"ప్రియమైన సీతమ్మకు ఆనందమూర్తి ప్రేమతో వ్రాయునది...."
ఆనందమూర్తి కోపంగా చలమయ్య వంక చూసి, రాయనన్నట్టు బుర్ర అడ్డంగా తిప్పాడు.
"రాయకపోతే అటు చూడు _ నీ భార్య గతేమిటటో?" అన్నాడు చలమయ్య.
ఆనందమూర్తి భార్యవంక చూశాడు . అప్పుడే రమాకాంతం ఆమెను రెండు చేతులతో ఎత్తి పడక గదివైపు తీసుకుని పోయాడు.
చలమయ్య మళ్ళీ _ "ఏ ఘోరం జరిగినా నువ్వుత్తరం రాయణప్పుడే! ఆ హామీ నేనివ్వగలను ...." అని అంటూండగా పడకగది తలుపులు మూసుకున్నాయి.
అనందమూర్తికి ఆవేశం కలిగింది. అతడు కోపంగా చలమయ్య వంక చూశాడు.
"అలా చూస్తె బెదిరేవాళ్ళెవ్వరూ లేరిక్కడ. ముందు రాస్తావావు, రాయవావు చెప్పు ...." అన్నాడు.
మూర్తి ఆవేశంగా తల అడ్డంగా ఊపాడు.
"నీకు నాపైన కంటే రమాకాంతం మీద నమ్మకమెక్కువున్నట్లుంది. చూద్దువుగాని నా ప్రతాపం ..." అంటూ ఒక చేత్తో కత్తి చూపిస్తూ, రెండో చేత్తో నెట్టుకుంటూ పడకగది గుమ్మందాకా అతడానందమూర్తిని తీసుకుని వెళ్ళి _ "రమాకాంతం __ మూర్తికి నమ్మకంగా లేదు. ముందొక టియ్యి....." అన్నాడు.
గది తలుపులు సగానికి తెరుచుకున్నాయి. గదిలోంచి రెండు చేతులు బయటకు వచ్చాయి. వాటిలో ఒక చీర ఉంది. అది రాజేశ్వరి కొద్ది క్షణాల క్రితంవరకూ కట్టుకున్న చీర.
అరవాల౦టే నోరులేదు. ఆనందమూర్తి బాధగా కళ్ళు మూసుకున్నాడు.
"రామాకాంతం .... ఇంకొకటియ్యి........" అన్నాడు చలమయ్య మళ్ళీ.
ఈసారి ఆమె కట్టిన రవిశ వచ్చింది.
మూర్తికి మనసంతా బడహతో నిండిపోయింది. తానిప్పుడే౦ చేయాలి? అతడి బుర్ర పనిచేయడంలేదు.
"రమాకాంతం .... ఇంకొకటి ...." అన్నాడు చలమయ్య.
"ఇంకేమీ లేవు ...." అన్నాడు రమాకాంతం.
చలమయ్య క్రూరంగా మూర్తివంకచూసి _ "ఇక నేనుచెప్పినట్లు వినకపోతే _ జరగబోయేదంతా నీ కళ్ళముందే జరుగుతుంది ....." అన్నాడు.
మూర్తి చటుక్కున రాయడానికి చెప్పడం ప్రారంభించాడు.
"ప్రియమయిన సీతమ్మకు ఆనందమూర్తి ప్రేమతో వ్రాయునది _ నేను చాలా ధైర్యంచేసి రాస్తున్న ఈ ఉత్తరం నువ్వింకేవరికీ చూపించవని ఆశిస్తున్నాను. మొదటిసారి చూసినపుడే నాకు నీమీద మనసయింది. నీవంటి అందగత్తెకు నావంటి రసికుడే సరయిన జోడు. ఆ రమాకాంతంతో నువ్వెలా కాపురం చేస్తున్నావో నాకర్ధం కాదు. రెండు మూడుసార్లు మనూరి కాలవలో స్నానం చేస్తున్నప్పుడు నీ అందం చూసి మతి పోగొట్టుకున్నాను. నీకూ నామీద ప్రేముంది కానీ, నేనటువంటి వాణ్ని కాదని భ్రమపడుతున్నా వనుకుంటాను. అందుకే ఎన్నడూ ధైర్యంచేసి నాతో మాట్లాడలేదు. నిజానికి నేను స్త్రీలోలుణ్ని.ఆడవాళ్ళను సంతోషపెట్టె విద్యల నేకం నాకు తెలుసు. అసలు నా మంచి తనమంతా ఆడవాళ్ళ నాకర్షించడానికే. మంచితనం ముసుగులో ఇలాంటివి దాచడం సులభం. వివాహమయిన స్త్రీ పరాయి మగవాణ్నిచేరడం తప్పని నువ్వనుకుం టే అది పొరపాటు. ఈ జీవితం కేవలం అనందం కోసం. స్త్రీ పురుషుడి కోసమూ, జీవించడంలోనే ఆనందముంది. ఎంతమంది పురుషులనుభవిస్తే ఆడదానికంత అనందం. అదెంతవరకూ నిజమో _ నీకు రేపటి మన కలయికలో తెలుస్తుంది. మరి నా భార్య విషయమంటావేమో _ ఆమెకూ నేను పూర్తీ స్వతంత్రాన్నిచ్చాను. ఆమె కోరిన పురుషుడితో సుఖంచవచ్చు. ఇపుడామే నీ భర్తను కాక్షింస్తోంది. నేను కూడా అభ్యంతర పెట్టాను. అందువల్ల నువ్వు నాకు దక్కుతావు. నీభర్తను న భార్య వశపరచుకుంటే ప్రెసిడెంటు పదవి కూడా నాదే! నీమీద నమ్మకముంచి నేనీ విషయం బట్టబయలు చేస్తున్నాయి. మరో రహస్యం _ నేను నర్సన్నతో చేయి కలిపింది. కూడా అతడి భార్య కోసమే! ఇంకా ప్రయత్నాలు మొదలవలేదు. ముందు నీవంటి అపురూప సౌదర్య వతిలో ప్రారంభించాలని నా ఆశయం. ఈ ఉత్తరాన్నె వారికీ చూపక భద్రంగా దాచుకో . రేపు రాత్రి నా దగ్గర స్వరం చూసి _ అది నచ్చకపొతే _ అప్పుడు నువ్వు నీ నరకంలోనే ఉండిపోదువుగాని. ఉంటాను మరి. నీ ఇష్టాన్ని నాకు తెలియబరువస్తావు కదూ!
నీ
ఆనందమూర్తి."
ఉత్తరం రాయడం పూర్తీకాగానే చలమయ్య కాగితం లాక్కుని _ " రమాకాంతం __ పాపం ఆ ఆడకూతురలా ఎంతసేపు నిలబడుతుంది. చేతికట్టు విప్పి, చీర కట్టుకోమను......" అన్నాడు.
గది తలుపులు మళ్ళీ ఓరవాకిలిగా తెరచుకున్నాయి. చలమయ్య బయటకువచ్చిన రమాకాంతం చేతులకు చీర, రవిక అందించాడు. ఆ తర్వాత కాసేపటికి గది తలుపులు పూర్తిగా తెరచుకున్నాయి.
"లోపలకు పద __" అంటూ చలమయ్య ఆనందమూర్తిని గదిలోకి తోశాడు. అక్కడ రామాకాంతం మళ్ళీ అనందమూర్తికి చేతులు కట్టేశాడు.