటన్న పేరు తమ కెందుకు రాలేదు?

    "నేనిప్పుడు అలోచించవలసినది కాదు __" అనుకున్నాడు రమాకాంతం __

    "రాజారావు లిప్తులో చలమయ్య ఉన్న మాట తధ్యం. మరి నా మాటేమిటి?"

    ఎప్పుడో పోలీసులోచ్చి అతణ్ణి పట్టుకుంటారని ఆశపడితే ప్రయోజనం లేదు. నక్సలైట్లు చేసే ఘోరాలను పోలీసులపలేకపోతున్నారు. పోనీ తను ముందుగానే రాజారావు గురించి పోలీసు రిపోర్టద్దామ౦టే ఏ విధమయిన ఆధారాలూ లేవు ఎలా?

    చివరకు ధైర్యంగా ఊరుకోవడమే మంచిదని రమాకాంతం అనుకున్నాడు. రాజారావులో ఎక్కడా నక్సలైటు లక్షణాలు కనిపించడంలేదు . తనింట్లో ఉంటున్న ఆ సీఐడీ పోరాబడ్డాడేమో!

    "ఏదేమయినా ఈ విషయంలో చలమయ్యను హెచ్చరించాలి. ఎంత లేదన్నా ఒకప్పుడు నేను పైకిరావడానికి సాయపడ్డాడు గదా __" అనుకున్నా డాయన.

                                                                      20


    ఒకటి కూచిపూడి, రెండవది జానపదం, మూడవది పాశ్చాతం __ లీలాసుమ్దరి నాట్య ప్రదర్శన అద్భుతంగా జరిగింది..

    ఆమె నాట్యం అక్కడి వారందరికీ గొప్ప వినోదాన్నిచ్చింది.

    కూచిపూడి బాలగోపాల తరంగం పూర్తీకాగానే చదివింపుల పేరుతొ ఆమెకు చాలా డబ్బోచ్చింది. ఆ ఉత్సాహంతో ఆమె రెండు ఎంకీ పాటలనెన్నుకుని జానపద నృత్యం చేసింది. ప్రజల్లో మిన్నుముడుతున్నా ఉత్సాహం చూసి __ వాళ్ళను మరింత రెచ్చగిత్తదానికా అన్నట్టు _ అర్ధనగ్న వేషంతో పాశ్చాత్య నృత్యం చేసింది. మొదటి రెండు నృత్యాలూ మనోల్లాసం కలిగిస్తే _ మూడో నృత్యం ప్రేక్షుకుల శరీరాల్లో వేడిని పుట్టించింది. కళ్ళు చిట్లిస్తూ వ్రుద్ధులా, ఛీ ఛీ అంటూనే ఆడవాళ్ళూ కూడా _ నృత్యం చివరిదాకా ఉన్నారు.

    నృత్యం ముగియగానే చాలామంది వెళ్ళిపోయారు" కొందరు పెద్దలూ, మరికొందరు యువకులూ ఆమెను ప్రత్యేకంగా కలుసుకోవాలని మనసుపడి ఉండిపోయారు. వాళ్ళలో సుదర్శనం కూడా ఉన్నాడు.

    బట్టలు మార్చుకుని _ అప్సరసలా వచ్చిన లీలాసుందరి వంకనే కళ్ళప్పగించి చూస్తూ _ మనసులోని కోరికలేలా బయట పెట్టాలో తెలియక మధనపడుతూ _ అందరూ కూడా మర్నాడు తమ ఇంటికామేను ఆహ్వానించారు. మిగతావాళ్ళు మాట్లాడుతున్నతసేపూ సుదర్శనం వాళ్ళవంకే నిరసనగా చూస్తూ తనలో తనే నవ్వుకున్నాడు తప్పితే, తనేమీ మాట్లాడలేదు.

    లీలాసుందరి నవ్వి _ "ఇంతమంది౦టికి ఒక్క రోజులో ఎలా రాగాలను? అందులోనూ పగలు నాకు తీరబడుండదు రకరకాల నృత్యసాధన చేయాలి. ఎవరికంటికయినా రాత్రి తొమ్మిది దాటాకనే రాగాలను. అప్పుడు ప్రారంభించి ఎందరిళ్ళని తిరగను? అదీకాక తీరా ఒకరింటికి వెళ్ళేక అక్కడో గంటకయినా ఉండాలి కదా _" అంది.

    ఆమె యింత చొరవగా, తెలివిగా మనసువిప్పి బయటపెడుతుందని అనుకొని పెద్దలందరిలోనూ అప్పుడు మరింతగా ఆశలు రేగాయి. ఆమె అందం చాలామందిని ఆకర్షించింది. అందులోనూ నర్తకి కదా అని మరింత ఆశ .... ఇప్పుడామె మాటలు వినగానే వారికి ధైర్యంతో పటు ఉత్సాహమూ కలిగింది.

    వారి ముఖకవళికలు గమనిస్తూనే _ "రేపు రాత్రి చలమయ్యగా రింటికి వెడదామనుకుంటున్నాను _ " అంది లీల సుందరి మళ్ళీ.

    అప్పుడు చంయ్యక్కగలిగిన ఉత్సాహమింతా అంతాకాదు. అతడి ముఖంలో యౌవనపు కళ తిరిగి వచ్చింది.

    "ఉన్నట్లుండి సుదర్శనం _ "ఇంకా అది రేపు రాత్రి సంగతి కదా _ ఈ రాత్రికి యింటికి రండి _" అన్నాడు.

    ఈ బహిరంగపు టహ్వానానికిచాలామంది తెల్లబోయారు. దీనికి లీలాసుందరిక్కోపం రావచ్చునని కూడా తొందరనుకున్నారు. మామూలు వేశ్య కూడా పదిమందిలో ఇలా అడిగితె సాచి లెంపకాయ కొడుతుంది.

    ఇప్పుడు లీలాసుందరి మాత్రం సుదర్శనం ఆహ్వానానికి చలించలేదు. ఆగ్రహించలేదు _ సరిగదా చంద్రుడివంటి వెన్నెలలు కురిపించే చిరునవ్వుతో _ "సరే ! మీరు యువకులు కూడా. మనం మాట్లాడుకోవలసిన విషయలెన్నో ఉంటాయి. మన అభిప్రాయాలు కూడా చాలా విషయాల్లో కలుస్తాయి. ఈ రోజున మీకిది అనుకొని అవకాశం _ ....." అంది.

 Previous Page Next Page